శ్రీకాకుళం జిల్లాలో పది టూరిజం స్పాట్స్ లో సాలిహుండాం కి ఒక సముచిత స్థానము ఉన్నది . ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశము . సాలిహుండాం వంశధార నది దక్షిణ ఒడ్డున బోరవానిపేట గ్రామానికి ఆనుకొని కళింగపట్నం కి 05 కిలోమీటర్లు , శ్రీకాకుళం టౌన్ కి 18 కిలోమీటర్ల దూరములో ఉన్నది . ఈ Buddist hill ని సాలివాటిక (Rice emporium) అని పిలుస్తారు . ఈ కొండపైన పురాతన వేణుగోపాలస్వామి ఆలయము సాలివాహన కాలము నుండి వెలసియున్నట్లు చరిత్ర చెబుతోంది . ప్రతిసంవత్సరము భీష్మ ఏకాదశి రోజున వమరవిల్లి రెడ్డి వారి కుటుంబీకులు వేణుగోపాలస్వామి పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నారు . దీనినే కాళీయ మర్దన వేణుగోపాలుని యాత్ర , సాలిహుండాం యాత్ర(Salihundam yatra)లేదా '' కొండమీద యాత్ర '' అని పిలుస్తారు . సాలిహుండాం జాతరకు వివిధ జిల్లాల నుంచి ప్రయాణీకులు అత్యధిక సంఖ్యలో వస్తారు . ప్రక్క రాస్టమైన ఒరిస్సా నుండి చాలామంది భక్తులు ఈ శ్రీక్రిష్ణ దేవుని దర్శించడానికి వస్తూఉంటారు . భీష్మ ఏకాదశి జాతరను సాలిహుండాం గ్రామస్తులు తమ ఊరి ఉత్సవంగా భావించి ఆనందోత్సాహలతో జరుపుకుంటారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శాలిహుండం వేణుగోపాలుని యాత్రను శుక్రవారం(03/feb/2012 నిర్వహించనున్నారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి(భీష్మఏకాదశి)రోజున నిర్వహించే ఈ యాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి సుమారు 50వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. 12వ శతాబ్దానికిచెందినదిగా భావిస్తున్న ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాలస్వామి అనే పేరు ఉంది. సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించి, పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం.
వంశధారలో పవిత్ర స్నానాలు..
భక్తులు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్యస్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్త్తెన ఈ కొండపైకి వెళ్లేందుకు వీలుగా మెట్లదారి ఉంది. దర్శనం పూర్తయిన తరువాత కొండ దిగేందుకు మరో మెట్లదారి ఉంది. కొండపైన వేణుగోపాలుని దర్శించిన భక్తులు అక్కడకు దగ్గర్లోని వీరవసంతేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీ.
స్వామి చక్రస్నానం...
వేణుగోపాలుని ఉత్సవమూర్తులను పల్లకిలో భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే మేళ, తాళాలతో ఊరేగింపుగా వంశధార నది మధ్యలో అర్చక స్వాములు చక్రస్నానం చేయిస్తారు. అక్కడ నుంచి తిరువీధి నిర్వహిస్తారు.
ప్రత్యేకం .
యాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. ఆర్టీసీ శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేటల నుంచి శాలిహుండాం వరకు ప్రత్యేక బస్సు సర్సీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. కొత్తపేట పాఠశాల వద్ద పోలీసు కంట్రోల్ రూం, గార పీహెచ్‌సీ వైద్యసిబ్బంది అత్యవసర వైద్యసేవలు అందించనున్నారు.
ఈ యాత్రకు వేలాదిమంది భక్తులు రానున్నందున కొండ పైన ఆలయం చుట్టూ ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశాం. భక్తులకు అందుబాటులో మంచినీరు ఉంచుతాం. యాత్ర నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తారు .
-సుగ్గు మధురెడ్డి, ట్రస్టు బోర్డు అధ్యక్షుడు
వెలుగు చూసిన బుద్ధుని ఏక శిలా విగ్రహం-* సాలిహుండాం లో బయటపడ్డ వైనం-May 7th, 2011
జిల్లాలోని గార మండలం శే్వతగిరిపై వెలసియున్న కాళీయ మర్దన వేణుగోపాలుని కొండపై బుద్ధుని ఏకశిలా విగ్రహం వెలుగుచూసింది. జగతిపుట్టగా పేరొందిన ఈ ప్రాంతంలో బుద్ధుని విగ్రహం వెలుగుచూడడంతో సమీపంలో గల బుద్ధుని కొండతో పాటు ఈ కొండ పై కూడా బౌద్ధ్భిక్షువులు సంచరించి ఆవాసాలు ఏర్పాటు
చేసుకుని మత ప్రచారం గావించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిచారికలు వింజామరలు విసురుతుండగా బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఏక శిలావిగ్రహం వెలుగు చూడడంతో స్థానికంగా పలు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బుద్ధుని కొండ గుట్ట పైన నుయ్యి వంటి
ప్రదేశం మాదిరే వేణుగోపాలుని కొండ పై కూడా పడమటి భాగ శిఖరాగ్రాన ఉండి అక్కడ ఈ విగ్రహం వెలుగుచూసింది. గతంలో సముద్ర గర్భాన ఖనిజాల అన్వేషణకు గాను నావికాదళం వారు జర్జంగి, సాలిహుండాం కొండలపైనుండి పరిశోధనలు గావించారు. అప్పట్లోనే ఈ అవశేషం వెలుగు చూసినా అంతగా
ప్రాచుర్యం పొందలేదు. వేణుగోపాలుని ఆలయానికి సుమారు కిలోమీటరు దూరంలో గుట్ట మాదిరి ఉన్న ప్రదేశంలో ఈ విగ్రహం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో చుట్టూ నాలుగు రాతి స్తంభాలతో మండపం మాదిరి ఉన్న కట్టడం ఉండేదని, ఆ పక్కనే ఈ ఏకశిలా విగ్రహం ఉండేదన్నది స్థానికుల కథనం. ప్రస్థుతం ఈ ప్రాంతంలో మండపం జీర్ణావస్థకు చేరింది. అలాగే బ్రిటీష్ కాలంలో కళింగపట్నం వాడరేవు వినియోగంలో ఉన్నప్పుడు నావికులు ఈ కొండను దిక్సూచిగా ఉపయోగించుకునేవారన్నది చారిత్రక కథనం. ఇందుకు నిదర్శనంగా ఈ కొండ శిఖరాగ్రాన అప్పట్లో నిర్మించిన దిమ్మెను పోలిన కట్టడం నేటికీ చెక్కుచెదర కుండా
ఉంది. ఇప్పటికే ఈ కొండ ను ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెల్తుంది. బుద్ధుని కొండను ప్రభుత్వం శాఖాపరంగా ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో అదే మాదిరి వేణుగోపాలుని కొండను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటక పరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉండగా పోలాకి మండలం దుబ్బకవానిపేట సమీపాన జరిపిన త్రవ్వకాల్లో క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నాటి బౌద్ధస్థూపం బయటపడింది. జగతిపాడు దిబ్బపైన ఇటుకుల అరుగులమీద ఇది నిర్మిమై ఉంది. ఈ స్థూపం తక్షశిలలోని భౌద్ధస్థూపాన్ని తలపిస్తుందని రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి వెల్లడించారు. తవ్వకాల్లో
బయటపడిన విహారాలు, వరండాలు, నేలపై సున్నపు కాంక్రీటు రెండువేల ఏళ్ళుగా చెక్కుచెదరకపోవడం విశేషం. ఒక్కొక్క ఇటుక 60 సెంటీమీటర్ల పొడు, 30 సెంటీర్ల వెడల్పు మందముంది. ఈ ఇటుకలు శాతవాహన కాలంనాటవని, తవ్వకాల్లో భౌద్ధ్భిక్షువులు నివసించిన విహారాలు, అప్పట్లో మురిగినీటి కాలువలు నిర్మాణం నాటి ఇంజనీరింగ్ వ్యవస్థకు అద్దం పడుతుందని ప్రొఫెసర్ చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు.
- ==============================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !