Friday, October 28, 2011

Oriya Language in Srikakulam , శ్రీకాకుళం లో ఒరియా భాష



ఒరియా ( oṛiā) భారతదేశానికి చెందిన ఒరిస్సా రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణముగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్ మరియు అరబిక్ భాషల ప్రభావము చాలా స్వల్పము.

ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము కలదు. 14వ శతాబ్దములో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకముగా బౌద్ధ మరియు జైన మతాలచే ప్రభావితమైనది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒరిస్సాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒరిస్సా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

భషా విధానాలు :
ప్రస్తుతము విద్యావిధానంలో త్రిభాషా సూత్రం ప్రధానమైనది. మాతృభాషను మొదటిదిగా, హిందీ రెండో భాషగా, ఆంగ్లం మూడోదిగా అమలు చేస్తూ బోధనావిధానం కొనసాగుతోంది. ఈ విద్యావిధానము వలన విద్యార్ధులకు తలకు మాసిన భారము అవుతుంది . భాష అనేది ఎదుటి వ్యక్తి చెప్పేది అర్ధము చేసుకునేందుకే గాని ప్రతి వానికి ప్రపంచములో ఉన్న భాషలన్నీ రావాలని లేదు
జిల్లాలో ఒడియా విద్యార్థుల కోసం 29 ఉన్నత పాఠశాలలు, 50 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లోని సుమారు 40 వేల మంది విదార్థులు ఉన్నారు .

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఒరియా వారు వివక్షతకు గురౌతున్నారని, వారి సమస్యలపై న్యాయమైన పోరాటం చేయనున్నట్లు ఒరియా లింగ్విస్టర్‌ మైనార్టీ సంఘ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌.పాడి అన్నారు. పాతపట్నం ఒరియా పాఠశాలలో జరిగిన ఒరియా మాడ్యూల్స్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మన రాష్ట్రంలో 206 ఒరియా పాఠశాలలున్నాయని, 130 బైలింగ్వల్‌ పాఠశాలలున్నాయని, 5 పూర్తి స్థాయి ఒరియా పాఠశాలలున్నాయని, 600 మంది ఒరియా టీచర్లతో పాటు ఉత్కళ్‌ సమ్మేళన ద్వారా 200 మంది విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారన్నారు. అయినప్పటికీ కొన్ని విధాలుగా ఒరియా వారు వివక్షతకు గురి కావటం శోచనీయమన్నారు. ఒరియా విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీలో కూడా జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, సాంఘిక, ప్రభుత్వ వివక్షతకు గురౌతున్న ఒరియా వారి మనుగడ కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. అనంతరం స్థానిక ప్రధానోపాధ్యాయునికి ఒరియా మాడ్యూల్‌లను ఎంఈఓ బి.విశ్వనాథం అందించారు. కార్యక్రమంలో డి.పి.చౌదరి, రఘునాథ్‌ గౌడో, బుధ్యా మహంతి, ఆర్‌.సత్యంనాయుడు, ఉత్కళ్‌ సమ్మేళన సూపర్‌వైజర్‌ విద్యాధర్‌ బారికో, విశ్వనాథ్‌ బరోడా, ప్రహ్లాద పొల్లాయిలు పాల్గొన్నారు.

ఒరియా విజ్ఞాన గనికి నిరాదరణ--కెఎన్‌ఎన్‌ - Fri, 18 Sep 2009

హరిపురం,సెప్టెంబర్‌ 17(కె.ఎన్‌.ఎన్‌): మందసలో అప్పటి సంస్థాన రాజులు 1907 లో స్ధాపించిన ఒరియా యంగ్‌మెన్స్‌ లైబ్రరీ నిరాదరణకు గురైంది. 1935 వరకు భాషాభివృద్ధికి కృషి చేసిన నర్సింగ పాణిగ్రాహి, బృందావన త్రిపాఠి, సత్యనారాయణ సాహు,కృష్ణచంద్ర పండా, బినాయక్‌ పాణిగ్రాహి, ఎన్‌ఎన్‌.నందా, కుంజో పాణిగ్రాహి ఈ గ్రంథాలయ స్ధాపనలో కీలక భూమి వహించారు. 1936లో ఒరిస్సా రాష్ట్రము ఏర్పడినప్పుడు చిక్కోలు(శ్రీకాకుళం) జిల్లా ఆంధ్రాలో కలవడంతో, ఒరియా చదివేవారి కోసం ఈ గ్రంథాలయయాభివృద్ధికి వీరంతా ముందుకు రాగా జగన్నాధరాజమణి రాజ్‌దేవ్‌ భవనాన్ని ఉచితంగా ఇచ్చారు. అలాప్రారంభమైన గ్రంథాలయయానికి 1967లో ఒరిస్సా రాష్ట్రం ఉత్కళ్‌ సమ్మేళన్‌ వారు ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన ఈ గ్రంథాలయానికి ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి చొరవతో ఒరియా వయోజనులకు విద్య బోధించేందుకు 2005లో 2 లక్షలతో కొత్త భవనాలు నిర్మించారు. దీంతో పాటు ఒరియా పాఠశాల, జడ్‌పి హైస్కూల్‌లోని ఒరియా విద్యార్ధులకు ఉత్కల్‌ సమ్మేళన వారు ప్రత్యేక తరగతి గదుల ఏర్పాటుకు సహకరించారు. గ్రంథాలయంతో ప్రారంబమైన ఒరియా భాషాభివృద్ధి పాఠశాల ఏర్పాటు వరకు విస్తరించింది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని నీలం సంజీవరెడ్డి, రాజేంద్రనారాయణ సింగ్‌దేవ్‌, బిజి.పట్నాయిక్‌, నందిని శతపతి, కాసు బ్రహ్మనందరెడ్డి తదితరలు గతంలో సందర్శించిన ఘనత ఉంది.

ఒరియా గ్రంథాలయంలో బెంగాలీ,సంస్కృతం,హిందీ,ఉర్ధూ,ఒరియా భాషాలకు సంబంధించిన సుమారు 6 వేల పుస్తకాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల వారి రాకపోకలతో నిత్యం సందడిగా ఉండేది గ్రంథాలయం. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధంచిన చరిత్ర, ఇంగ్లీష్‌, తెలుగు, ఒరియా లిటరేచర్లు ఇక్కడ లభ్యమవుతాయి. దీంతోపాటు విలువైన తాళపత్రగ్రంథాలకు వేదికయింది. చరిత్ర ఎంత ఘనమైతే ఏం లాభం 2006 నుంచి ఏ ఒక్కరూ ఈ గ్రంథాలయాన్ని పట్టించుకోవడం లేదు. దినపత్రికలు ఇచ్చే దాతలు కరువై పాఠకుల రాక తగ్గిపోయింది. ఒరిస్సా, ఆంధ్రా ప్రభుత్వాలు ఆర్ధిక సహాయము అందిస్తే ఒరియా గ్రంథాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.

చేదెక్కిన తీపి బతుకులు--ఇచ్ఛాఫురం: మేజర్‌న్యూన్‌:
అందరికీ మిఠాయి పంచే చేతులు వారివి. కానీ వా రి జీవనం చేదిక్కినా పాలకులకు పట్టడం లేదు. పూట గడవడం కష్టంగా వున్నా వారి అగ్రకులాలుగా గుర్తింపబడుతూ ప్రభుత్వ సాయాన్ని పొందలేకపోతున్నారు. వారే గుడియా కులస్ధులు. అల్ప సంఖ్యాకులైన వీరు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకు ళం, విజయనగరం, విశాఖపట్టణాల్లో సుమారు 25 వేల జనాభా వుండే వీరి కులవృత్తి మిఠాయిలు తయారు చేసి అమ్మకాలు సాగించడం. ఏ ఇంట శుభకా ర్యమైనా గుర్తొచ్చే వీరు అన్ని రంగాల్లో వెనుకబడ్డా పాలకులకు మాత్రం గుర్తురావడం లేదు. ఒరియా మైనార్టీలుగా గుర్తించబడుతున్న వీరు పూర్తిగా రెక్కలు కష్టం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వీరి జనాభా సుమారు 22 వేలు. తినుబండారాలు అమ్ముకుని జీవనం సాగించే వీరు ఆ వ్యాపారం లో నూ రాణించలేకపోవడంతో పలు హోటళ్ళలో కార్మికులుగా చేరుతున్నారు. ఇంటి ళ్లపాది కష్టపడనిదే ఆ కుటుంబాలకు పూడగడవని పరిస్ధితి. వేకువ జామున పలు కుటుంబాల్లో వీరు తినుబండారాలు తయారు చేసి పల్లాల్లో పెట్టుకుని బజారు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పురవీధుల్లో తిప్పి అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ కులం లో 80% మంది సొంత గూటికి నోచుకోని పరిస్దితి. వీరిలో అక్షరాస్యులు కేవలం 1.3% మాత్రమే . మొత్తం జనాభాలో కేవలం 15 మంది మాత్రమే పట్టభద్రులు వున్నారంటే విద్యాపరంగా వారి వెనుకబాటు స్పష్టమౌతోంది.

ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న విద్యాప్రోత్సాహకాలకు వీరు అనర్హులు కావడంతో వారు ఆ దిశగా ముందడుగు వేయలేకపోతున్నారు. ప్రభుత్వం 1969 వరకు వెనుకబడిన కులం గా గుర్తించినప్పటికీ 1970 లో ప్రభుత్వం చే నియమించబడ్డ అనంతరామ కమీషన్‌ సరైన కారణాలు చూపకుండా తొలగింపు సిఫరసు చేయడం వల్ల తాము నష్ట పోయామని వాపోతున్నారు. పక్క రాష్టమ్రైన ఒరిస్సాలో మాత్రం వీరు ఓ.బి.సి లుగా గుర్తింపు పొందుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం వారికి సరైన న్యాయం జరగ లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పర్యటించిన బి.సి కమీషన్‌కు గోడు వినపించుకున్నారు.

మరోవైపు ఒరిస్సా, ఆంధ్రాకు చెందిన మం త్రులు సూర్యనారాయణ పాత్రో, ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం సమర్పించారు. అయితే శ్రీకాకుళం జిల్లా సమస్యలు తెలసుకునేందుకు రచ్చబండ కార్యక్ర మానికి హాజరౌతున్న సి.ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తమకు న్యాయం చేస్తారని కోటి ఆశలతో వారు ఎదురుచూస్తున్నారు.

  • ==============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !