శ్రీకాకుళం లో దట్టమైన 136.40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. సీతం పేట్ మండలము దోనుబాయి, సారవకోట , మందస, మెళియాపుట్టి , పాలకొండ ప్రాంతాలలో బాగా విస్తరించి ఉన్నాయి. కొత్తూరు సెక్షన్ లో బగ్గ ప్రాంతములొ 220 హెక్టార్లలో , పాతతట్టణము సెక్షన్ లో మెళియాపుట్టి ప్రాంతం లో 80 హెక్టార్ల టేకు అడవులు చెప్పుకోదగ్గవి .
ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణం --
- 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో 33 శాతం అడవులు ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు విస్తీర్ణం-63,814 చ.కి.మీ. (23.2%) (ఎపి సర్వే 2009-10)
- 2005-06 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అడవుల శాతం 23 శాతం
- అడవుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నది.
- ఆంధ్రప్రదేశ్‌లో అడవుల కింద ఉన్న భూమి 5.57 మీ.హె. నుంచి 2005-06 నాటి 6.20 మీ. హెక్టార్లకు పెరిగింది.
- ఎపిలో అత్యధికంగా అడవులు ఖమ్మంలోనూ, అత్యల్పంగా కృష్ణాజిల్లాలోనూ ఉన్నాయి.
- ఎపి అడవులలో సుమారు 2500 జాతుల మొక్కలున్నాయి.
ఎపిలో అడవుల వ్యాప్తి కింది విధంగా వుంది.
- శేషాచలం, పాలకొండలు, నల్లమల కొండలు, దక్షిణాన తిరుపతి నుండి ఉత్తరాన సింహాచలం వరకూ వ్యాపించి ఉన్నాయి. పశ్చిమాన బాలాఘాట్ కొండల వరకూ వ్యాపించి ఉన్నాయి. పశ్చిమాన బాలీఘాట్ కొండల వరకూ అరణ్య ప్రాంతాలున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద అడవులు నల్లమల అడవులు.
- కొండ ప్రాంతాలు గల శ్రీకాకుళం, విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో అడవులు ఉన్నాయి.
ప్రాంతాల వారీగా అడవుల విస్తీర్ణం ఈ కింది విధంగా వుంది.
- కోస్తాంధ్ర-30.67 శాతం
- రాయలసీమ-23.53 శాతం
- తెలంగాణలో 45.80 శాతం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఆకురాల్చే అడవులున్నాయి. రూసా గడ్డితో సుగంధ నూనె తయారుచేసే అడవులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పపువ్వు, బీడీ ఆకులు అధికంగా తెలంగాణా ప్రాంతపు అడవుల్లో లభిస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా ఎక్కడా లభించని ఎర్రచందనం ఆంధ్ర రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో మాత్రమే లభిస్తుంది. ఎంతో విలువైన గంధం చెట్లు చిత్తూరు, అనంతపురం జిల్లాలో విరివిగా ఉన్నాయి. సామాజిక అడవుల పెంపకం ఆంధ్రప్రదేశ్‌లో 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడింది.
శ్రీకాకుళం లో అటవీ రక్షణ అధికారులు :
ఐదుగురు అటవీ రేంజి అధికారులు , ముగ్గురు డిప్యూటీ రేంజి అధికారులు , 35 మంది సెక్షన్ అధికారులు , 43 మంది బీట్ అధికారులు , 35 మంది సహాయక బీట్ అధికారులు ... వీరందరి పనితీరును పరిశీలించే ఒక ఉప-అటవీ డివిజనల్ అటవీఅధికారి ..... మొత్తం వ్యస్థను పర్యవేక్షించే ఒక డివిజనల్ అటవీ అధికారి ఉన్నారు .
శ్రీకాకుళం జిల్లాలో అటవీప్రాంతాన్ని 43 బీట్ లుగా విభజించారు . ఒక్కో బీట్ అధికారి 1575 హెక్టార్ల ప్రాంతాన్ని కాపలా కాయాలి . దీంతోపాటు 14 వేల హెక్టార్ల పరిధిలోని భౌగోళిక ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది . వీరంతా అటవీ సంపద అక్రమ రవాణా అవకుండా చూస్తారు .
అడవుల అక్రమ రవాణా :
- ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు కలప అక్రమరవాణా కు అడ్డగా మారింది . భామిని , పాతపట్టణము , ఇచ్చాపురము , వీరఘట్టం , పాలకొండ , సీతంపేట , కొత్తూరు , కంచిలి , సోంపేట , మందస , పలాస , కవిటి , మెళియాపుట్టి తదితర మండలల్లో అక్రమ కలపరవాణా జోరుగా సాగుతోంది .
- రణస్ఠలము , లావేరు , ఎచ్చెర్ల , నరసన్నపేట వంటి జాతీయరహదానిని ఆనుకొని ఉన్న మండలాల నుంచి కూడా కలప పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా జరుగుతోంది .
- వీరఘట్టాం మండలములో పొల్ల , కుంబిడి , ... ఇచ్చాపురము సరిహద్దు మండలమైన జియ్యవలస (విజయనగరము ) ప్రాంతాలమీదుగా కలప తరలిస్తూ ఉన్నారు .
- పాలకొండ మండలము లోని గుడివాడ , చినకోటిపల్లి , ఓని , సిరికొండ , సీతంపేటలోని దోనుబాయి, ఎల్.ఎన్ పేట లో కడగండి , జాడుపేట , సరుబుజ్జిలి లో జగన్నాధపురము తదితర ప్రాంతాలనుండి టేకు, మద్ది , వెదురు రవాణా అక్రమముగా జరుగుతోంది .
- భామిని మండలములోని ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వెదురు , పాశి రకాలు రవాణా అవుతున్నాయి.
- పాతపట్టణము నుండి కంచిలి వరకు వేలాది ఎకరాల విస్తీర్ణములో ఉన్న వెదురు ఇస్టానుసారము నరికేస్తున్నారు .
- =============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !