Saturday, January 8, 2011

Developments in Srikakulam Dist., శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి

కాలగమనం లో పదేళ్ళు ... కళ్ళముందే ఇట్టె గడిచిపోయాయి . ఎన్నోమార్పులు , ఎన్నోఅనుభవాలు పదేళ్ళ కాలములో ఎంతో అభివృద్ధి . . . విచిధ రంగాల్లో శ్రీకాకుళం జిల్లా ప్రస్థానము పరిశీలిద్దాం .

శ్రీకాకుళం జిల్లాలో ధరలు :

  • నిత్యావసర ధరలు పూర్తిగా అదుపు తప్పినాయి . జనాబా పెరుగుదల ... అదే నిష్పత్తిలో పంటల సాగు విస్తీర్ణము పెరగక పోవడం వల్ల ఉత్పత్తి ... గిరాకీ తేదా గణనీయంగా పెరిగింది . పండిన పంటల నిల్వకు సరియైన సదుపాయము లేనందున సరకు ధరలు పెరిగాయి . రూపాయికి విలువ లేకుండా పోయింది .
నిత్యావసర ధరలు 2001 --- 2010 ఎలా ఉన్నాయో కింద పట్టిక చూడంది .
శ్రీకాకుళం జిల్లాలో సేద్యము - మద్దతు ధర :
  • పదేళ్ళ కాలములో పెట్తుబడులు గణనీయం గా పెరిగాయి . అదే నిష్పత్తిలో మద్దతు ధర పెరగలేదు . ప్రకృతి వైపరీత్యాలు వలన వ్యవసాయము సాగుబడి చాలా కష్ఠము గా మారినది . రైతుల జీవనం దుర్భరము గా తయారైనది .
జిల్లాలో
  • 2000-2001 సీజన్‌ లో వరి సాగు సాధారణ విస్తీర్ణము 1,92,477 హెక్టార్లు కాగా 1,53,780 హెక్టార్లు సాగుచేసారు .
  • 2010 - 2011 సీజన్‌ లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 1,85,779 హెక్టార్లు కాగా 2,03,308 హెక్టాలలో సాగుచేసారు .
  • పదేళ్ళలో సాగు విస్తీర్ణం 49528 హెక్టార్లు పెరిగింది .
  • 2000 -01 సీజన్‌ లో వరి సరాసరి దిగుబడి ఎకరాకు 14 బస్తాలు ,
  • 2010 -11 సీజన్‌ లో వరి సరాసరి దిగుబడి ఎకరాకు 20 బస్తాలు ,
  • 2000 -01 లో ఎకరాకు పెట్టుబడి --- 3500/- నుండి 4000/- వరకు ,
  • 2010 - 11 లో ఎకరాకు పెట్టుబడి --- 14000/- నుండి 15000/- వరకు ,
  • 2000 - 01 లో మనిషి కూలీ చెల్లింపు --- 60/- నుండి 75/- వరకు ఉండేది .
  • 2010 - 11 లో మనిషి కూలీ చెల్లింపు --- 200/- నుండి 250/- వరకు ఉంది .
  • 2000 - 01 లో ధాన్యం మద్దతు ధర క్వింటాల్ కు 500/- నుండి 510/- వరకు ఉండేది ,
  • 2010 - 11 లో ధా్న్యం మద్దతు ధర క్వింటాలుకు 1000/- నుండి 1050/- ఉన్నది .

సాగు నీరు - ప్రోజెక్టులు :
  • జిల్లాలో గత పదేళ్ళలో కొంతమేరకు సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చాయి . పూర్తి స్థాయి నీటివనరులు ఇంకా అందుబాటులోనికి రావలసి ఉన్నది . లక్ష ఎకరాలకు ఇంకా పూర్తిగా వర్షమే ఆధారము గా ఉన్నది . గత పదేళ్ళలో మడ్డువలస , వంశధార ప్రాజెక్టులు మినహాయిస్తే కొత్తగా సాగునీరందించే జలాశయాలు లేవు . తోటపల్లి , జంపరకోట , వంశధార ఫేజ్ -2 , మడ్డువలస రెండోదశ విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు .
  • జిల్లాలో 5.84 హెక్తార్ల మేర సాగుకు యోగ్యమైన భూమి ఉండగా ఇది 1993 - 94 నాటికి 3.24 లక్షల హెక్టార్లకు , 2003-04 నాటికి 2.96 లక్షల హెక్టార్లకు పడిపోయింది . 2010 - 11 ఖరీఫ్ నాటికి 2.56 లక్షల హెక్టార్లు గా ఉన్నది . అంటే సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడం కారణం గా విస్తీర్ణము పడిపోయింది . 2000 సం. నాటికి కొత్తగా 2.22 లక్షల ఎకరాలకు నీటివసతి కల్పించారు . నారాయణపురం ఆనకట్ట నుంచి 18,600 ఎకరాలకు , తోటపల్లి జలాశయం ద్వరా 56 వేల ఎకరాలు , వంశధార నుంచి 1.48 లక్షల ఎకరాలకు స్థిరీకరించారు . 2002 లో అందుబాటులోకి వచ్చిన మడ్డువలస జలాశయం ద్వారా 24700 ఎకరాలకు నీరందినది . 2007 లో మొదలైన వంశధార కుడికాలువ ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరందినది .
శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారులు :
  • అప్పటికీ ఇప్పటికీ జాతీయ రహదారి 194 కిలోమీటర్ల మేర్ ఉన్నది . అప్పతిలో చిన్నదిగా ఉన్న జాతీయ రహదారి 2002 లో నాలుగు వరుసలకు విస్తరించారు . కీలకమైన ప్రాంతాల్లో వంతెనలు , బైపాస్ లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ జామ్‌ సమస్య తీరింది . వచ్చే ఏడాది నాటికి దీన్ని ఆరు వరుసలకు విస్తరించనున్నారు ...(అవసరం లేదు ... ఎందుకోమరి ). 2001 నాటికి రహదారులు భవనాల శాఖ అధీనం లో ఉన్న రహదారుల పొడవు -1220 కి.మీ. ప్రస్తుతం ఇది 1796 కి.మీ. లకు పెరిగింది . పంచాయతీ రహదారులు నాడు 1922 కి.మీ ఉండాగా నేడది .. 3900 కి.మీ లకు పెరిగింది .
శ్రీకాకుళం జిల్లా స్థూల ఆదాయము :
జిల్లా స్థూల ఆదాయం ను ఆ ఏడాది వ్యవసాయము , గనులు , క్వారీలు , మాన్యుఫాక్చరర్స్ , ఎలక్ట్రిసిటీ,గ్యాస్ ,



మంచినీటి సరఫరా , పరిశ్రమలు , నిర్మాణతంగం , రైల్వేలు , బ్యాంకులు , ఇన్స్యూరెన్స్ తదితర అంశాలు వాటిలో అనుబంధ అంశాలు ప్రాతిపదికన లెక్కగడతారు .

2001 లో జిల్లా స్థూల ఆదాయము -- 3593.34 కోట్ల రూపాయిలు ,
2008 లో జిల్లా స్థూల ఆదాయము -- 7144.90 కోట్ల రూపాయిలు ,
జిల్లా ప్రజల తలసరి ఆదాయము 2007 -- 08 సం.లో 24,298 /-



రవాణా రంగం :

పదేళ్ళ కాలం లో వ్యక్తిగత వాహన వినియోగదారుల సంఖ్య ఆటోల సంఖ్య గణనీయం గా ఎక్కువైనది .
  • వాహనం -----------------2001------------------2010
  • ద్విచక్ర వాహనాలు --------36480-----------------120160 ,
  • కార్లు -------------------1050--------------------2815,
  • ఆటోలు -----------------1600-------------------7900.
  • లారీలు------------------1260-------------------1880,
2001 లో జిల్లాలో ఆర్టీసి కి వచ్చిన నస్టం విలువ -7.08 కోట్లు ,
2010 లో జిల్లాలో ఆర్టీసి కి వచ్చిన నస్టం విలువ్ -7.75 కోట్లు ,
2001 లో జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సులు ----456 ,
2010 లో జిల్లాలో ఉన్న ఆర్టీసి బస్సులు ----486 ,
2001 లో జిల్లాలో రోజుకు ఆర్టీసి బస్సులు తిరిగిన దూరము -1.28 కి.మీ.,
2010 లో జిల్లాలో రోజుకు ఆర్టీసీ బస్సులు తిరిగిన దూరము -2.40 కి.మీ.,

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ రంగము :


  • ఐటమ్‌----------------------- 2001---------------------------2010 ,
  • గృహవిద్యుత్ కనెక్షన్‌లు --------3,50,000----------------------6,35,000,
  • సుబ్ స్టేషన్లు ------------------24------------------------------66,
  • ఉద్యోగులు -------------------1566----------------------------1854,
  • వ్యవసాయ పంపుసెట్లు -------12035---------------------------16000,
విద్యుత్ వినియోగము :
2001 లో రోజుకు 21 లక్షల యూనిట్లు ,
2010 లో రోజుకు 27 లక్షల యూనిట్లు .


శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ :

  • బాపతు ----------------------- 2001-------------------------2010,
  • ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు --------62-----------------------------76,
  • ఉపకేంద్రాలు ------------------425----------------------------478,
  • సి.హెచ్.సి.లు ----------------8--------------------------------8,
  • 24 గంటలు ఆసుపత్రులు ------8-------------------------------24,
  • కమ్యూనిటీ హెల్త్ ఆసుపత్రులు-8--------------------------------8,
ప్రస్తుతం జిల్లా జనాబా 27 లక్షలు ... ఈ ప్రకారము 86 పీ.హెచ్.సీ.లు ఉండాలి.... కాని 76 పి.హెచ్.సి.లే ఉన్నాయి. 152 మంది వైద్యులు ఉండాలి కాని 99 మంది వైద్యులే ఉన్నారు .

వైద్య కళాశాలు ఒకటి గవర్నమెంట్ ది --- RIMS, రెండోది ప్రవేటు యాజమాన్యం లో --GEMS (Ragolu), ఇది మంచి అభివృద్ధి .

శ్రీకాకుళం జిల్లాలో పాడి అభివృద్ధి :


ఐటమ్‌---------------------------2001-------------------------------2010,
పాలకేంద్రాలు ---------------------320--------------------------------668,
పాలవినియోగము (ఒకరికి)--------100 మి.లీ.--------------------------200 మి.లీ.,
శీతలీకరణ కేంద్రాలు ---------------02----------------------------------13 ,
పాల సేకరణ ---------------------43,48,981 లీ.-----------------------1,71,80,176 లీ.,
పాల అమ్మకం -------------------26,57,587 లీ.-------------------------1,12,11,845 లీ.,
పాల ఉత్పత్తిదారులు --------------6,000 మంది------------------------32,000 మంది .


శ్రీకాకుళం జిల్లాలో జనాభా :


2001 లో జనాభా ----------------25,37,593 ,

2010 లో జనాభా ----------------27,48,717,

2011 లో జనాభాలెక్కలప్రకారం ----28,50,315,

2001 లో పురుషులు -----------12,60,000,

---------స్త్రీలు -----------------12,78,000,

2001 లో ప్రతి 1000 మంది మగవారికి 1014 మంది ఆడువారు నిష్పత్తి ఉండేది .

2010 లో ప్రతి 1000 మంది మగవారికి 978 మంది ఆడువారు నిష్పత్తి ఉన్నది .

అక్షరాస్యత :

2001 లో మొత్తం 12,18,000 మంది అక్షరాస్యులు ఉండేవారు . మొత్తం జనాభాలో 55.31%. ఇందులో మగవారు 7.32 లక్షలు , ఆడువారరు 4.86 లక్షలు ఉండేవారు . 2010 లో అక్షరాస్యత 61% అంటే 16.76 లక్షల మంది . 2011 లో సెన్‌సెస్ ప్రకారము ... ఇంకా పెరగవచ్చును .



శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు :


2000 నాటికి ఉన్న ఓటర్లు -----------12,22,000 ,

2004 నాటికి ఉన్న ఓటర్లు ----------14,90,701,

2009 మే నాటికి ఓటర్లు ------------17,49,052 --పురుషులు=8,47,000, స్త్రీలు=9,01,128, .

2010 జూలై నాటికి ఓటర్లు-----------17,48,903. గా ఉన్నారు .



శ్రీకాకుళం జిల్లాలో మహిళా చైతన్యం :


ఈ పది సంవత్సరాలలో మహిళలు సామాజిక పరముగాను , విద్యాపరంగాను , రాజకీయపరము గాను ఎంతో చైతన్యవంతులయ్యారు.

  • 2001 నాటికి పాలకొండ , ఎచ్చెర్ల నియోజకవర్గాలకు ఇద్దరు ... అమృతకుమారి(SC reservation) , ప్రతిభా భారతి (SC reservation) ఎమ్మెల్యేలు గా ఉండేవారు. 2010 నాటికి ఆముదాలవలస నుంచి బొ్డ్డేపల్లి సత్యవతి , టెక్కలి నుండి కొర్ల భారతి అసెంబ్లీకి , శ్రీకాకుళం లోక్ సభ స్థానము నుంచి కిల్లి కృపారాణి ప్ర్రాతినిద్యం వహిస్తున్నారు .
  • 2001 నాటికి 38 మండలాలలో 18 మంది మహిళా మండలాధ్యక్షులు , 13 మంది మహిళా జట్పీటీసి సభ్యులు ఉండేవారు . 2010 నాటికి 18 మంది మహిళా మండలాద్యక్షులు , 13 మంది జట్పిటిసి సభ్యులు ఉన్నారు . రిజర్వేషన్‌ ప్రకారము అదే రేషియో ఉంటూవస్తుంది .
  • జిల్లాలో 1101 పంచాయితీలు ఉన్నాయి . రెజర్వేషన్‌ ప్రకారమే నాడు , నేడు 480 మహిళా సర్పంచులు ఉన్నారు . 4280 వార్డు సభ్యులు ఉన్నారు .

శ్రీకాకుళం లో పారిశ్రామికాభివృద్ధి :


2001 నాటికి భారీ , మధ్యతరహా పరిశ్రమలు = 21,
---------------------------చిన్నపరిశ్రమలు = 2,400,
------------------------ఉపాది పొందేవారు = 24,000 మంది .
2010 నాటికి భారీ , మధ్యతరహా పరిశ్రమలు = 43 ,
--------------------చిన్న తరహా పరిశ్రమలు = 5,576.
------------------------ఉపాది పొందినవారు =52,000 మంది .

  • అప్పటికి పారిశ్రామిక వాణిజ్య మండళ్ళు (సెజ్) లేవు . ఇప్పుడే జిల్లాలో ఇవి పెరుగుతున్నాయి . రెడ్డీస్ అధ్వర్యములో 300 ఎకరాలలో సెజ్ ఏర్పాటవుతోంది . హైదరాబాద్ కు చెందిన మరో సంస్థ 400 ఎకరాలలో పైడిభీమరము లో ఇంకో సెజ్ ఏర్పాతు కానున్నది . ఎ.పి.ఐ.ఐ.సి 73 ఎకరాలలో మరో సెజ్ ఎర్పాటు ప్రయత్నమ్లో ఉన్నది .
  • 2001 నాటికి జిల్లాలో 4 వేల కోట్ల ప్రభుత్వ , ప్రవేటు పెట్తుబడులు వచ్చాయి .2010 నాటికి ఇది 1,00,091 కోట్లకు చేరింది .
  • కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాతు కానున్నది .

శ్రీకాకుళం లో పాఠశాల అభివృద్ధి :

ప్రభుత్వ పాఠశాలలు ->
  • సంవత్సరము -----------ప్రాధమిక --------------యుపి----------------ఉన్నత --------విద్యార్ధులు .
  • 2001-----------------2083-----------------285------------------253----------2,58,000.
  • 2010-----------------2613-----------------583------------------408----------3,10,000.

ప్రైవేటు పాఠశాలలు ->>
  • సంవత్సరము ---------------పాఠశాలలు -------------విద్యార్ధుల సంఖ్య.
  • 2001---------------------257-------------------- 52,000.
  • 2010---------------------517--------------------1,07,000.

జూనియర్ కళాశాలలు ->>
ఐటమ్‌ ---------------------------------2001---------------------2010.
ప్రభుత్వ జూ.కాలేజీలు -------------------36-------------------------56.
ప్రైవేటు జూ.కాలేజీలు -------------------41-------------------------90.
ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్ధులు ----------8115----------------------13,150.
ప్రైవేటు కాలేజీల్లో విద్యార్ధులు -----------8801----------------------12,150.
డిగ్రీ కాలేజీలు ->>
ప్రభుత్వ ------------------------------8------------------------------10.
ప్రైవేటు ---------------------------------8----------------------------70.
విద్యార్ధులు ప్రభుత్వ కాలేజీల్లో-----------8600-----------------------12,300.
విద్యార్ధులు ప్రైవేటు కాలేజీల్లో-----------2450------------------------20,100.
ఇంజనీరింగ్ కాలేజీలు /విద్యార్ధులు ---02/820-------------------10/21,200.
బి.ఇ.డి.కాలేజీలు / విద్యార్ధులు------02/850/-------------------13/1380.
మెడికల్ కాలేజీలు / విద్యా ర్ధులు -------00/00-------------------02/200

శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ లాబాలు :



గ్రానైట్ సీనరేజ్ ద్వారా సర్కారుకి వస్తున్న ఆదాయం ......>>
2003-04 లో 36450 క్యూబిక్ మీ. గ్రానైట్ తవ్వగా ఆదాయము ----=6,06,00,000. రూపాయిలు
2009 - 10 లో 41242 క్యూబిక్ మీ. గ్రానైట్ తీయగా ఆదాయము --=7,58,19,000. రూ.
2010-11 లో 22873 క్యూబిక్ మీ గ్రానైట్ తీయగా ఆదాయము ---- =6,70,00,000 . రూ.


బ్యాంకింగ్ :


  • 2005 లో జిల్లాలో 14 బ్యాకులు ... వాటిపరిదిలో 153 శాఖలు ఉండి సుమారు 2100 కోట్ల వ్యాపారము జరిగింది .
  • 2010 లో జిల్లాలో 24 బ్యాంకుల పరిదిలో 186 శాఖలు ఉన్నాయి . సుమారు 5500 ల కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.



సెల్ ఫోన్‌ ల విప్లవం :


  • శ్రీకాకుళం జిల్లాలో సమాచార వ్యవస్థ గణ నీయమైన పురోగతి సాధించింది . తొలుత బి.యస్.ఎన్‌.ఎల్. మాత్రమే వినియోగదారులకు ల్యాండ్ లైన్‌ కనెక్షన్‌ల సౌకర్యాన్ని అందించేది . . 2002 లో BSNL సెల్ ఫోన్ల సేవలు అందుబాటులోకి తెచ్చింది . తరువాత వొడాఫోన్‌, ఎయిర్ టెల్ , రిలయన్స్ , టాటా ఇండికాం , ఐడియా వంటి సంస్థలు రంగం లోనికి దిగినాయి .
  • బ్రాడ్ బ్యాండ్ సేవలను జిల్లాలో తొలిసారిగా 2009 లో bsnl ప్రవేశ పెట్టడం కమ్యూనికేషన్ల రంగమ్లో ఎంతో అభివృద్ధి అని చెప్పుకోవచ్చును .
  • బి.యస్.యన్‌.యల్ 2000 నాటికి జిల్లాలో 77 తెలిపోన్‌ ఎక్షేంజ్ లు ఉండగా అవి 2010 నాటికి 93 కి పెరిగాయి.
  • 2000 నాటికి BSNL లో 36548 ల్యాండ్ లైన్‌ కనెక్షన్లు ఉండగా అవి 2010 నాటికి 36645 గానే ఉన్నాయి . సెల్ ఫోన్‌ వలన
ఉద్యోగులు :

కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల్లో ఉద్యోగుల సంఖ్య లొ చాలా పెరుగుదల ఉన్నది . ఉపాది కార్యాలయం లో పేర్లను నమొదు చేసుకోవడం లో నిరుద్యోగులు ఆసక్తి చూపడం లేదు .
2000 లో 121109 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకో్గా ,
2010 నాటికి 63602 మందే నమోదు చేసుకున్నారు .


  • ========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !