Friday, May 6, 2011

Soil Testing Laboratory in Srikakulam , భూసార పరీక్షా కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో


శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ భూములు , సాగునీటి వనరులు విస్తారము గా ఉన్నాయి . జిల్లాలోని 38 మండలాల పరిధిలో ఏటా సుమారు ఐదు లక్షల ఎకరాలలో సాగు జరుగుతోంది . పంట దిగుబడి కీలక భూమిక పోషించే భూసార పరీక్షలపై ఇక్కడ రైతులకు అవగాగన కొరవడింది . దీనిపై రైతుల్ని చైతన్యము చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదు . భూసారము తెలుసుకోకుండా ఎప్పుడూ ఒకే రకము ఎరువును వాడకం వల్ల భూసారము పెరగక పోగా , నిర్జీవముగా మారుతోంది . వ్యవసాయ రంగం లో రైతులు రాణించకపోవడానికి ప్రధాన కారణాలలో ఇదొకటి .


జిల్లా వ్యాప్తం గా భూసార పరీక్షలు జరిపెందుకు ఆమదాలవలస పట్టణ శివారు పారిశ్రామికవాడ ప్రాంతం లో ఒకే ఒక కేంద్రం ఉంది . ప్రతి వేసవిలో మండల వ్యవసాయాధికారులు రైతుల వద్దనుండి మట్టి సేకరించి పరీక్షలు జరిపించాలి . గ్రామ సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలి. నత్రజని . భాస్వరము , పొటాషియం ల నిస్పత్తిని గుర్తించి దాని ఆదారముగా రైతులు పంటలు వేసే విధం గా అవగాహన కల్పించాలి . భూమి స్వభావము ఆధారము గా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధ్యము . జిల్లాలో 26 వేల నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంది . అలా జరగడం లేదు . జిల్లా అధి కారులకు ఏమాత్రము అవగాహన , అవస్యకత లేనట్లె కనిపిస్తుంది . ఫలితం భూమి నిస్సారము అవుతుంది .
ప్రస్తుతం జిల్లా భూసార పరీక్షా కేంద్రం ఎ.డి.ఎ.(A.D.A) ఉన్నవారు .... G.Satyavati . ఈ అధి కారి కిందను ..... ఎ..ఒ.లు , మండల వ్యవసాయ అధికారులు , పరీక్షలు చేసే లేబొరిటరీ నిపుణులు పనిచేస్తూ ఉంటారు .



  • ==============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !