Wednesday, January 5, 2011

RoadTraffic Safty week celebration in Srikakulam,రహదారి బద్రతా వారోత్సవాలు శ్రీకాకుళం లో


ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏదో ప్రాంతమ్లో ప్రతీరోజూ రహదారి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి . ఏటా జనవరి మొదటి వారములో " రహదారి భద్రతా వారోత్సవాలు " నిర్వహిస్తున్నా అవి తూతూమంత్రంగానే జరుగుతుండడం తో ప్రమాదల సంఖ్య తగ్గడం లేదు .

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 194 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారి నాలుగు వరుస జాతీయ రహదారిగా అభివృద్ధి చెందినది . ఇక 1796 కిలోమీటర్లు ఆర్.అండ్.బి (R & B) , 3900 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి . రోడ్లు అభివృద్ధి చెందినా అదేస్థాయిలో వాహనాల సంఖ్య కూడా పెరిగింది . ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లలో ద్విచక్ర వాహనాలు , కార్లు , లారీలు , ఆటోలు , బస్సులు సుమారు 1,35,000 (లక్షా ముప్పైఐదు వేలు)ఉన్నాయి . ఇవన్నీ అన్ని రహదారుల్లో రోజూ ప్రయాణం చేస్తాయి . ప్రతిరోజూ జాతీయ రహదారి పై 6 వేలు వాహనాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి అని అంచనా. ఇన్ని వాయనాలు తిరుగుతున్న రహదారి బద్రతపై చాలా జాగ్రత్త ఉండాలి .
ఈ సందర్భముగా జరిగిన ఉత్సవాలలో పెద్దలు మాట్లాడిన దానిబట్టి ప్రసంగాల సారాంసము :
దేశంలోని ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవించాలని రహదారి బద్రతా వారోత్సవాలు ప్రారంభానికి ముఖ్యఅతిధిలుగా పాల్గొన్న అనేక మంది మాట్లాడుతూ సంవత్సరానికి రోడ్డు ప్రమాదాల వల్ల 14వేల మంది జనాభా చనిపోతున్నారని అందులో 85 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని, 15 శాతం ప్రమాదాలు కాలం తీరిన వాహనాల వల్ల జరుగుతున్నాయని అన్నారు. నేరం తెలిసిచేసినా, తెలియక చేసినా శిక్షార్హమేనని, చట్టందష్టిలో అందరూ సమానమేనన్నారు. చట్టం దష్టిలో మేజర్‌, మైనర్‌ అనేవి ఉన్నాయని 18 సంవత్సరాలు నిండని వారు మైనర్ల క్రిందకే వస్తారని, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అర్హులు కారన్నారు. కారణం వారి మానసింగా పూర్తిగా పరినత చెందరని చట్టం ఆ విధంగా చేసిందన్నారు.

అనేక మంది చట్టం గురించి తెలిసినా కూడా ఉల్లంగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . అభంసుభం తెలియని అనేక మంది తనకు సంబంధం లేకుండా తమ తప్పులేకుండా ఎదుటి వ్యక్తుల తప్పిదాలకు వేల కుటుంబాలు సర్వనాశనమౌతున్నాయని దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు. దేశ సంస్కతి, సాంప్రదాయాలు, నైతిక విలువలు ప్రక్కదారి పడుతున్నాయని యువత చెడు మార్గాల వైపు వెళ్తున్న సంఘటనలు నిత్యం అనేకం చూస్తున్నామన్నారు. యువత చదువులో మొదటి ర్యాంకులు తెచ్చుకున్నా జీవితంలో విఫలమౌతున్నారని దీనిపై ప్రతి ఒక్కరు విచక్షణా రహితంగా ఆలోచించి చదువుతోపాటు నైతిక విలువలు కూడా అలవర్చుకోవాలని తెలిపారు. సమాజంలో నైతిక విలువలు లేకుండా చదువుకున్నా వ్రుదాయేనని తెలిపారు. చదువుతోపాటు చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని, ఇతరుల ప్రాణాలు కాపాడడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని తెలిపారు. రహదారి బద్రతలు ప్రతి ఒక్కరి బాధ్యతని రహదారి బద్రతా వారోత్సవాలు ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుపుతున్నట్లు అందులో బాగంగానే యువతకు రోడ్డు బద్రతపై అవగాహన కల్పించేందుకు కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డ్రెవింగ్‌లో కొన్ని సూచనలు చేశారు. అతివేగం ప్రమాదానికి కారణమని, రోడ్డుపై ఎక్కడబడితే అక్కడ వాహనాలు ఆపడంవల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని, వేగంకన్నా సురక్షిత ప్రయాణం ముఖ్యమని, వాహనాన్ని ప్రక్కకు త్రిపునప్పుడు ఇండికేటర్‌ను తప్పనిసరిగా వాడాలని, హెల్మేట్‌ను తప్పనిసరిగా ధరించాలని, డ్రెవింగ్‌ చేసేటప్పుడు రోడ్డుమీదే దష్టి కేంద్రీకరించాలని, స్కూల్‌ వాహనాలు సరైన కండీషన్‌లో ఉండేటట్లు యాజమాన్యం చూడాలని, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే 108కు కాల్‌ చేయాలని, వాహనం ఎడమచేతివైపునుండి వోవర్‌టేక్‌ చేయరాదని, వాహనం నడిపేటప్పుడు చేతిసిగ్నెల్‌ను తప్పనిసరిగా పాటించవలెనని, తమ వాహనముకు ముందుపోతున్న వాహనంకు మద్య ఎక్కువ దూరం ఉండేటట్లు చూసుకోవాలని, స్టెల్‌ మల్టిబుల్‌ హారన్లు వాడరాదని, వోవర్‌టేక్‌ చేసేటప్పుడు అవకాశం ఉంటేనే వోవర్‌టేక్‌ చేయాలని, నాలుగు రోడ్ల కూడలి వద్దకాని, ఆగి ఉన్న మరొక వాహణం ప్రక్కగాని, రోడ్డుకు రాంగ్‌సైడ్‌కాని వాహనములు నిలపకూడదని తెలియజేశారు. మీరు ఇంటికి క్షేమంగా రావాలని మీ కుటుంబం ఎదురుచూస్తుందని, మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుందని ప్రతి ఒక్కరు రోడ్డు బద్రతపై అవగాహన కల్పించుకోవాలని వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తతో నడపాలన్నారు.డ్రెవింగ్‌ లైసెన్స్‌ లేకుండా ఎవరూ వాహనం నడపకూడ దని తెలిపారు.


శ్రీకాకులం జిల్లాలో ఏటా పెరుగుతున్న ప్రమాదాలతో మృతులు , క్షతగాత్రులు పెరుగుతునే ఉన్నారు . గత పదేళ్ళలో జిల్లాలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే ...........
సంవత్సరము ---------- ప్రమాదాలు ----------- క్షతగాత్రులు ---------- మృతులు
2001-------------------656------------------341--------------------82.
2002------------------324------------------426--------------------104.
2003------------------332------------------514--------------------122.
2004-----------------317------------------390---------------------108.
2005----------------335-------------------1763--------------------332.
2006----------------392-------------------1598--------------------367.
2007---------------280--------------------2133-------------------375.
2008---------------295--------------------1818-------------------373.
2009---------------322--------------------1725------------------278,
2010---------------298---------------------1423-----------------273.

జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరగదానికి కొన్ని కారణాలు :
  • జాతీయ రహదారి మధ్యన అనుమతి లేని చోత్ల డివైడర్లను తవ్వి రహదారులు ఏర్పాటు చేసుకోవడం ,
  • రహదారులపై ఇస్టానుసారం గా వాహనాలను నిలుపుదల చేయడంతో వినుక నుంచి వచ్చేవాహనాలు డీకొట్టడం ,
  • మద్యం సేవించి వాహనాలు నడపడం ,
  • ఆటోలు , ఇతర ప్రవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్ళడం .
  • గ్రామాల్లో పోయే వాహనాల వేగం తగ్గించకపోవడం ... రోడ్లు బాగుండకపోవడం ,
  • విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడం .
ప్రమాదాలు నివారించాలంటే :
  • రవాణా అధికారులు , పోలీసులు ప్రమాదాలు జరగడానికి కారణాలు అన్వెషించి నివారణ చర్యలు చేపట్టాలి .
  • గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.టి.సి. బస్సులు తగినన్ని తిరగడం లేదు . . కావున ఆటోలు , ఇతర వాహనాలపై ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు . జిల్లాలో 20 లక్షల జనాభా కి 486 ఆర్టీసి బస్సులు మాత్రమే ఉన్నాయి . సరిపోవు కాఫున 8,000 (ఎనివిది వేల ) ఆటోలు జిల్లా అంతటా ఉన్నాయి. ఈ పర్స్థితిని సక్కదిద్దాలి .
  • డివైడల మధ్య అక్రమముగా ఏర్పాటుడెసిన దారులను మూసివేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది .
  • జాతీయ రహదారులపై బస్సులు ఆపేందుకు బస్ బేలను , లారీలు ఆపేందుకు ట్రక్ బేలను వినియోగించేవిధం గా సదస్సులు ఏర్పాటు చేయాలి .
  • జాతీయ రహదార్లలో దాబా లలో మధ్యం అమ్మకాలు నిషేదించాలి .
  • గడ్డి , గ్రనైట్ , ఇసుక రవాణా చేస్తున్న వాహనాలపై నియంత్రణ ఉండేటట్లు చూడలి .
  • గ్రామీణ రోడ్లలో మలుపులు వద్ద తుప్పలు , పొదలు తొలగిస్తే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపిస్తాయి .
  • ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వినియోగం తప్పనీసరి చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది .
  • రోడ్డు ప్రమాల గురించి ప్రజలలో అవగాగన సదస్సులు , ప్రచారము , ప్రమాదాల నివారణ జాగ్రత్తలు మీడియా ప్రచారము సంవత్సరము పొడుగునా నిర్వహిస్తూ ఉండాలి .


  • =============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !