Monday, October 1, 2012

Child Labour in Srikakulam-శ్రీకాకుళం జిల్లాలో బాలకార్మికులు


  •  
బాలకార్మికులు కనిపిస్తే అధికారులపై చర్యలు,నేటికీ బాలకార్మిక వ్యవస్థ ఉండడం బాధాకరం,బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌,ఐసీడీఎస్‌  పనితీరుపై ఆగ్రహం--- శ్రీకాకుళం కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ 30-Sept.2012.
  •  బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చట్టం తెచ్చిచాలా ఏళ్లు గడుస్తున్నా నేటికీ జిల్లాలో కనిపిస్తుండడం బాధాకరం... బాలకార్మికులు లేకుండా  అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి... బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై,  దుకు ప్రొత్సహించేవారిపై కేసులు నమోదు చేయండి... నాకు  ఎక్కడైనా, ఎప్పుడైనా బాలకార్మికులు ఎదురు పడినా, బాలకార్మికులున్నట్లు తెలిసినా సంబంధిత  అధికారులపై చర్యలు తప్పవు' అని కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌  అధికారులను ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశమందిరంలో శనివారం సమీకృత బాలల రక్షణ పథకంపై నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ  సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాల కార్మికులు కనిపిస్తే నిర్లక్ష్యంగా  వ్యవహరించరాదన్నారు. కొందరు వైద్యులు బాలకార్మికులకు సంబంధించి తప్పుడు వయసు ధ్రువ పత్రాలు మంజూరు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని  తెలిపారు. అటువంటి చర్యలను విడనాడాలన్నారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసు, ఐసీడీఎస్‌, కార్మికశాఖతో పాటు సంబంధిత శాఖల  అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పిల్లలను పనిలో పెట్టే కుటుంబాలకు రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని శిశుగృహాలు, బాలసదనాల పనితీరును కూడా ఎప్పుటికప్పుడు పరిశీలించాలన్నారు. ఒకరిద్దరు శిశుగృహాలను రద్దు చేసి వాటిని వేరే చోటకు తరలించాలని  ఆయన ఆదేశించారు. ఐసీపీఎస్‌ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం పోలీసుస్టేషన్లలో ప్లెక్సీల్లో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.

  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌
జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అన్ని రకాల పరిశ్రమలు, సంస్థలు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు. బాలకార్మికులున్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు  చేయాలని సూచించారు. తానే స్వయంగా తనిఖీలు నిర్వహిస్తానని, తనిఖీల్లో కేసులు నమోదు చేయనట్లు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. బాలసదనాలు,శిశుగృహలు, అనాథ శరణాలయాలకు దరఖాస్తు చేసుకుంటే పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే  అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. బాలల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు ప్రసాదరావు మాట్లాడుతూ తమ కమిటీ నిరాదరణకు గురైన పిల్లను రక్షించేందుకు కృషి చేస్తోందని, బాలకార్మికులు, అనాథ పిల్లలను గుర్తించినట్లయితే వెంటనే సీడబ్ల్యూసీకి తెలియజేయాలన్నారు. సీడబ్ల్యూసీకి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అధికారాలుంటాయని,

ఎన్‌సీఎల్‌పీ పీడీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 11,658 మంది బాలకార్మికులు, అనాథ పిల్లలను జీవన స్రవంతిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హిర మండంలో యానాది జాతివారు ఉన్నారని, వారికి కుల ధ్రువపత్రాలు మంజూరు   చేయడంలేదని, దీంతో వారు చదువులకు దూరమవుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ వెంటనే ధ్రువపత్రాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు.

  • ఐసీడీఎస్‌ పీడీపై ఆగ్రహం :
సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ టి.వి.శ్రీనివాస్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జిల్లాలో శిశుగృహాలు, బాలసదనాలతో పాటు పలు అంశాలకు సంబంధించి ఐసీడీఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే ఐసీడీఎస్‌ నుంచి ఎటువంటి సహకారం  అందడంలేదని, సరైన సమాధానం కూడా చెప్పడం లేదని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి పీడీ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా మీరు ఏమీ చెప్పనవసరం లేదని, మీ పనితీరు గూర్చి తెలుసునని, పనితీరు మార్చుకోవాలని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఐసీపీఎస్‌ కార్యకలాపాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్‌, ఇతర  అధికారులతో కలిసి అవిష్కరించారు.


 Child labour , బాలకార్మిక వ్యవస్థ.

14 ఏళ్ళ లోపు పిల్లల హోటళ్లలో అంట్లు తోమటం, పశువుల కాపరిలుగా, ఇల్ల నిర్మాణంలో, వ్యవసాయ కూలీలుగా, బీడీలు చుట్టడం, కార్మాగారాల్లో పనిచేయడం, ఉద్యోగస్తుల, ప్రజాప్రతి నిధుల ఇల్లలో వెట్టి చాకిరి చేయడం, వంటివాటిని బాలకార్మిక చట్టనేరం గా పరిగణిస్తారు .  5 నుంచి 14 ఏళ్ళ లోపు బాల కార్మికుల సంఖ్య 158 మిలియన్లుగా యునైటెడ్‌ నేష న్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యునిసెఫ్‌) అంచనా వేసింది. అంటే ప్రతీ ఆరు మంది పిల్లల్లో ఒకరు బాల కార్మికులుగా ఉన్నట్లు లెక్క. మన రాష్ట్రంలోనూ బాలకార్మికత అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా వ్యవసాయంలో విత్తనోత్పత్తి రంగంలో దీన్ని గమనించవచ్చు.  పొగాకు, ఇటుక బట్టీలు, దుస్తుల తయారీ, ప్లాస్టిక్‌ పరిశ్రమ తదితరాల్లోనూ బాలకార్మికులు అధికంగా ఉన్నారు. జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది  కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి. బాల కార్మిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసి
చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేయమని 1979 లో గురుపాదస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమస్యను   కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని వివరణాత్మకమైన సిఫారసులను కూడా ఆ కమిటీ చేసింది. దారిద్ర్యం కొనసాగుతున్నంతవరకూ బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం అసాధ్యమన్నారు. గురుపాదస్వామి సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ(నిషేధం-నియంత్రణ) అనే చట్టం 1986 లో సిద్ధం చేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తించి వాటిలో పిల్లలు పనిచేయడం నిషేధించింది. మరి కొన్నింటిలో పనిచేసే  పరిస్థితుల్ని చట్ట ప్రకారం  నియంత్రించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ చట్ట ప్రకారం బాలకార్మిక సాంకేతిక సలహా సమితిని ఏర్పాటు చేసి ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలను గుర్తింపజేసి జాబితాను విస్తరింప చేశారు. ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987 లో రూపొందించారు. దీని ప్రకారం క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఆయా ప్రమాదకరమైన వృత్తుల్లో పని చేసే పిల్లలకు మొట్ట మొదట పునరావాస సదుపాయం కల్పించారు. బాలకార్మికుల జానాభా లెక్కలు   తీయడానికి ఏర్పాట్లు చేశారు.

బాలకార్మిక వ్యవస్ధకు కారణాలు

    జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనాప్రకారం బాలలు పనులలోకి నెట్టబడుతున్నారు. ఎందుచేతనంటే వారు సులువుగా దోపిడికి గురౌతారు.  బాలలు విరుద్ధమైన  మరియు వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయుటకు సాధారణంగా మొట్టమొదటి కారణం పేదరికం. జనాభా పెరుగుదల, చౌకైన పనివారు,  చట్టాలను అమలుపరచనందు వల్ల, తల్లితండ్రులు తమ పిల్లలను బడికి పంపుటకు ఇష్టపడకపోవడము (పిల్లలను పనికి పంపితే తమ ఆర్ధికపరిస్ధితి మెరుగవుతుందనే ఉద్దేశంతో) మరియు గ్రామీణప్రాంతాలలోని అతిపేదరికం కూడా బాలకార్మిక వ్యవస్ధకు  కారణాలు. పిల్లలు పనికి వెళ్తేనే ఆ కుటుంబానికే జీవనాధారమైనపుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు?


“పిల్లలందరూ పనిలో కాదు - బడిలో ఉండాలి” అనే నినాదంపై అందరూ కలిసి “పనిచేస్తే ప్రస్తుతం మన ముందున్న పెద్ద సమస్య అయిన “బాలకార్మిక వ్యవస్థ” ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. అప్పడు పిల్లలు వారి బాల్యపు హక్కును ఆదనంగా గడుపుతారు. ప్రపంచంలో అతి పెద్ద బాలకార్మిక సైన్యం గల ఘనత మన దేశానిదే. ఒక అంచనా ప్రకారం చాకిరీకి బాల్యాన్ని బలి పెడుతున్న మొత్తం ప్రపంచ బాలల్లో మనదేశం పిల్లలు మూడవ వంతు....దీనివల్ల తలెత్తే దుష్పరిణామాలు లెక్కలేనన్ని. మన దేశంలోని 50 శాతం పిల్లలు తమ బాల్యపు హక్కును పోగొట్టుకొని విద్యాగంధం లేని బాల కార్మికులుగా మారుతున్నారు. వాళ్ళ సహజ సామర్థ్యాలను వెలికి తీసుకొనే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇలాంటి దుస్థితిగల ఏ దేశమూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు.

సానుకూలాంశాలపై కార్యక్రమ రూపకల్పన, తల్లదండ్రులపై, పిల్లల్ని, చదివించుకోవాలన్న వారి కోరికపై విశ్వాసం, దీనికిగల పేదల శక్తి సామర్థ్యాలపై
నమ్మకం, బడి మాత్రమే పని నుంచి మాన్పించిన పిల్లల్ని ఇముఢ్చుకొనగలదన్న దృక్పథం మార్గదర్శక సూత్రాలుగా మనం పెట్టుకోవాలి. ఎక్కడా వీటిపై  రాజీ  పడకూడదు.
  • =========================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !