Tuesday, March 8, 2011

సనారి విశ్వేశ్వరుడు పాలకొండ,Sanari Visveswarudu Palakond-- లోక కళ్యాణహితమై శ్రీపోతులూరి వీరబ్రమ్మేంద్రస్వామి కాళజ్ఞానంలో పేరుకున్న విధంగా సుమారు 260 సంవత్సరాలక్రితం పాలకొండలో సాక్షాత్తు పరమేశ్వరుడే సనారీవిశ్వేశ్వరునిగాజన్మించారని ఆంద్రప్రదేశ్‌లోనే కాక ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల బక్తులు విశ్వసిస్తువుంటారు. సనారీవిశ్వేశ్వరుడు పాలకొం డలోజన్మించి కొంతకాలంతరువాత అన్నపూర్ణ దేవుని వివాహం ఆడి పాలకొండ పరిసర గ్రామాలప్రజలకు తన మహిమలుద్వారా భక్తుల రోగాలును , బాదలనుంచి విముక్తిచేస్తూ ఎన్నో మహిమామిత శక్తులను ప్రదర్శిం చారని పూర్వీకులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.

తమ బార్యఅన్నపూర్ణాదేవిని తనసన్నిదానంలోనే లోకకళ్యాణార్ధం సజీవ సమాది అయిన తరువాత పాలకొండ పొరుగున గల అన్నవరం గ్రామ పరిసరాల్లో శ్రీరామలిం గేశ్వరస్వా మివారి దేవాలయాన్నినిర్మించి లింగ ప్రతిష్ట చేసి యవద ఆస్తులను శ్రీరామ లింగేశ్వర ఆలయానికి దారా దత్తం చేసిన అనంతరం కాలజ్ఞానం బోధి స్తూదేశ పర్యటనలో భాగంగా మద్రాస్‌ చేరుకున్నారు. మద్రాసులో కుష్టివ్యాధితో బాధపడుతున్న వైశ్యునికి తనదివ్య శక్తులతో నయం చేసినట్లు తాను సాక్షాత్తు పరమేశ్వరుని అంశ మేనని తెలియపర్చడానికి త్రినేత్రాన్ని ప్రదర్శించారు. ఏలూరులో స్వర్ణయాగం తయారుచేసి కాలజ్ఞానం బోదిస్తూ శ్రీశైలం అడవుల్లో యోగజ్ఞానం తపస్సులో మునిగిపోయినట్లు భక్తుల విశ్వాసం.

కలియుగఅంత్యదశలో లోక రక్షనార్ధం తిరిగి ఏమిచేస్తారని ఆయన జీవిత చరిత్ర ప్రచురించిన గ్రంధాల ద్వారా తెలుస్తుంది. శ్రీసనారీవిశ్వేశ్వర అన్న పూర్ణా దేవిల సన్నిదానంలో వెలసిన ఆల యం పవిత్ర స్థలంగా భావించి భక్తులు నిత్య దూప దీప నైవేద్యాలతో వెలుగును అందించు చున్నారు. స్వామివారి ఆలయంలో నిర్మల హృదయంతో కోరిన కోర్కెలు నెరవేరుతాయన్న విశ్వాసంతో ఆంద్రప్రదేశ్‌నుంచే కాక తమిళనాడు,ఒరిస్సారాష్ట్రాలనుంచి భక్తులు మహాశివరాత్రి పర్వదినాన జరిగే ప్రత్యేక పూజాకార్యక్రమాలుకు పెద్ద ఎత్తున తరలిరావడం పాలకొండ పట్టణానికి ఓ ప్రత్యేకత. ఆంద్రప్రదేశ్‌లో రాజమండ్రి,తెనాలి, గుంటూరు, పొన్నూరు, రేపల్లే మొదలైన ప్రాంతాలనుంచి టూరిస్ట్‌ బస్సులలోభక్తులు వచ్చి మూడు రోజులుపాటు ఇక్కడ పూజలునిర్వహిస్తూ వుంటారు. మూడు రోజులు స్వామివారి సన్నిదానంలో నిర్మలమైన మనస్సుతో నిద్రించిన వారికి మనస్సులో గల కొర్కెలునెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం.

కొంతమంద్రియాత్రికులు శ్రీశైలంలోని మునుల ఆశ్రయాలను సందర్శించి ఫోటోలు తియగా ఒక ఆశ్రమంలోని నిరాదారంగా వెలుగుతున్న జ్యోతిని ఫోటో తీయగా జ్యోతికి బదులు శ్రీసనారివిశ్వేశ్వర స్వామివారి నిజ రూపదర్శనం చిక్కిశెల్యమైన మూర్తీభవంతో ఫోటోలో రావడంతో స్వామివారు ఇప్పటికీ జ్ఞానముద్రలో వున్నటు ్ల భక్తులు విశ్వసిస్తు న్నారు. మహాశివరాత్రినాడు పెద్ద ఎత్తున జరిగే స్వామివారి ఉత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ప్రజల సహ కారంతో అనేక ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రదాన అర్చ కులు సత్యన్నారాయణ పాడి పూజా కార్యక్ర మాలును ఘణంగా నిర్వహిస్తుంటారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఆదాయం స్థిరాస్తులు లేవనే కారణంతో దేవాదాయ శాఖ పట్టించుకోక పోవడాన్ని భక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ ఈ ఆలయ అభివృద్దికి తమవంతు కృషిచేయాలని పలువురుభక్తులు కోరుతున్నారు.

  • =======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !