Saturday, February 26, 2011

Handicaped in Srikakulam dist. , వికలాంగులు శ్రీకాకుళం లో



ప్రపంచం లో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాల్లే ఉండరు. తెలివికి, తెలివిలేని తనానికి మధ్యనే జీవితం. చేయడానికి ,చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది.

వికలాంగుల నిర్వచనం ఈ విధంగా యివ్వబడి అమలులో ఉంది.

అ) అంధత్వం, తక్కువ కంటిచూపు :
ఈ క్రింద తెలిపిన పరిస్థితులకు లోనైన ఏ వ్యక్తి అయిన ఈ పరిధిలోకి వస్తాడు.
1) పూర్తిగా చూపు కనిపించకపోవడం లేదా
2) కళ్ళద్దాలు ధరించినప్పటికీ కొంచెం మెరుగ్గా ఉండే కంటిచూపు 6/60 లేదా 20/200 (స్నెలెన్‌) మించినట్టయితే లేదా,
3) కంటిచూపు పరిధి 20 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, తక్కువ కంటిచూపు కలిగిన వ్యక్తి అంటే దృష్టిదోషాన్ని చికిత్సతో సరిచేసిన అనంతరం కూడా ఆ వ్యక్తి దృష్టిలోపం కలిగి ఉండటం, అయితే తగిన సహకార సాధనంతో ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి లేదా ప్రణాళిక రూపందించడానికి అవసరమైన దృష్టి, శక్తి కలిగి వున్నప్పటికి తక్కువ కంటిచూపు కలిగి వ్యక్తిగానే పరిగణించబడుతుంది.

ఆ) కుష్ఠు వ్యాధిగ్రస్తులు - వ్యాధి నయమయినవారు :
”కుష్ఠువ్యాధి నయమయిన వ్యక్తి” అంటే కుష్ఠు వ్యాధి నయమైన తర్వాత ఈ క్రింది కారణాలతో బాధపడే వ్యక్తి.
1) అరికాళ్ళు, అరిచేతులు మరియు కంటిలో పూర్తిగా గాని పాక్షికంగా కాని స్పర్శ లేకుండుట, మరియు కంటిలో పాక్షికంగా కాని, పూర్తిగా కాని చచ్చుబడినట్లుగా బయ టకు తెలియని వైకల్పం లేకపోవుట.
2) అంగవైకల్యముతో చచ్చుబడిన చేతులు, కాళ్ళు కదిలిక కలిగి, దైనందిన కార్యకలా పాలు నిర్వహించగలగడం.
3) పూర్తి అంగవైకల్యం మరియు వయస్సు పై బడిన కొద్దీ, దైనందిన కార్యక్రమాల్లో మార్పు కాని, వృత్తిలో ప్రావీణ్యతతో పాల్గొన లేకపోవుట.

ఇ) వినికిడి లోపం :
వినికిడి లోపం అంటే సంభాషణల తరంగాల పరిధిలో చెవికి సంబంధించి 60 డిసిబుల్స్‌ లేదా అంతకంటే ఎక్కువ వినికిడిని కోల్పోవడం.

ఈ) కదలిక లేకపోవడం లేదా చలనశక్తికి సంబంధించిన వికలాంగత :
”చలనశక్తి వైకల్యం” అంటే ఎముకలు, కీళ్ళు, కండరాలు వైకల్యం వల్ల చలనాంగముల కదలిక తగినంతగా లేకపోవడం లేదా ఏ రకమైన సెరిబ్రల్‌ పాల్సీ (మెదడుకు పక్షవాతం) అయినా.

ఉ) బుద్ధి మాంద్యం :
”మానసిక వికలంగత” అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం.
కారణాలు :
వికలాంగులపట్ల ఉండాల్సింది జాలి కాదని, వారికి అవకాశాలు కల్పించాలి , వికలాగులుగా పుట్టడానికి
  • మేనరికం వివాహాలు ,
  • గర్భిణీ గా ఉన్నప్పుడు పౌస్టికాహార లోపము ,
  • మూఢనమ్మకాలు ,
  • ప్రసవం సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ,
  • సంచి డాక్టర్ల లోపభూయిస్టమైన వైద్యము ,
  • వ్యాధినిరోధక టీకాలు వేయించకపోవడం ,
  • తల్లి దండ్రుల నిరక్షరాస్యత ..
  • జన్యుపరమైన కారణాలు ,
  • సక్రమకుగా అందని త్రాగునీరు ఉదా: ఫ్లోరొసిస్ వ్యాధి ,
  • సారా వ్యసనం తో భాధ్యతలు లేని తండ్రులు , ..........మున్నగునవి మఖ్యకారణాలు.

వికలాంగులను అన్ని విధాలా ఆదుకుంటాం--వికలాంగుల జిల్లా సమన్వయకర్త విజయశంకర్‌

జిల్లాలోని వికలాంగులను ఇందిరాక్రాంతి పథంద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని వికలాంగుల జిల్లా సమన్వయకర్త విజయశంకర్‌ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 11 మండలాల్లో సంఘాలు ఏర్పాటు చేసి అక్కడ వికలాంగులకు సేవలందిస్తున్నామన్నారు. వచ్చే సెప్టెంబరు నాటికి జిల్లాలోని 38 మండలాల్లోనూ ప్రాజెక్టు మండళ్లుగాచేసి మండలానికి మండల సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.

జిల్లాలో ఎంతమంది వికలాంగులను గుర్తించారు.?
సమన్వయకర్త: ప్రస్తుతం జిల్లాలో 38 మండలాల్లో 46 వేల మంది వికలాంగులను గుర్తించాం. వీరందరికి రూ.500 చొప్పున పింఛను వస్తుంది.

జిల్లాలో ఎన్ని మండలాల్లో సంఘాలు ఏర్పాటు చేశారు.?
జిల్లాలో తొలివిడత కింద 819 సంఘాలు ఏర్పాటు చేశాం. పాలకొండ, సీతంపేట, సారవకోట, నందిగాం, వీరఘట్టం, జి.సిగడాం, పోలాకి, గార మండలాల్లో ఏర్పాటు చేశాం. రెండో విడత కింద ఏప్రిల్‌లో 14 మండలాల్లో సంఘాలు ఏర్పాటు చేస్తాం.

ఇంతవరకు ఎన్ని సంఘాలకు రుణ సదుపాయం కల్పించారు.?
జిల్లాలో ఇంతవరకు 2,672 సంఘాలు ఉన్నాయి. ఇందులో 570 సంఘాలకుగానూ రూ.1.72 కోట్ల రుణాలందజేశాం. వచ్చే ఏడాది జిల్లాలోని అన్ని వికలాంగుల సంఘాలకు రుణ సదుపాయం కల్పిస్తాం.

జిల్లాలో ఎంతమంది వికలాంగులకు బీమా సౌకర్యం వర్తింపజేశారు.?
జిల్లాలో 2,584 మందికి జనశ్రీ బీమాయోజన వర్తింప జేశాం. అదేవిధంగా వచ్చే ఏడాది అర్హులైన వికలాంగులందరికీ పథకం వర్తింపజేస్తాం.

ఎంతమంది వికలాంగులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు.?
ఇప్పటివరకు పోలియో, ఇతర వికలాంగత్వంతో బాధపడుతున్న 200 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించాం.

వికలాంగులను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు.?
వికలాంగులందరికీ ప్రభుత్వ పథకాలు, వికలాంగ సంఘాల బలోపేతం చేయడానికి, సొంతంగా ఆదాయాభివృద్ధి సాధించే విధంగా ఇందిరాక్రాంతి పథం ద్వారా సహకారం అందిస్తాం.

వికలాంగుల పునరావాస కేంద్రాలెన్ని ఉన్నాయి.?
ప్రస్తుతం తొలివిడత కింద లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా పలు ఫిజియోథెరపీ సేవలు, వికలాంగుల విధులు తదితర వాటిపై అవగాహన కల్పిస్తాం. పునరావాస కేంద్రాల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకు రావడమే లక్ష్యం.

వికలాంగులను ఏ విధంగా బలోపేతం చేస్తారు.?
వికలాంగులను సామాజిక సమీకరణ ద్వారా సంఘాలుగా ఏర్పాటు చేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. సంఘాలను బలోపేతం చేసేందుకు పూర్తిస్థాయిలో కార్యకర్తలకు శిక్షణనిస్తాం.

  • ఈనాడు దిన పత్రిక సౌజన్యము తో.

వికలాంగ విద్యార్ధులు - శ్రీకాకుళం లో:

నేటి బాలలే రేపటటి పౌరులు . భవిష్యత్తూ జాతినిర్మాతలు ... అన్నారు పెద్దలు . అయితే కీలకమైన బాల్య దశలో వేలాది మంది విద్యార్ధులు వికలాంగులుగా మిగిలిపోతుండడం దురదృష్టకరమే అనుకోవాలి. తల్లిదండ్రుల అవగాహనా లోపమో... ప్రభుత్వశాఖల నిర్లక్ష్యమో... ఉత్తుంగ తరంగం లా ఎగరాల్సిన జీవితాలు నాలుగు గోడలకే పరిమితం అయిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే జిల్లా మొత్తం 9,988 మంది విద్యార్ధులు వివిధ రకాల లోపాలతో వికలంగులు గా కొనసాతుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చును .

శ్రీకాకుళం జిల్లాలో 38 మండాలాల పరిధిలో 3280 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి . వీటితో ప్రస్తుత విద్యా సంవత్సరం లో 281218 మంది విద్యార్ధులు చదువు కుంటున్నారు . రాజీవ్ విద్యామిషన్‌ (RVM) కొద్ది వారాల క్రితం వికలాంగ విద్యార్ధుల సర్వే చేపట్టగా ప్రస్తుతం 9988 మంది పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు . వీరంతా
  • తక్కువ కంటిచూపు ,
  • వినికిడి లోపము ,
  • మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం ,
  • మాట తీరులో లోపము ,
  • కండరాల బిగుసుకు పోవడం ,
  • నేర్చుకున్నవి అవగాహన చేసుకోలేకపోవడం,
తదితర సమస్యలతో బాధపడుతున్నారని సర్వే ప్రకారము తెలుస్తుంది . వీరిలో
అత్యధికం గా కంచిలి మండలం లో 523 మంది ఉన్నారు .
తరువాతి స్థానము 409 మంది వికలాంగ పిల్లలతో శ్రీకాకుళం మండలం ,
387 మంది బూర్జ మండలం ,
379 మంది మందస మండలం ,
మానసిక వికలాంగులు మొత్తం 1367 మంది ఉన్నట్లు గుర్తించారు . ఈ విభాగము లో శ్రీకాకుళం , కవిటి , కోటబొమ్మాళీ, సోంపేట మండలాలలో ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది .
శారీరక్ వికలాంగులు --- 819 ,
వినికిడి లోపము తో----754 ,
తక్కువ కంటి చూపుతో-725 ,
ఒకటి కి మించి వైకల్యము తో బాదపడుతున్నవారు -- 544 ,
మాటతీరు లోపము తో ---410 ఉన్నారని తేలింది .


-- నగేష్ _రాజీవ్ విద్యామిషన్‌ పి.ఒ. మరియు ఈనాడు దినపత్రిక(ఫోటోలు) ల సౌజన్యముతో
  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !