Saturday, May 7, 2011

Buddham Sharanam Srikakulam , బౌద్ధ సంస్కృతి శ్రీకాకుళం లో ,

-

  • -
దంతపురి :
కళింగ సీమ ఒకనాడు స్వర్ణయుగాన్ని అనుభవించిన బౌద్ధ సంస్కృతికి పట్టుగిమ్మ . ఆ నాడు బౌద్ధ వాజ్ఞ్మయానికి ప్రధాన కేంద్రం గా సరుబుజ్జిలి మండలం లోని దంతపురి విలసిల్లినది . కొన్ని శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది . ఎంతో విలువైన , అపురూపమైన ప్రాచీన వారసత్వ సంపదకు సాక్షీభూతంగా నిలిచింది,. ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురియైనది . ఎన్నో విగ్రహాలు మాయమైపోయాయి. రాజుల కాలం నాటి రాతి విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు . ఫలితం గా ఇది శిధిలావస్థకు చేరింది . దంతపురి స్థల విశిస్టతను తెలియజేసేందుకు ప్రబుత్వము 2005 సం.లో తొలిసారిగా బౌద్ధ ఉత్సవాలు నిర్వహించినది . సమావేశమందిరము , అతిధి గృహము నిర్మించినది . అనంతరము వాటి నిర్వహణ బాధ్యత తీసుకోలేదు . ఇప్పుడవి శిధిలావస్థకు చేరుకున్నాయి. కొంతకాలము క్రితం ఇక్కడ ప్రభుత్వము పేపర్ మిల్లు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సుమారు 500 ఎకరాలు భూమిని సేకరించినది . తరువాత ఆ విషయమే మర్చిపోయింది .

జగతి మెట్ట--దుబ్బకవానిపేట :
వేల సంవత్సరాల నాటి బౌద్ధ సంస్కృతి ఆనవాళ్ళు బయల్పడిన పోలాకి మండలం దుబ్బకవానిపేటలోని జగతి మెట్ట ప్రాంతం . ఇక్కడ విలువైన వస్తువులు వంటగది , కొలను , నివాస స్థలాలు బయటపడ్డాయి. ఇక్కడ లభించిన ఆధారాలకు గార మండలం లోని శాలిహుండాం వంశధార పరివాహక ప్రాంతం లో ఉన్నవాటితో పోలికలు ఉన్నాయి . ఇక్కడ ప్రాచీన కాలం నాటి ఇటుకలు , రాళ్ళు ఉన్నాయి . ఈ ప్రాచీన సంపదను కాపాడే భాద్యత ప్రభుత్వానికి ఉండాలి .
శాలి హుండాం (గార) :
గార మండలోని శాలిహుండాం కొండ పైన ఎన్నో ప్రాచీన బౌద్ధ రాతి విగ్రహాలు , ఆనవాలు , స్తూపాలు , నివాస గృహాలు , బౌద్ధ లిపి . ఉన్నాయి. ఈ కొండ సుమారు 500 అడుగులు ఎత్తులో ఉంది .

మరింత సమాచారము కోసం ఈ దిగువ లింక్ ను చూడంది .

http://srikakulamgeneralinfo.blogspot.com/2009/10/salihundam.html
  • =================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !