Sunday, July 11, 2010

Uma JaTaleswaraSwamy Temple-Nakka st. , ఉమాజఠలేస్వరస్వామి ఆలయం-నక్కవీధి


  • ఆలయం ప్రవేశ ద్వారము (గేటు)'.

పాతశ్రీకాకుళం లోని జిల్లా్పరిషత్ దరి నక్క వీధిలో డా.వందన శేషగిరిరావు హాస్పిటల్ ఎదురు వీధిలో గల శివాలయమే " ఉమాజఠలేస్వరస్వామి ఆలయము . ఇది చాలా పురాతనమైన ఆలయము .... సుమారు 100 ఏళ్లు చరిత్రకలిగి ఉన్న దేవాలయము . చిన్న ఈశ్వర గుడితో నిర్మితమైన ఈ ఆలయము అంచలంచెలుగా అభివృద్ధి చెంది 10 దేవతా మూర్తుల విగ్రహాలతో సుమరం గా తీర్చిదిద్దేరు .

భస్మాంగుల శివమ్మ కుటుంబము అర్చకులుగా ఉంటూ వస్తున్నారు . శివమ్మ భర్త పోయినప్పటికీ గుడినీ ... గుడిలోని శివయ్యనూ నమ్ముకొని దేవుని సేవలో గడిపేవారు . పూర్వము ఈ గుడి చుట్టూ ఉన్న పొలము సుమారు 5-6 ఎకరాలు ఎందుకూ పనికిరానిదిగా ఉండేది. ఒక సోమవారము నాడే భక్తుల రద్దీ ఉండేది . శివమ్మ జంగాల కులానికి చెందిన వారైనా దేవుని నైవేద్యము పెట్టడం లో తూచా తప్పేవారుకాదు . సుమారు 15 సంవత్సరాల క్రితం వరకూ ఇక్కడి ఇళ్ళ స్థలాలు ఖరీదు నామమాత్రముగా సెంటు భూమి వందల రూపాయిలలో ఉండేది . రియల్ ఎస్టేట్ ల పుణ్యమా అని ఒక్కసారిగా ఇళ్ళ స్థలాల రేట్లు సెంటు లక్షలలోకి పెరిగినది . దాంతో శివమ్మ గుడి చుట్టూ ఉన్న కొంత స్థలము అమ్మి వేసారు . లక్షలాధికారి అయ్యారు . కొంత డబ్బుతో తను ఉండేందుకు మోడరన్ గా ఇళ్లు కట్టుకున్నారు . ఇంకా అద్దెకు ఇచ్చేందుకు కొన్ని ఇళ్లు కట్టుకున్నారు . పిల్లల చదువులు , బాగోగులు చూసుకున్నారు . ఇంతలో మనసులో ఏమిమారుపు వచ్చిందో ఏమో ... శివయ్యకూ మంచి ఇళ్ళు ( అదే గుడి ) కట్టేందుకు పూనుకున్నారు .

11 ఏళ్ళ క్రితం ... 1999 లో భస్మాంగుల శివమ్మ ప్రోద్భలముతో కుమారుడు భస్మాంగుల అశ్వనీకుమార్ నేతృత్వం లో ఆలయాన్ని అభివృద్ధి చేసారు . ఆలయము చుట్టు ప్రాకారము (ప్రహరీ గోడ ) , దాతల సహాయము తో 10 దేవతా మూర్తుల విగ్రహాలను ప్రతిస్టించి సర్వాంగసుందరము గా రూపుదిద్దేరు . ఈ ఆలయ సముదాయములొ ఉన్న దేవతా

  • గర్భ గుడిలోని శివలింగము .

మూర్తులు : - >
  1. ఉమాజఠలేస్వరస్వామి ,
  2. లక్ష్మీగణపతి ,
  3. సంపత్ వినాయకుడు ,
  4. ఉమాదేవి ,
  5. షిరిడి సాయిబాబా ,
  6. అయ్యప్పస్వామి ,
  7. పంచముఖ ఆంజనేయుడు ,
  8. సుబ్రహ్మణ్యస్వామి ,
  9. సంతోషిమాత ,
  10. నవగ్రహ మంటపము
ఆలయం లో పెద్ద నంది చూపరులకు ఆకట్టుకుంటోంది . వంశపారంపర్య ధర్మకర్తగా భస్మాంగుల అశ్వనీకుమార్ పూజాది సేవలు అందిస్తున్నారు .

  • ఉత్సవాలరోజుల్లో జరిగే అన్నదానము .

విశేష ఉత్సవాలు :
  • ఉమాజఠ్లేశ్వరస్వామికి నిత్యపూజలు , స్వామి వార అభిషేకాలతో పాటు మాసశివరాత్రి , కార్తీకమాసము , శివరాత్రి వేడుకలు , ఏటా వార్షికోత్సవాలు జరుపుతారు .
  • గణపతి దేవస్థానము లో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు .
  • ఉమాదేవి ఆలయము లో శుక్రవారము కుంకుమపూజలు , దసరా ఉత్సవాలు , అలంకరణ పూజలు చేస్తారు .
  • సంతోషిమాత ఆలయము లో శుక్రవారం పూజలు , వ్రతాలు , దీక్షలు , అమ్మవారి జన్మదిన వేడుకలు జరుపూఉన్నారు .
  • ఆంజనేయస్వామి ఆలయం లొ హనుమత్ జయంతి ఉత్సవాలు , సకలరక్షపూజలు , అస్టోత్తర శతనామ , సింధూరార్చన పూజలు చేస్తారు .
  • షిరిడి సాయి మందిరము గురువార నియమావలి పూజలు , ప్రతిరోజూత్రికాల సంధ్యల హారతులు , భజన పూర్వక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి .
  • అయ్యప్పస్వామికి 40 దినాల మాలాధారణ , శరణుఘోష , పంచామృతాభిషేక పూజలు ఉన్నాయి .
  • నవగ్రహ మంటపం లో ప్రతి శనివారము నవగ్రహారాధనలు , తైలాభిషేకము , గ్రహదోషపూజలు చే్స్తారు .
  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి క్షీరాభిషేకము , షస్ఠిపూజలు , పుస్పాభిషేకము జరుగుతాయి .
  • ఆలయము లో మాసశివరాత్రి సందర్భముగా రుద్రహోమము , అన్నదాన కార్యక్రమము ప్రతినెలా జరుగుతాయి .

  • ========================================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !