Friday, July 23, 2010

రాగోలు వ్యవసాయ పరిశోధనాకేంద్రం శ్రీకాకులం లో , Ragolu Aggricultural ResearchCenter Srikakulam


-

రాగోలు, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం మండలానికి చెందిన గ్రామము, ఉత్తరకోస్తా జిల్లాల్లో చీడ , పీడలను తట్టుకొని సాగుకు అనుకూలమైన కొత్తరకం వరివంగడాలకోసం పరిశోధనలు జరుపుతున్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఈ రాగోలు లో ఉన్నది . సరికొత్త వంగడాలకు జీవం పోస్తూ ... నిత్యము పరిశోధనలతో సాగుకు సేవచేస్తూ ... వ్యవసాయ రంగం ళొ మెలకువలు , ఆధునిక సాగు విధానాలను రైతులకు నేర్పిస్తూ ... పంటకు చీడ , పీడల సృస్టిసున్న క్రిమి కీటకాల నుంచి అన్నదాతల రక్షణకు అనుక్షణము దన్నుగా నిలుస్తుంది ఈ కేంద్రము . రాగోలు వ్యవసాయ పరిశోధనా సెంటర్ వరితో పాటు ఉత్తర కోస్తా జిల్లాలలో సాగుకు అనుకూలమైన అపరాలు , నూనె గింజలు పంటలపైనా ముమ్మరము గా పరిశోధనలు జరుగుతున్నాయి .
రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని విత్తనాభివృద్ధి క్షేతంగా రాస్ట్ర వ్యవసాయశాఖ అధ్వర్యం లో 1956 లో 30 ఎకరాల విస్తీర్ణం లో స్థాపించారు. 1966 లో ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయ పేఇధిలో చేర్చారు . 1982 లో జాతీయ వ్యవసాయ పరిశోధనా పథకం ఒకటో దశకింద , 1987 నుంచి రెండో దశ లోను ఈ కేంద్రం శాస్త్రవేత్తలు విసృతపరిశోధనలు చేపట్టి ....
గుత్తిక్రిష్ణ కాటుకలు (ఆర్.జి.ఎల్.-1) ,
నాగావళి (ఆర్.జి.ఎల్-52) ,
మహేంద్ర(ఆర్.జి.ఎల్.1750) ,
వంటి పద్నాలుగుకు పైగా కొత్త్త వంగడాలను రూపొందించారు . 1986 ప్రాంతం లో వరికి ఉల్లికోడు పురుగు సమస్య తారాస్తాయికి చేరడం తో రైతులంతా నస్టపోయారు . ఆ తరువాత్ ఏడాది నుంచి ఉల్లికోడును సమర్ధవంతం గా తట్టుకునే వరి్వంగడాల రూపకల్పనలో ఇక్కడి శాత్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు . దాని ఫలితం గా ఉల్లికోడును తట్టుకునే దీర్ఘకాలిక రకాలైన .... శ్రీకాకుళం సన్నాలు (ఆర్.జి.ఎల్-2537) , శ్రీకూర్మ (ఆర్.జి.ఎల్-2332) , మధ్యకాళిక రకాలైన వసుంధర (ఆర్.జి.ఎల్-2538) , స్వల్పకాలిక రకాలైన .. పుష్కల (ఆర్.జి.ఎల్-2624) , శ్రీసత్య (ఆర్.జి.ఎల్-1880) , తదితర కొత్త వరివంగాలను రూపొందించారు . ఈ మధ్యకాలములో వంశధార (ఆర్.జి.ఎల్-11414) రకం వరివంగడం కనుగొని విడుదల చేసారు . ఆర్.జి.ఎల్-56134, ఆర్.జి.ఎల్-11226 , రకాలు విడుదలకు సిద్ధం గా ఉన్నాయి . ఇంకా మరికొన్ని వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు . మే-2009 : శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనాలయం లో శ్రీసత్య అను కొత్త వరి వంగడం ను శాస్త్రవేత్తలు కనుక్కొన్నారు. ఇది నీటి యెద్దడి ని తట్టుకొంటుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వర్షాధార రైతాంగానికి ఎంతగానో ఉపయొగపడుతుంది. శాస్త్రవేత్తల 10సంవత్సారాల కృషి ఫలించింది.
ఏదైనా కొత్త వంగడం రూపకల్పనకు సుమారు 10 -12 సంవస్తరాలు పడుతుంది . ఈ కేంద్రానికి పరిశోదనము రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల నుండి నిధులు వస్తుంటాయి ., ప్రస్తుతం ఈ కేంద్రము Agricultural Research Station of Acharya N. G. Ranga Agricultural University, Ragolu -532484, Srikakulam (Dist), Andhra Pradesh, Phone: (08942)-22834.... అన్న పేరుతో సలహా , సహాయ , సహకారాలు అందుకోంతుంది .
  • =============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !