Monday, April 11, 2011

Treasuries in Srikakulam , శ్రీకాకుళం లో ఖజానా శాఖ



రాష్ట్రం లో ఏదైనా ఒక జిల్లా వ్యాప్తము గా ఏ అభివృద్ధి కార్యక్రమం ముందుకు సాగాలన్నా , నెలాఖరుకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు , ఇతరత్రా చెల్లింపులు , విశ్రాం ఉద్యోగులకు పించన్లు అందాలన్నా జిల్లా ఖజానాలు ఎంతోఅవసరముతాయి. 1959 లో ట్రెజరీ వ్యవస్థ ప్రారంభం అయినప్పటినుండీ శ్రీకాకులం జిల్లాలో ట్రెజరీలూ పనిచేస్తూ ఉన్నాయి.
జిల్లాలో 132 సబ్ ట్రెజరీలతో పాటు ఒక జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉన్నాయి. వీటిలో సుమారు 1500 మంది వరకు ఉద్యోగులు , అధికారులు ఉన్నారు . వీరంతా కలిపి జిల్లా వ్యాప్తం గా 56 ప్రబుత్వశాఖల్లోని 30 వేలమందికి పైగా గల ఉద్యోగుల జీతాలు , ఇతత బిల్లులు , సుమారు 13 వేలమంది వరకు విశ్రాంత ఉద్యోగుల పించన్లు సంబంధిచిన సొమ్మును ప్రతినెలా చిడుదలచేస్తూంటారు. దీనికి తోడు వివిధ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కోట్లాది రూపాయల బిల్లులు కూడా వీరి చేతుల మీదుగానే ఆమోదం , క్లియరెన్స్ జరగాల్సి ఉంది .


  • ==========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !