సువిశాల భారతదేశం కట్టుబాట్లకు, ఆచార వ్యవహారాలకు ప్రసిద్ధి చెందినది. ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ వాటిలో ఉండే సంఘపరమైన నియమనిబంధనలు ఐక్యంగా ఉండానికి దోహదపడ్డాయి. అయితే.. కొన్ని కట్టుబాట్లు కొంతమేరకు బాగానే ఉన్నా.. "సమీను (పిల్లా)" లాంటి వ్యవస్థలు.. చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా శ్రీకాకులం జిల్లా సముద్ర తీర మత్స్యకార కుటుంబాల్లో ఈ వ్యవస్థ వేళ్లూనుకుని ఉంది. అయితే.. నేటి యువత ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తూ.. స్వేచ్ఛాజీవనం వైపు అడుగులు వేస్తున్నారు.
-- కట్టుబాట్లకు, ఆ చార వ్యవహా రాలకు విలువనిచ్చే మన దేశాన్ని భిన్న త్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచ దేశాలు కొనియాతున్నాయి. అయితే ఇందులో సముద్ర ప్రాంతా లలో నివసించే మత్స్యకార కుటుంబాలలో ఉండే ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వారి నియమనిబంధ నలు, కట్టుబాట్లు కఠోరమెనవిగా పెద్దలు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో "సమీను(పిల్లా)" నుంచి మత్స్య కారులు క్రమేణా బయ టపడుతున్నారు. స్వేచ్ఛా వాతావరణంలోకి ప్రవేశిస్తూ చట్ట పరమైన అంశాల పట్ల గౌరవం కలిగి వ్యవ హరించడం అందరికీ తెలిసిందే. అయితే గంగ పుత్రులలో కొందరు పెద్దలు నేటికీ కట్టుబాటులే కావాలంటుండగా యువకులు స్వేచ్ఛా జీవనంలోకి అడుగుపెట్టడం విశేషం. రోజురోజుకూ మారుతున్న గ్రామీణ మౌలిక జీవన విధానాలు మత్స్యకార కుటుంబాల్లో కొత్త జీవన విధానానికి నాంది పలుకు తున్నాయి. కట్టుబాట్లకు మారుపేరుగా నిలచి కుటుంబాలు, తెగలను సైతం వదిలి "సమీను (పిల్లా)" ని భరించిన ఆ కుటుంబాల్లో మార్పు కనిపిస్తోంది.
--తీర ప్రాంత గ్రామాల్లో చట్టాలు, పోలీసులు సైతం ముక్కున వేలు వేసుకునే కఠిన క్రమశిక్షణే ఈ "సమీను(పిల్లా)". ఒకప్పుడు జిల్లా తీర ప్రాంతా ల్లో "సమీను(పిల్లా)" అంటేనే జిల్లా పోలీసు యంత్రాం గానికి, రాజకీయ పార్టీలకు వణుకు పుట్టేది. మత్స్యకార గ్రామా లల్లో గ్రామానికి పెద్ద మనుషులుగా నియ మించిన వ్యక్తిదే వేదం. వారు ఆజ్ఞలను లెక్క చేయని కుటుంబాలు సైతం వారు విధించే శిక్షలకు "సమీను(పిల్లా)" చాలా కఠినంగా ఉండేది. గ్రా మంలో వధూవరులకు వివాహం జరిపించాలన్నా గ్రామ పెద్దలైన కాపులు అనుమతితో నే చేసుకోవ ల్సిందే. గ్రామంలో ఉత్సవాలు నిర్వహించాలన్నా ఎన్నికల సమయంలో గ్రామ పెద్దలు నిర్ణ యించిన వ్యక్తులకే ఇష్టం లేకున్నా.. ఓటు వేయా ల్సిందే. అలాగే గ్రామం లో ఎవరైనా వివాహం చేసుకోవలన్నా ముందుగా వారికి సమాచారం ఇచ్చి కాపుల అనుమతి తో వివాహం నిశ్చయిం చుకోవాలి.
--నిశ్చయం అనంతరం వివాహానికి ముందుగానే చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నప్పటికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వివాహ తాంబూలంగా ఐదు వక్కలు, ఆకులు పంచాల్సిందే. అలా పంచని ఎడల ఆ కుటుంబాలు కూడా "సమీను(పిల్లా)" కి గురవుతాయి. వివాహ సమయంలో ముందుగా కాపులు భోజనం చేసిన అనంతరమే గ్రామంలోని మిగిలిన వ్యక్తులకు భోజనం వడ్డించాలి. అదే విధంగా గ్రామంలోని ఏ వ్యక్తి అయినా చనిపోయినట్లయితే ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తి వ్యవహారం కూడా కాపుల జోక్యంతోనే పంపకం జరుగుతుంది. కాపులు పంపిణీ చేసిన ఆస్తి వ్యవహారంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పటికీ శిరసావహించి అంగీకరించాల్సిందే తప్ప ఎదిరించి మాట్లేడే వారు ఉండరు. గ్రామంలో ఎవరైనా ఈ కట్టుబాట్లను అతిక్రమించినట్లయితే గ్రామం నుంచి వెలివేయటం లేదా గ్రామంలోనే ఉంచి ఏ ఒక్కరూ వారితో మాట్లాడకూడదని "సమీను (పిల్లా)" నిర్వహించేవారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలోకి...
ప్రస్తుతం కాలానుగుణంగా ఈ "సమీను(పిల్లా)" మత్స్యకార గ్రామాల్లో కనుమరుగవుతోంది. ప్రస్తుతం కాపుల వ్యవస్థ గ్రామానికి ఉన్నప్పటికి ఆచార వ్యవహరాల్లో మార్పు కనిపిస్తోంది. అప్పటిలా ఆంక్షల వలే ఉన్న ఈ "సమీను(పిల్లా)" ప్రస్తుతం గ్రామంలో ఉత్సవాలు నిర్ణయించుకునేందుకోసమే వినియోగిస్తున్నారే తప్ప మరే ఇతర కార్యానికి వినియోగించడం లేదు. రాబోయే ఎన్నికల సమయంలో ఈ "సమీను(పిల్లా)" ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.
- =================================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !