అందమైన కురుల కోసం ఆరాటపడని అతివ ఉండదంటే అతిశయోక్తి కాదు. నల్లని నిగనిగలాడే పొడవాటి కురులతో మరింత సొగసును సంతరించుకోవాలని ప్రతి యువతి ఆశపడుతుంటుంది. అయితే, పిరుదులు దాటి చకచకలాడే అందమైన జడ ఇప్పుడు ఎక్కడో కాని కనిపించడం లేదు. అన్ని బాబ్డ్ హెయిర్ స్టైల్సే! సరే, ఆధునిక సమాజంలో అటువంటి జడలను యువతులు ఇష్టపడకపోయినా, కనీసం పట్టువలె మెత్తగా ఉండాలని కోరుకుంటారు. కాని, రెండు పదుల వయసు వచ్చేసరికే కొందరి కురులు తెల్లబడిపోతున్నాయి. దీంతో రకరకాల పద్ధతుల ద్వారా వెంట్రుకలను రకరకాల రంగుల్లోకి మార్చేసుకుని తృప్తి పడుతున్నారు. మొట్టమొదటి తెల్ల వెంట్రుక కంటపడగానే విలవిలలాడిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ కురులను కాపాడుకోవాలని పరి తపిస్తుంటారు. ఎంత వ్యయం కైనా వెనుకాడకుండా వాటిని నల్లబరిచేందుకు ప్రయత్నిస్తారు. వయసు పెరిగే కొద్దీ తెల్ల వెంట్రుకల బారి నంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే, జీవితాంతం తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండే 'డై' ఏదైనా ఉంటే బాగుండునని ఆశపడుతుంటారు. కాని, సైన్స్ ఫిక్షన్‌లో మాత్రమే అది సాధ్యమనుకుంటారు. ఒకవేళ అదే నిజమైతే?!
అవును! ఇప్పుడు జీవితాంతం తెల్ల వెంట్రుకల బాధ లేకుండా చూసేందుకు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. మరో పదేళ్లలో అది సుపాధ్యం చేస్తామంటున్నారు. అప్పుడిక అతివలకు హెన్నా, 'డై'ల బాధ తప్పిపోతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో అతివలకు సాధారణంగా 34 సంవత్సరాల వయసులో మొట్టమొదటి తెల్ల వెంట్రుక వస్తోంది. అలాగే, ఆసియాలో 39 ఏళ్లకు, ఆఫ్రికాలో 44 ఏళ్లకు తెల్లవెంట్రుకలు రావడం మొదలవుతోంది.
వెంట్రుకలు కూడా ఒక పీచు పదార్ధం వంటిదే. భౌతిక పదార్ధాలతోనే ఇవి నిర్మాణమై ఉంటాయి. వీటికి జీవం ఉంటుంది. వయసును బట్టే పెరుగుతాయి. కొన్నాళ్లకు తెల్లబడతాయి. ఆ తర్వాత రాలిపోతాయి. దీన్ని ఎలా ఎదుర్కొనాలి? భౌతికంగానా? లేక జీవరసాయనాలతోనా? ఇదే టాపిక్‌పై పారిస్‌లో కొన్నేళ్లుగా శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు. 'లారియల్స్' అనే పరిశోధనా సంస్థ గత ఏడాది 581 మిలియన్ పౌండ్లను ఖర్చు పెట్టింది.చర్మం వలెనే వెంట్రుకలు కూడా మెలనొసైట్స్ అనే కణాలను కలిగి ఉంటాయి. ఇవే వెంట్రుకల రంగును నిర్ణయిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఈ కణాలు వెంట్రుకల్లో తగ్గిపోతాయి. అందువల్లే తెల్లరంగుకు వచ్చేస్తాయి. అయితే, వెంట్రుకల్లో ఏ కొద్ది మొత్తంలో మెలనొసైట్స్ మిగిలి ఉన్నా తిరిగి వాటిని వృద్ధి చెందించడం ద్వారా మళ్లి వెంట్రుకలు నల్లబారేట్టు చేయవచ్చునని లారియల్స్ సంస్థ పరిశోధనా సంబంధాల సంచాలకులు పాట్రీసియా పినే చెబుతున్నారు. నోటి ద్వారా తీసుకునే మందుతో పాటు హెయిర్ కేర్‌కు సంబంధించిన పలు ఉత్పత్తులను త్వరలోనే విడుదల చేస్తామని అంటున్నారు. నడి వయసు దాటిన తర్వాత ఇక వెంట్రుకలకు రంగు ఎందుకులే అని అతివలు హెయిర్ కేర్‌లను వాడడం మానేస్తే కోట్లాది రూపాయిల వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి?
అందుకే లారియల్స్ భారీ వ్యయంతో దీనిపై పరిశోధనలు చేస్తోంది. అలాగే, పదేపదే హెయిర్ డైయింగ్ వల్ల కురులు దెబ్బతింటున్నాయి. దీన్ని అరికట్టేందుకు మరో పరిశోధనలో లారియల్స్ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల కురులు దెబ్బ తినడమే కాకుండా పెళుసుగా తయారవుతాయి. అలాగే, ఘాటైన వాసన కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. 'డై' పనిచేసేముందు వెంట్రుకల సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, వెంట్రుకల సహజత్వన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించేందుకు లారియల్ అమ్మోనియా లేని హెయిర్ డైని కనిపెట్టింది. దీనికి ఐఎన్‌ఒఎ (ఇన్నోవేషన్ నో అమ్మోనియా' అని పేరు పెట్టింది. దీన్ని వినియోగించడం వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ చెబుతోంది. ఈ తాజా డైని ఇటీవలే మార్కెట్‌కు విడుదల చేసింది కూడా. అమ్మోనియా కలిసిన డైల వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ తాజా డైని విరివిగా చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లోని బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.--- గుళ్లపల్లి మాధవి
శ్రీకాకుళం లో హెయిర్ స్టైల్ వ్యాపారము :
కురులు .... ఇపుడు సిరులు వర్షము కురిపించే పెద్ద వ్యాపారమైపోయింది . . అందము కోసము కావచ్చు , హుందాతనము కావచ్చు ,.. ఫ్యాషన్ కావచ్చు ....... విద్యార్ధులు మొదలు ముసలి వయసు వారు దాకా జిల్లాలో సుమారు 16 కోట్లు రూపాయిలు వరకూ వ్యాపారము జరుగుతుంది . శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఇది పెద్దమొత్తమే అవుతుంది . ఇక్కడ ఉన్న నాలుగైదు పట్టణాలు సహా పూరిస్థాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ జుట్టు రంగుల వ్యాపారము పద్దమొత్తం లోనే జరుగుతుంది . పేద , బీద , ధనిక కుటుంబాలలోనేకాదు .. ఆడ మగ తేడా లేకుండా జుట్టుకు రంగులు వేసే సంప్రదాయము అంటువ్యాధిలా అల్లుకు పోయింది . నెలకు 100 రూపాయిలు నుండి 1000 రూపాయిలు వరకు ఖర్చుకు వెనుకాడడం లేదంటే ఆశ్చర్యమేకదా !.
ఒకప్పుడు జుత్తు నిర్వహణపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు . మార్కెట్లోకి .. గాడ్రెజ్ , ఇండికా వంటి పౌడర్లు వంటివి వచ్చాక ఇంట్లోనే జుత్తుకు రంగు వేసుకునె అవకాశము కలిగింది . దీంతో ఈ వ్యాపారము బాగా పుంజుకుందని వ్యాపారులు చెబుతున్నారు . ఇప్పుడు మగవారు సైతము పార్ల్లర్లకు వెళ్ళి కొంత సమయము కేటాయిస్తున్నారు . ఇప్పుడు ఒక్కో వెంట్రుకకు ఒక్కో రంగు వేసే అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి . ఇది యువతకు విశేషముగా ఆకట్టుకుంటోంది . ఖరీదైన సెలూన్ లలో సరికొత్త రంగులు జుత్తుకు వేస్తున్నారు . యాపిల్ రెడ్ , గోల్డెన్ బ్రౌన్ , కాపర్ కలర్ , గోల్డెన్‌బ్లాండ్ , సూపర్ గోల్డేన్ , మహాంగవీ , లైట్ బ్రౌన్, బర్గండీ, నేచురల్ బ్రౌన్ , సాప్ట్ బ్లాక్ , నేచురల్ బ్లాక్ ... వంటివి సాధారణ పట్టణాలలో సైతం అందుబాటులోకి వచ్చాయి .
ఆసక్తి పెరిగింది :
జుట్టుపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ పెరిగింది .ఇన్నాళ్ళు జుత్తుకు నూనె రాసుకోవడం , చిన్న చిన్న చిట్కాలు పాటించడం మాత్రమే చేసేవారు . ఇప్పుడు పార్లర్లకు వెళ్ళే వారి సంఖ్య గననీయం గా పెరిగింది . కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు . టెక్కలిలో సైతం అంతర్జాతీయ ఉత్పత్తులు వినియోగించగలుగుతున్నారు . దాదాపు అందరూ హెన్నా పెట్టుకుంటున్నారు . సెలూన్ వ్యాపారం లో ట్రెండ్ మారింది ... ఇంతకు ముందు కేవలం క్షవరమే పనిగా ఉండేది . ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తరకాలు గా ... మావద్దకు వస్తే జుత్తుకు రకరకాల రంగులు వేస్తాం అని బోర్డు పెట్టుచున్నారు .
- జిల్లాలో గార్నియర్ , రెవలాన్ , కలర్ మేట్ . స్ట్రీక్స్ , గ్రాండ్ , తదితర అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీల ఉత్పత్తులూ అమ్ముడవుతున్నాయి.
- మధ్య తరగతి లో గాడ్రెజ్ , ఇండికా వంటి రకాలకు గిరాకీ ఉంది ,
- ఆయా సంస్థల మార్కెట్ విశ్లేషన ప్రకారము జిల్లాలో 30 యేళ్ళ పైబడిన వారిలో ఏకంగా 80 శాతం మంది నచ్చిన రంగు వేసుకుంటున్నారు .
- 17 - 30 వయసు మధ్యలో ఉన్నవారు పాశ్చాత్యశైలిలో కొత్త పోకడలకు పోతున్నారు . వివిద రంగుల మిశ్రమలు వాడుతున్నారు .
- శ్రీకాకుళం జిల్లాలో సంపన్నవర్గాలు విశాఖపట్టణము వెళ్ళి ఖరీదైన పార్లర్లలో వేలకొద్దీ రూపాయిలు ఖర్చు పెట్టి జుట్టుకు మెరుగులు దిద్దించుకుంటున్నారు .
- శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పట్టణాలతో పాటు రణస్థలం , ఎచ్చెర్ల , కోటబొ్మ్మాళి , కొత్తూరు లాంటి మధ్యతరగతి పట్టణాల్లో కూడా ఈ వ్యాపారము బాగా సాగుతోంది .
- తెలుపు రంగు మెంటుకలను ఎరుపురంగులోకి మార్చడానికి వినియోగించే ఆపిల్ రెడ్ వేయడానికి పట్టణాలలో 300 రూపాయిలు వరకు , నగరాలలో సుమారు 600 రూపాయిలు వరకూ అవుతుంది .
- హెడ్ లైన్ వేయించుకునేందుకు రంగును బట్టి పట్టణాలలో రూ.3000/- నగరాలలో అయితే సుమారు రూ.10,000/- వరకూ రేటు పలుకుతుంది .
- హెన్నా పెట్టేందుకు రూ. 100 వరకూ చెల్లిస్తున్నారు . హెయిర్ డై వేయించుకునేందుకు 300 - 500 వరకూ , బ్లాక్ హెన్న పెట్టేందుకు 500/- తీసుకుంటున్నారు .
- ప్యాచ్ లు చేసేందుకు ఒక్కో ప్యాచ్ కు 200/- వరకూ .. పురుషులతో పోల్చితే మహిలలే ఎక్కువ మొత్తం తీసుకుంటున్నారు .
- సరాసరి శ్రీకాకుళం లో సంవత్సరానికి సుమారు 16 కోట్ల రూపాయిల వ్యాపారము జరుగుతుందని అంచనా .
- ======================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !