Friday, July 9, 2010

Jagannadha temple in Srikakulam town, జగన్నాధ స్వామి ఆలయం శ్రీకాకుళం పత్తణం లో




భారతావని లో దేవుల్లు , దేవతలు ఎందరో లెక్కేలేదు . మనిషికొక దేవుడు , వీధికొక ఆలయము ఉన్నాయి . కనిపించిన ప్రతి ప్రతిమను , రాయిని , రప్పను , మొక్కను , మోడును మొక్కే మూఢనమ్మకము ఉన్న ప్రజలు ఉన్నంతవరకు ఈ ఆచారము కొనసాగుతూనెఉంటుది .
శ్రీకాకుళం లో ముఖ్యం గా రెండు జగన్నధస్వామి ఆలయాలు ఉన్నాయి . ఒకటి బొందిలీపురములో , రెండు గుజరాతీపే్టలో ;
శ్రీకాకుళము లో ఏటా అత్యరత కోలాహలరగా నిర్వహిరచే జగన్నాథస్వామి రథయాత్ర ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభర కానుంది. బొందిలీవురంలోని జగన్నాథస్వామి ఆలయరలో రథయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. వూరీ నుంచి ఆలయానికి సంబరధించిన ఫలహారీ మహంతీ రఘువీరదాస్‌బాపవాజీ రెండు రోజుల్లో ఆలయానికి వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవ్పటికే స్వామిపారికి నేత్రోన్మీలనం చేశారు. ఇక్కడ వదకొరడు రోజుల పాటు రథోత్సపాలు నిర్వహిస్తారు. ఇలిసివురం గుండీచా ఆలయరలో బలభద్ర, సుభద్ర, జగన్నాథస్వామిలను రోజుకొక అవతారం లో అలరకరించి భక్తుల దర్శనార్థము ఉంచుతారు.
గుండీచాకు జగన్నాథుడు..
బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు తమ పిన్ని ఇంటికి (గుండిచా దేవాలయానికి) మంగళవారం రథంపై ఊరేగుతూ వెళ్లడం ప్రధాన ఘట్టం. తొమ్మిది రోజుల పాటు ఇలిసిపురం గుండిచా ఆలయంలో పూజలందుకొని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ఉన్న జగన్నాథుడు లక్ష్మీదేవి పిలుపుతో తిరుగుముఖం పట్టడం (మారు రథయాత్ర)తో కార్యక్రమం ముగుస్తుంది.

పలు అవతారాల్లో దర్శనం..
పూరీ సంప్రదాయంలో నిర్వహించే రథోత్సవంలో ఇలిసిపురం గుండీచా ఆలయంలో ప్రతిరోజు స్వామివారిని పలు అవతారాల్లో అలంకరిస్తారు. మత్స్య అవతారం, కూర్మ, వరాహ, జగన్మోహినీ, వామన, రామ, కృష్ణా అవతారాల్లో అలంకరించి స్వామికి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామిని దర్శించుకుంటారు.


  • -------------------------------------------------------------------------------------------

గుజరాతీవేటలో ఆంధ్రాశైలిలో తొమ్మిదిరోజుల పాటు రథోత్సపాలు నిర్వహిరచనున్నారు. ఇక్కడ గత ఆరేళ్లగా గుడి నిర్మాణర చేయకపోవడరతో బయట ఉత్సపాలు నిర్వహిస్తుండడము గమనార్హము .

గుజరాతీపేటలోని ఇంద్రద్యుమ్నంలో ఆంధ్రాపద్ధతిలో పెంట లక్ష్మణశర్మ కుటుంబీకులు స్వామిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించనున్నారు. బుధవారం వెంకట్వేరస్వామి రూపంలో జగన్నాథుని అలంకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి 22 వరకు పదిరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. కాగా పాలకొండ రోడ్డులోని శ్రీకోదండరామాలయం, పాండురంగవీధిలోని శ్రీరామమందిరం జి.టి.రోడ్డులో విజేత హోటల్‌ ఎదురుగా ఉన్న రామమందిరాల్లో కూడా రథోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

  • ============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !