కొండలను బండలుగా చేసి... ఆ బండలను చిన్నచిన్న ముక్కలుగా మార్చేసి.. తద్వారా వచ్చిన ధూళి కణాలను జనంపైకి వదిలేస్తున్న స్టోన్‌క్రషర్ లు జిల్లాలో అధికారికంగా 80 స్టోన్‌క్రషర్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 30 క్రషర్లు నడుస్తున్నాయి. క్రషర్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ.. ఏదీ అమలు కావటం లేదు. బూడిద, ధూళి కణాలను నిస్సిగ్గుగా జనంపైకి వదిలేస్తున్నారు. ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్న రీతిలో కొందరు క్రషర్ యజమానులు వ్యవహరిస్తున్నారు. పచ్చని పంటలు సైతం దుమ్ము కొట్టుకుపోయి నిస్సారంగా మారిపోతున్నాయి.
* 1999లో ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిబంధనలు :
- నివాస ప్రాంతాలు,, దేవాలయాలు, పాఠశాలలకు 800 మీటర్ల దూరం..
- జాతీయ రహదారికి 500 మీటర్లు,
- ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులకు 100 మీటర్ల దూరంలో క్రషర్ ఉండాలి.
- * క్వారీ ప్రాంతంలోనే స్టోన్‌క్రషర్ ఏర్పాటు చేస్తే మూడున్నర ఎకరాల స్థలం ఉండాలి.
- క్వారీ లేనిచోట క్రషర్ ఉంటే 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి.
- * దుమ్ము బయటకు వెళ్లకుండా పూర్తిగా తొడుగులు కప్పి ఉంచాలి.
- బూడిద ఎగరకుండా ఉండేందుకు నీటి స్ప్రింకర్లు ఉండాలి.
- క్రషర్ ఉండేచోట పచ్చదనం ఉండాలి. మొక్కలను నాటాలి. చెట్లను పెంచాలి.
- పనిచేసే కార్మికులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలి.
- ఎవరైతే పనిచేస్తున్నారో వారి జాబితా కార్మికశాఖకు అందజేయాలి.
పక్కనున్న పొలాలు పనికిరాకుండా పోతున్నా పట్టించుకోవటం లేదు.
- * స్టోన్‌క్రషర్ల దుమ్ము కారణంగా ఎలర్జీ, ఊపిరితిత్తులపై న్యూమోకొనియోసిస్ అనే వ్యాధి సక్రమించే అవకాశం ఉంది. దీనివల్ల ఆయాసం, సైన్‌ఫైటిస్ వల్ల తలనొప్పి వస్తుంది.
- కళ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
- పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయి.
- ఊపిరితిత్తుల నాళాలకు దుమ్ము పట్టేయడం వల్ల దగ్గు, జలుబు, ఆయాసం పెరుగుతాయి. దీనివల్ల శ్వాస సంబంధ వ్యాధులు తలెత్తుతాయి.
- * క్రషర్స్ దుమ్ములో సూక్ష్మాతి సూక్ష్మమైన రాతి రేణువులు ఉంటాయి. అవి పాదచారులు, వాహనచోదకుల కంట్లోకి వెళితే కార్నియా పక్కల అంటుకుంటుంది. ఫలితంగా కళ్లు వాచిపోతాయి. కళ్లు ఎర్రబడి, కంట్లో నుంచి నీరు వస్తుంది. రుద్దితే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- * క్రషర్స్ దుమ్ము పీల్చడం వల్ల ముక్కులోంచి కంటి నరాలకు వెళ్లే మార్గంలో ఆటంకం ఏర్పడి సైనసైటీస్ (తలదిబ్బడ, తీవ్రమైన తలనొప్పి, కళ్లు లాగడం) తదితర వ్యాధులు సంభవిస్తాయి. చెవిలోకి దుమ్ము ప్రవేశించడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది.
- నోటితో పీల్చుకోవడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
- * స్టోన్ క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము పంటలపై పేరుకుపోతే కిరణజన్య సంయోగ క్రియకు ఆటకం ఏర్పడుతుంది. ఆకులు ఎండిపోయి మొక్క చనిపోయే పరిస్థితి ఉంది.
- రాయి నుంచి వచ్చే దుమ్ము భూమి మీద పొరలా ఏర్పడితే నీటి నిల్వ సామర్థ్యం పడిపోయి ప్రమాదం ఉంది.
- మామిడిపూత మీద వరసగా రెండేళ్లు స్టోన్‌క్రషర్స్ దుమ్ము పడితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.
- మినుము, పెసలు మొక్కలైతే చనిపోయే ప్రమాదం ఉంది. దిగుబడి శాతం 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గిపోతుంది.
- దుమ్ము ధూళి కారణంగా రహదారిపై వాహనాలు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నాం.
- ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి కాబట్టి వాహనాల ద్రైవలు ప్రమాదాలు చేసే అవకాషాలు.
- ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము.. ధూళి వల్ల ఏమీ కనిపించడంలేదు.
- రహదారి పూర్తిగా దెబ్బతింది. పచ్చటి చెట్లు.. పంట పొలాలు తెల్లటి బూడిదతో నిండిపోతున్నాయి.
వలస వెళ్లిపోతున్నాం
- ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. పిల్లలు ఉన్నత పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. క్రషర్ల నుంచి వచ్చే బూడిద వల్ల పంటలు పండడంలేదు. వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతున్నాయి. ee ప్రాంతంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నాం.
టీబీ వ్యాధులు ఎక్కువయ్యాయి
- దుమ్ము.. ధూళి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇటీవల వైద్యులు వచ్చి గ్రామంలో ఎక్కువ మంది టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. వాహనాలు నిత్యం తిరుగుతుండడంతో పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- ===============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !