ముస్లింలు దేవుడు ' అల్లాహ్ " వీరి ప్రార్ధనా స్థలాలు మసీదులు , దర్గ్ లు అంటారు .
కొన్ని మసీదులు :
- చంపాగల్లీ వీధిలోని చంపామసీదు,
- జి.టి.రోడ్డులో చందా మశీదు,
- పాలకొండరోడ్డులోని మశ్చనీబీ మదీనా మసీదు,
- గోల్కొండ రోడ్డులోని నూరానీ మసీదు
- జి.టి. రోడ్డు లోని జమా మసీద్ ,
- ఇల్లిసి పురం రోడ్డు లోని ఇల్లిసిపురం మసీదు ,
- చిన్నబజారు లోని రోషనంషావాలీ దర్గ్
- మదీనా సాహేబ్ బాబా దర్గ్ -కళింగ పట్నం ,
- పీర్ల కొండ - ఇచ్చాపురము ,
- మొహరం --Moharram ( Peerla panduga) ,ఇస్లామీయ సంవత్సరాది, ఆషూరా,
- మీలాదే -ఉన్-నబి ,
- బక్రీద్ -- బక్రీద్
- రంజాన్ --రంజాన్
- షబేమెరాజ్ -- shabemeraj,
- ఈద్ ఉల్ ఫితర్ ,
- ఈద్ ఉల్ జుహా ,
- బరవఫట్ ,
- జియారవాహిం షరిఫ్
- ------------------------------------------------------------------------------------------------
పట్టణంలోని జి.టి.రోడ్డులో చారిత్రక ప్రసిద్ధ జామియా మసీదులో శుక్రవారం షబే మేరాజ్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త గగనారోహణ సంఘటనలు, మేరాజ్ యాత్రతో ఆయన మానవాళికి అందించిన జీవన మార్గదర్శక సూత్రాలు తెలుసుకొని సామూహిక ప్రార్థనలు జరిపారు. జామియామసీదు ఇమామ్ అన్వరుల్‌హక్, సుల్తాన్‌లు మతప్రార్థనలు, ఖురాన్ పఠనం, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. మతపెద్దలు పిల్లల ప్రతిభను ప్రశంసించారు. రాత్రి వివిధ మసీదులకు చెందిన మతపెద్దలు, ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసి సామూహిక 'ఇషా' ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో జామియా మసీదు అధ్యక్ష, ఉపాధ్యక్షులు రఫీ, షాన్‌లతో పాటు ఎం.ఎ.బేగ్, జిలానీ, మదీనాసైలానీ, భాషా, షేక్‌మహమ్మద్, అమీదుల్లాబేగ్‌లు పాల్గొన్నారు.
ప్రవక్త బోదనలు ఆచరణీయం: ఇమామ్ అన్వరుల్‌హక్
ఇస్లాం ఇతిహాసంలో రెండు రాత్రులకు ప్రాముఖ్యం ఉందని ఒకటి పవిత్ర ఖురాన్ అవతరణ రోజు, మహానీయుడు మేరాజ్ యాత్రకు నోచుకున్న రాత్రి అని జామియా మసీదు ఇమామ్ అన్వరుల్‌హక్ అన్నారు. సప్త ఆకాశాలు పర్యటించి, స్వర్గనరకాలను తిలకించి అల్లాహ్‌తో సంభాషించిన పవిత్రదినం 'షబే మీరాజ్ ' గా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంలోనే ముస్లింలు ఐదుపూటల నమాజు విధిగా నిర్ణయించడమైందని తెలిపారు. ప్రతి విషయంలోనూ దైవానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. పట్టణంలోని పలు మసీదుల్లో షబే మేరాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చంపాగల్లీ వీధిలోని చంపామసీదు,
జి.టి.రోడ్డులో చందా మశీదు,
పాలకొండరోడ్డులోని మశ్చనీబీ మదీనా మసీదు,
గోల్కొండ రోడ్డులోని నూరానీ మసీదులో
ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
=======================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !