Wednesday, May 4, 2011

శ్రీకాకుళం లో అక్షయ తృతీయ, Gold business in Srikakulam dist.
* వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు . కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ(తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు . ఇది ఒక నమ్మకం మాత్రమే . పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు . . . కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము , కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది .

ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి ... ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.

ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి. అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి. అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం. . .

అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.
శ్రీకాకుళం జిల్లాలో బంగారము పై రోజుకు 5 కోట్ల రూపాయల వ్యాపారము జరుగుతుందని అంచనా. అదే అక్షయ తృతీయ రోజున సుమారు 22 కోట్ల వ్యాపారము జరుగుతుంది . ఒక్క శ్రీకాకుళం పట్టణము లోనే 6-7 కోట్లు దాకా వ్యాపారము ఉంటుంది . వైశాఖ మాసము కావడం , శుభకార్యక్రమాలు ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో ఈ సంవత్సరం (2011) ఎక్కువ వ్యాపారము జరిగే అవకాశము ఉండవచ్చును . ఇది కాక జిల్లా ప్రజలు విజయనగరం , విశాఖపట్నం లోని ప్రముఖ కార్పోరేట్ సంష్థలలో కొనుగోలు జతుగుతూ ఉంటాయి . ఇది కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుంది .

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 550 వరకూ బంగారము దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం , రరసన్నపేట ,పలాసా , రాజాం ప్రాంతాలలో ఇవి ఎక్కువ . శ్రీకాకుళం , నరసన్న పేత ప్రాంతాలలో ఏడాది పొడవునా వ్యాపారము జరుగుతుంది . మిగిలిన సందర్భాలలో శుభకార్యక్రమాల సమయాల్ల్లోనే గిరాకీ ఉంటుంది . ప్రస్తుతము వెండి ధర 75 వేల రూపాయల నుండి 63 వేలకు తగ్గింది (05/05/2011). బంగారము ధర మాత్రం 21,700 నుండి 26,100 రూ. లకు పెరిగింది .

ధర పెరగడానికి కొన్ని కారణాలు :
 • ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు డాలర్ మారకం పై ఆధారపడి ఉంటాయి,
 • అంతర్జాతీయ పరిణామాలు ఈ ధరను ప్రభావితం చేస్తుంటాయి. డాలరు ధర బలపడకపోతే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది . అదే డాలర్ ధర బలపడితే బంగారము , వెండి ధరలపై ప్రభావము ఉంటుంది .
 • ముడి చమురు ధరలుకు బంగారము నకు సంబంధం ఉంది . ముడిచమురు ధరలు తగ్గితే బంగారము ధరలు మరింత పెరిగే అవకాశము ఉంటుందని నిపులు అంటారు . ముడిచమురు ధర తగ్గితే మదుపర్లు బంగారము , ప్లాటినం లపైన పెట్టుబడులు పెట్టాడానికి ఆశక్తి చూపుతూ ఉంటారు ,
 • వివాహాల సమయములో ధర పెరుగుతుంది .సీజన్‌ కి తగ్గట్టుగా గిరాకీని తట్టుకోవడానికి వ్యాపారులు భారీగా ధరలు పెంచుతుంటారు . అదో పెద్ద యూనియన్‌ .
 • వ్యాపారులు ధరలు పెంచేందు కుత్రిమ కొరతను వ్యాపారులంతా సమిస్టిగా చేయడం అనేది కూడా ఒక వాదన ఉంది .
అక్షయ తృతీయ :

వైశాఖ మాసం లో అమావాస్య తరువాత చంద్రుడు కనిపించే రోజున (అనగా విదియ నాడు) అక్షయ తృతీయ గా వ్యవహరిస్తుంటారు . ఈ రోజు ఏ చిన్న పని చేసినా ... కాలంతో పాటే పెరిగి శుభాన్ని అందిస్తుందని నమ్మకం , వైదిక క్యాలండర్ ప్రకారము పవిత్ర దినాల్లో అక్షయ తృతీయ ఒకటి . ఈ రోజు సూర్యుడు , చంద్రుడు ఒకేసారి అత్యున్నత ప్రకాశం తో ఉండడం ప్రత్యేకత అని పండితులు చెబుతున్నారు . ఇది విష్ణు అవతారాల్లో పరశురామ జన్మదినం గా , స్వర్ణయుగానికి ప్రారంభరోజుగా చెబుతున్నారు . అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసి ధరించిన బంగారం ఆభరణాలకు తరగని సంపద , సౌభాగ్యానికి చిహ్నం గా ప్రచారం ఉంది . ఈ మే-నెల 6 వ తేదీ మధ్యానము 2.21 గంటల వరకు తిది ఉందని పండితులు చెబుతున్నారు .

మన దేశము లో ఏటా 700 టన్నుల బంగారము దిగుమతి చేసుకోంటుంది . మన దేశం రాయ్ పూర్ లో మాత్రమే బంగారము గనులున్నాయి. ఏటా గరిస్టముగా ఇక్కడా 4 టన్నుల బంగారము ఉత్పత్తి అవుతోంది . వినియోగధారులు 80 శాతము బంగారాన్ని ఆభరణాలరూపం లోనే కొనుగోలు చేస్తారు . మిగిలిన 20 శాతము కడ్డీలు , నాణేలు గా కొంటున్నట్లు గుర్తించారు . బంగారము వినియోగము లో భారతదేశనిదే అగ్రస్థానము . ప్రస్తుతం దేశములో ప్రజలు వద్ద 18 వేల టన్నుల బంగారము ఉన్నట్లు అంచనా. పెళ్ళిల్ల సీజన్‌ లో గరిస్టం గా 70 శారము వరకు బంగారము కొనుగోళ్ళు జరుగుతుంటాయి .

బంగారము కొనుగోలులో అప్రమత్తత :

 • బంగారము కొనుగోలు విషయము లో నినియోగదారుడికి అవగాహన అవసరము . తూకము ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి . కొనుగోలు చేసినన బంగారానికి వారంటితో బిల్లు తీసుకోని బధ్రపరచుకోవాలి .
 • గీటురాయి మీద బంగారాన్ని గీసి సఫ్యూరిక్ యాసిడ్ వేసినా గీటు చెరిగిపొకుండా ఉంటేనే అది నాణ్యమైన బంగారముగా గుర్తిచంచాలి .
 • అక్షర తృతీయ రోజు కొనుగోలు చేస్తే రద్దీ అధికంగా ఉంటుంది . నాణ్యతలేని వస్తువులు కొనే పొరపాటు జరుగవచ్చును .
 • హాల్ మార్క్ ఉన్నదే కొనుగొలు చేయడం శ్రేయస్కరం . ఆభరణాలపై ఈ గుర్తు వేసి ఇస్తారు .
 • ముక్కుపుడకలు , ఉంగరాలు , చెవిదిద్దులు వంటి వాటికి హాల్ మార్క్ కనిపించదు . ఇలాంటి సందర్భాలలో నాణ్యత నిర్ధారణకు మాగ్నిఫైడ్ లెంత్ దోహదపడుతుంది .

 • =======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !