,ప్రధాన పంటలు శ్రీకాకుళం జిల్లాలో సాగు విస్తీర్ణం: 5,84,290 హెక్టార్లు.
వరి, చెరకు, జొన్న, గంటి, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, నువ్వులు, పత్తి, గోగు, ఉలవలు, వేరుశెనగ, మిరప, ఉల్లి, పొద్దుతిరుగుడు, పొగాకు.
సాగు విస్తీర్ణం ఇలా..
వరి - 2,33,008 హెక్టార్లు
చెరకు - 8,854 హెక్టార్లు
జొన్న - 268 హెక్టార్లు
గంటి - 3251 హెక్టార్లు,
మొక్కజొన్న - 1767 హెక్టార్లు
రాగి - 1411 హెక్టార్లు
కందులు - 1409 హెక్టార్లు
పెసర - 30830 హెక్టార్లు
మినుము - 41743 హెక్టార్లు
వేరుశెనగ - 24335 హెక్టార్లు
నువ్వు - 4997 హెక్టార్లు
పొద్దుతిరుగుడు - 2668 హెక్టార్లు
ఉల్లి - 1332 హెక్టార్లు
గోగు - 10795 హెక్టార్లు
పత్తి - 1848 హెక్టార్లు
విత్తన రకాలు
జిల్లాలో రైతుల వాడే వివిధ పంటల విత్తన రకాలు ఇవీ...
వరి వంగడాలు: స్వర్ణ, సాంబమసూరి, ఎంటియు 1001, ఎంటియు 1010, సోనామసూరి, శ్రీకాకుళం సన్నాలు, పూజిత
అపరాలు: ఎల్‌జిజి407, ఎల్‌జిజి410, ఎల్‌జిజి450, తేజ, ఎల్‌బిజి623,సాధారణ దిగుబడి
వరి - ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు
అపరాలు - ఎకరాకు 5 క్వింటాళ్లు
వేరుశెనగ - ఎకరాకు 12 నుంచి 14 బస్తాలు
నేలలు - రకాలు
ఇసుక గరప నేలలు
ఇసుక కొండ్రుమట్టి నేలలు
ఎర్రమట్టి నేలలు
ఇసుక, ఒండ్రు, బంకమట్టి నేలలు
జిల్లాలో వరి ప్రధాన పంట. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో దీన్ని విస్తీర్ణం బాగా తక్కువ. వాణిజ్య పంటల్లో జీడిమామిడిదే అగ్రతాంబూలం. జిల్లావ్యాప్తంగా కొండలు, కోనల్లో జీడిని రైతులు పెంచుతున్నారు.
* వరి : జిల్లాలో అన్ని మండలాల్లోనూ సాగవుతోంది.
* చెరకు : రేగిడి, పాలకొండ, వీరఘట్టం, వంగర, ఆమదాలవలస, శ్రీకాకుళం, జలుమూరు, నరసన్నపేట, పొందూరు మండలాల్లో సాగులో ఉంది.
* జొన్న : రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, గార మండలాల్లో సాగులో ఉంది.
* గంటి : రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, గార మండలాల్లో సాగు చేస్తున్నారు.
* మొక్కజొన్న: జి.సిగడాం, రణస్థలం, లావేరు, పొందూరు, రాజాం, వీరఘట్టాం, శ్రీకాకుళం మండలాల్లో సాగు చేస్తున్నారు.
* చోడి : రణస్థలం, జి.సిగడాం, గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, పాలకొండ, వీరఘట్టాం, కొత్తూరు మండలాల్లో సాగులో ఉంది.
* కంది : సీతంపేట, కొత్తూరు, భామిని, జి.సిగడాం, లావేరు, రణస్థలంమండలాల్లో పండిస్తున్నారు.
* పెసర : కొత్తూరు, సీతంపేట, పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో పండిస్తున్నారు.
* మినుము : కొత్తూరు, సీతంపేట, పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో సాగులో ఉంది.
* వేరుశనగ: కొత్తూరు, సీతంపేట, పొందూరు, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో సాగులో ఉంది.
* నువ్వులు: వజ్రపుకొత్తూరు, పాలకొండ, కొత్తూరు, బూర్జ మండలాల్లో పండిస్తున్నారు.
* ప్రత్తి: భామిని, కొత్తూరు, సరుబుజ్జిలి, రాజాం, పొందూరు, రణస్థలం, లావేరు మండలాల్లో సాగు చేస్తున్నారు.
* గోగు : ఆమదాలవలస, బూర్జ, కొత్తూరు, వీరఘట్టం, హిరమండలం, సీతంపేట, లావేరు, రాజాం మండలాల్లో పండిస్తున్నారు.
ఉద్దాన ప్రాంత జీవనాడి జీడి..
శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంటల్లో జీడి ఒకటి.. ఉద్దాన ప్రాంత జీవనాడిగా ప్రసిద్ధి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల హెక్టార్లలో సాగు ఉంది. ప్రధానంగా వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సంతబొమ్మాళి, మెళియాపుట్టి, కొత్తూరు, బామిని మండలాల్లో పంట సాగవుతోంది. ఐదేళ్ల కాలంలో ఏటా 30 శాతం మించి దిగుబడి రావడం లేదు. ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఉన్న చెట్ల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. కొత్త పంట ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సరయిన ప్రోత్సాహం లేనందున రైతాంగం ప్రతీ ఏటా వస్తున్న నామ మాత్రపు పంటతోనే కాలం గడపాల్సి వస్తోంది. ఈ ఏడాది పంట ప్రారంభ దశలో వాతావరణం అనుకూలించకపోవడంతో చేతికందిన పంట నేలమట్టమైంది. ఈ ఏడాది ప్రారంభ దశలో 80 కిలోల జీడి పిక్కల బస్తా రూ. 6,500 ధర పలికింది. ఉద్దానం తీర ప్రాంతంలో జీడి పంట సాగు ఎక్కువగా ఉంది. ఇక్కడ సుమారు 25 వేల హెక్టార్లలో సాగవుతోంది.
- ===================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !