Friday, June 4, 2010

అంధత్వ నివారణ శ్రీకాకుళం లో , Blindness prevention in Srikakulam

  •  
  •  
  •  
చిన్న పిల్లల నుండి వృద్ధులవరకు ఎక్కువమంది కంటి వ్యాధుల బారిన పడుతున్నారు . అయితే శ్రీకాకుళం జిల్లాలో అంధత్వం తో భాధపడేవాకికి రిమ్సు లో మంచి వైద్యం అందిస్తున్నారు . 50 సం.లు దాటిన ప్రతివారికి కేటరాక్ట్ సోకుతుంది . ఇంకా అనేక కారణాలు వల్ల దృస్టి కోల్పోతున్నారు . శ్రీకాకుళం జిల్లాలో ' జిల్లా అంధత్వనివారణ ప్రోగ్రాం మేనేజర్ ' డా.రమణకుమార్ చెప్పిన వివిరాలు ప్రకారము ->
జిల్లా జనాభా లో 1.5% అంధత్వం తో భాధపడుతున్నారు . ఎక్కువగా కేటరాక్ట్ సంభందిత ఆపరేషన్లు జరుగు తున్నాయి .
పాఠ శాలలలో సుమారు 80 - 90 వేల విద్యార్ధి పిల్లలకు తనికీలు చేసి తగిన వైద్యసలహాలు ఇచ్చారు . ఆరోగ్యశ్రీ పథకం లొ ఎంతో మందికి పెద్ద పెద్ద కంటి ఆపరేషన్లు చేస్తున్నారు .
శ్రీకాకులం జిల్లాలో ఉన్న నేత్ర వైద్యులు ------------- = 23 ,
---------------పారామెడికల్ ఆఫ్హ్థాల్మిక్ అసిస్స్తెంట్లు --= 24 ,
--------------గిరిజన ప్రాంతం లో ఆప్థాల్మిక్ అసిస్స్టెంట్లు =04 , ............ ఉన్నారు .


Blindness awareness in Srikakulam-శ్రీకాకుళం జిల్లాలో అంధత్వం అవగాహన(2012)

  • జిల్లాలో అంధత్వంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బడిఈడు పిల్లలో ఎక్కువగా దృష్టిలోపాలు కనిపిస్తున్నాయి. దృష్టిలోపం వల్ల ఏర్పడిన అంధత్వాన్ని సరయిన కళ్లజోడు పెట్టుకోవడం ద్వారా నివారించవచ్చు. వాడటం వలన మామూలు చూపు పొందవచ్చు. దృష్టి లోపం వలన దగ్గర  వస్తువులను, దూరంగా ఉన్న వస్తువులను సరిగా చూడలేకపోతున్నారు. ఫలితంగా పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. 40 ఏళ్లు పైబడివారిలో  చత్వారం వస్తుంది. ఫలితంగా దగ్గరగా చదవడం, రాయడం, చూడటంలో ఇబ్బంది పడుతుంటారు. 13వ ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా భారత  ప్రభుత్వం ఏడాది 'ఐ టెస్టింగ్‌ ఫర్‌ ఆల్‌' అనే నినాదం ఇచ్చింది. ఇందులో భాగంగా చిన్న పిల్లల్లో అంధత్వ నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

దృష్టి లోపాలు
  • మయోపియ, హైపర్‌ మెట్రోపియ, ఆస్టిగ్మాంటిసమ్‌, ప్రెస్‌బయోపియాగా .... దృష్టి లోపాలు ఉంటాయి. సరియైన పోషకాహారం తీసుకోకపోవడంతోనే ఇవన్నీ  పట్టిపీడిస్తాయి. విటమిన్‌ ఎ ,పాలు, గుడ్లు, ఆకుకూరలు, చేపలు, క్యారెట్‌, పసుపుపచ్చని పండ్లు తీసుకోవాలి. దృష్టిలోపం ఉన్నవారికి సరియైన వైద్య  పరీక్షలు చేయించి నిర్ధిష్టమైన కళ్లజోడు పెట్టుకోకపోతే అంధులుగా మారిపోయే ప్రమాదం ఉంది.

చిన్న పిల్లలలో దృష్టిలోపముల పరీక్ష
  • చిన్న పిల్లలు ఏదైన వస్తువులను చూసిన వెంటనే గుర్తుపట్టడంలో ఆలస్యం చేస్తే నేత్ర వైద్యనిపుణుని వద్దకు తీసుకువెళ్లి చూపించాలి. దృష్టిలోపం గుర్తించి  తక్షణమే కంటి అద్దాలు వాడటం చాలా ముఖ్యం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి, వారి కదలికలను గుర్తించి వస్తువులు  సరిగా గుర్తించగులుగుతున్నారో లేదో గమనించాలి. పిల్లలలో దృష్టిలోపాలు సరిచేయకుంటే చదువు ఆటపాటలు తదితర అన్ని విషయాల్లో వెనుకబడిపోయే  ప్రమాదం ఉంది.

జిల్లాలో గత అయిదేళ్లుగా విద్యార్థుల నేత్ర పరీక్షల వివరాలు
  • సంవత్సరం - పాఠశాలలు - విద్యార్థుల సంఖ్య - కళ్లజోళ్ల పంపిణీ
  • 2007-08 - 297 -     95,200 -     1745
  • 2008-09 - 262 -     87,626 -     460
  • 2009-10 - 212 -     82,782 -     1253
  • 2010-11 - 181 -     80,620 -     1461
  • 2011-12 - 256 -     97,211 -     1702

* 2012 సంవత్సరానికి సంబంధించి ఈనెల (October) నుంచి దృష్టి పథకం కింద నేత్రపరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేత్ర చికిత్సా పథకం-స్కూలు పిల్లల కంటి పరీక్షా కార్యక్రమం

పాఠశాల విద్యార్థుల్లో దాదాపు 'ఆరు నుంచి ఏడు' శాతం పిల్లలు దృష్టిలోపాలతో చదువులో వెనుకబడుతున్నారని తెలుస్తోంది.
* 10 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలందరికీ దృష్టి దోషాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు నేత్ర పరీక్ష (దూరంగా లేదా దగ్గరగా ఉన్నవాటిని  స్పష్టంగా చూడలేకపోవడం) చేస్తారు.
* పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ముఖ్యంగా సైన్స్‌ ఉపాధ్యాయులు, కళ్లజోడు పెట్టుకున్న ఉపాధ్యాయులకు పిల్లల కంటి సమస్యలు కనిపెట్టడంలో శిక్షణ  ఇస్తారు.
* దృష్టి లోపం (రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌) ఉన్నట్లు అనుమానంఉన్న పిల్లలను రిఫ్రోక్షన్‌ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నేత్ర సహాయకుని దగ్గరకు పంపుతారు.
* సరైన పరీక్షలు నిర్వహించి తగిన మందులు, కళ్లజోడు ధరించాలని సూచిస్తారు.
* పేద పిల్లలకు ఉచితంగా కళ్లజోడు ఇస్తారు.
* ప్రతి యేటా పాఠశాలల్లో కంటి పరీక్ష జరుపుతారు .

  • గ్లకోమాతో ప్రమాదం
కంటిలో ఒత్తిడి పెరగడాన్ని గ్లకోమా(నీటి కాసులు) అంటారు. అంధత్వ కారణాలలో గ్లకోమా ఒకటి. దీని కారణంగా శాశ్వత అంధత్వం ఏర్పడుతుంది.  దీనివలన కోల్పోయిన చూపును తిరిగి పొందలేరు. క్రమంగా నేత్రవైద్య పరీక్షలు, సకాలంలో చికిత్స ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. సాధారణంగా  40 ఏళ్లు పైబడినవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవటం ద్వారా గ్లకోమా అంధత్వాన్ని అరికట్టవచ్చు.

  • వ్యాధి లక్షణాలు, చికిత్స
తలనొప్పి, కంటినొప్పి, దీపం చుట్టూ రంగులు కనబడటం (ఇంద్ర ధనుస్సు మాదిరిగా) కంటి చూపు తగ్గిపోవడం, కన్ను ఎర్రబడి నీరు కారడం,  ప్రారంభదశలో గుర్తించినట్లయితే మందులు వాడితే సరిపోతుంది.
* శస్త్ర చికిత్స అవసరమైన వారికి తక్షణమే చేయడం ద్వారా ఉన్న చూపును తగ్గిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది.

  • మధుమేహవ్యాధి- రెటినా చికిత్స
పెద్దల్లో ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యల్లో ప్రధానమైనది మధుమేహ వ్యాధి. ఈ వ్యాధి వలన శరీరంలో ఏ అంగమైనా దెబ్బతినే ప్రమాదం కల్పించటం  ద్వారా మరింత సమస్యాత్మకంగా మారుతుంది. కళ్లకు కూడా సమస్యగా మారవచ్చు. చక్కెర వ్యాధితో వచ్చే కంటిచూపు లోపం రెటినాను దెబ్బతీస్తుంది.

  • చిహ్నాలు
వ్యాధి ప్రారంభంలో కన్ను నొప్పి గాని,ఇతర లక్షణం ఏమీ ఉండదు. తర్వాత దశలో క్రమంగా చూపు అలికినట్లు మారుతుంది. తర్వాత నల్లగీతలు  కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు చక్కెరవ్యాధి కారణంగా కంటిచూపుకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించాలి.

  • నివారణ
ఈ వ్యాధిని అదుపులో ఉండటానికి చక్కెరవ్యాధి గ్రస్తులు రక్తంలో చక్కెరశాతాన్ని నియంత్రణలో ఉండేలా చూసుకోవటం ప్రధాన సాధనం. చక్కెర  వ్యాధిగ్రస్తులంతా క్రమం తప్పకుండా కంటివైద్యుడిని సంప్రదించాలి.

* చికిత్స: చక్కెరవ్యాధి వల్ల అప్పటికే సమస్య బాగా ముదురుతుంది. చక్కెరవ్యాధికి చికిత్స ప్రారంభించటం ద్వారా దీనికి అనుసంధానంగా వచ్చే  కంటిచూపు సమస్యలను కూడా నియంత్రణలో ఉంచవచ్చు.
  • కంటికి గాయాలు తగలకుండా చూసుకోవాలి
ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో చిన్నపిల్లలకు అందుబాటులో పెన్నులు, చాకులు, గుండు సూది తదితర ప్రమాదకరమైన సామగ్రి అందుబాటులో  లేకుండా చూసుకోవాలి. లేదంటేకంటికి సంబంధించిన ఏ భాగంలోనైనా గాయం తగలవచ్చు. కంటికి తగిలే గాయాల్లో దాదాపు 90 శాతం గాయాలు  నివారించదగినవే . ఇందులో 45 శాతం గాయాలు ఇంట్లోను, నివాస ప్రాంతాల్లోను, పాఠశాలల్లోను, క్రీడాస్థలం లోనో తగులుతుంటాయి. పిల్లలకు కంటి  గాయాలు ఇళ్ల వద్దనే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి దీపావళి, దసరా, హోలి వంటి రంగులతో ఆడుకునే పండుగల సమయంలో ఈ  అవకాశాలు ఎక్కువ. సూర్యగ్రహణాన్ని నేరుగా(కంటికి ఎటువంటి అడ్డు పెట్టుకోకుండా) చూస్తే రెటినా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సందర్భాల్లో కంటికి  గాయాలు కాకుండా చూడటానికి సాధ్యమైనన్ని మార్గాలు తెలుసుకోవటం మంచిది.

  • ఇళ్ల వద్ద
* రోజువారీ ఉపయోగించే పదునైన వస్తువులు, సూదులు, కత్తులు వంటివి పిల్లలకు దూరంగా ఉండాలి. అవి కంటికి తగిలినప్పుడు ప్రమాదకరమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది.
* మనం ఉపయోగించే స్ప్రేలన్నీ కంటికి దూరంగా ఉండేట్లు, కనీసం కంటికి దిగువ భాగంలోనే ఉపయోగించేటట్లు జాగ్రత్త పాటించాలి.
* డిటర్జెంట్‌లు, అమోనియా వంటి రసాయనాలు ఉపయోగించే ముందు ఇచ్చిన జాగ్రత్తలు ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. అటువంటి రసాయనిక  వస్తువులు ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

  • ఆటలాడే సమయంలో
* పదునైన అంచులున్న ఆటవస్తువులు, కర్రా బిళ్లా వంటి ఆటలు, బాక్సింగ్‌ ఒక్కోసారి కంటికి తీరని గాయాలు చేస్తాయి. ఆట వస్తువులు ఎంపిక  చేసేటప్పుడు పిల్లల వయస్సును దృష్టిలో పెట్టుకోవాలి. చిన్న పిల్లలకు కొనే ఆటవస్తువుల్లో పదునైన అంచుగల వాటిని ఎంపిక చేయకపోవటం మంచిది.
* ఆట తుపాకులు వంటి వాటిని వాడకపోవడం మంచిది. దూరం నుంచైనా ఇవి  ఉపయోగించినప్పుడు కంటికి తగిలే అవకాశం ఉంటుంది.
* ప్రమాదకరమైన వస్తువులతో పిల్లలు ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వారిని గమనించటం చేస్తూ ఉండాలి.
* పెన్సిళ్లు, కత్తెర, బాణం, ఈటె వంటివి సక్రమమైన పద్ధతుల్లో కంటికి గాయం కాని పద్ధతుల్లో ఉపయోగించటం పిల్లలకు నేర్పాలి.

  • అక్టోబర్ లో ఈదృష్టి పథకం అమలు-- డాక్టర్‌ జి.వి.రమణ కుమార్‌,( జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రొగ్రాం మేనేజర్‌)
బడిపిల్లలు, బడిబయట పిల్లల నేత్ర సంరక్షణపై జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఆదేశం మేరకు ఈనెల 29 నుంచి మూడు దశలుగా దృష్టి కార్యక్రమం  ప్రారంభిస్తున్నామం. మొదటి దశ ఈనెల 29 నుంచి ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పదవ తగదతి వరకు చదువుకుంటున్న పిల్లలు, బడిచదివి మానేసిన పిల్లలందరికీ నేత్ర వైద్యపరీక్షలు నిర్వహిస్తాం.

* రెండో దశ డిసెంబరు అయిదు నుంచి ప్రారంభం అవుతుంది. ఆప్తాల్మీక్‌ అధికారుల ద్వారా పిల్లల్లో ఎంతమందికి కంటి అద్దాలు ఇవ్వాలో గుర్తించి నివేదిక  తమకు సమర్పిస్తారు.

* మూడో దశ 2013 జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఆప్తాల్మిక్‌ అధికారులు సూచించిన పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడంతో  పాటు శస్త్ర చికిత్సలు అవసరమయ్యే విద్యార్థులకు రిమ్స్‌ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారు. ఇదే విధంగా బడిబయట ఉన్న పిల్లలకు  అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో ఆదిశగా చర్యలు తీసుకుంటున్నాము.

  • కంప్యూటర్‌తో ఇబ్బందే
నిత్యం కంప్యూటర్‌పై పనిచేసే వారికి దృష్టిలోపం వస్తుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌పై దృష్టి పెట్టడం వలన కళ్లు అలసిపోతాయి. ఈ దిగువ సూచనలు  పాటిస్తే కళ్లు క్షేమంగా ఉంటాయి.
* కంప్యూటర్‌ స్క్రీన్‌కి కంటికి మధ్య 25 అంగుళాలదూరం ఉండాలి. వీలైతే ఎక్కువ దూరంలో ఉండి పనిచేసుకోవడం మంచింది.
* మానిటర్‌ టాప్‌ కళ్లకు దూరంగా 30 డిగ్రీల యాంగిల్‌లో ఉంచుకోవాలి.
* నిండుగా ఉన్న అక్షరాలు లేత రంగులపై వినియోగించాలి.
* స్క్రీన్‌ 15 నుంచి 50 డిగ్రీల మధ్య కళ్లకు సమాంతరంగా ఉంచుకోవాలి.
* చేతులన్న కుర్చీని ఉపయోగించాలి. తలను కిందికి తిప్పి ఉంచడం వలన అలసట తక్కువగా ఉంటుంది సూటిగా ఉంచినట్టయితే కళ్లు త్వరగా  అలసిపోతాయి.
* ఎప్పుడూ కూడా వేలాడబడిన బల్బు నుంచి పడే కాంతిని ఉపయోగించాలి. కర్టెన్లు వినియోగించి బయట నుంచి వచ్చే కాంతి వలన కంప్యూటర్‌ స్క్రీన్‌పై  పడేప్రతిబింబం నిరోధించాలి.
* ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి కళ్లను క్రమంగా ఒక వ్యవధి ప్రకారం మూసి తెరవాలి. కనురెప్పలను మూసి కళ్లను పక్కలకు గడియార  పద్ధతిలో ఒకసారి, వ్యతిరేక దిశలో ఒకసారి లోలోపల తిప్పుకోవాలి.

  • సలహా :
* ఎం.ఆర్‌.కె.దాస్‌. ఆప్తాల్మిక్‌ ఆఫీసర్స్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి-ప్రతీ మండలానికి ఆప్తాల్మిక్‌ అధికారి నియమించాలి--కంటి దృష్టిలోపాలు నివారించేందుకు ప్రతీ మండలానికి ఒక ఆప్తాల్మిక్‌ అధికారి ఉండాల్సిందే.ఈ విధంగా చేయడం వలన నేత్ర లోపాలు నివారించేందుకు  అవకాశం ఉంటుంది. ఇటీవల హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ నేత్ర విజ్ఞాన సదస్సులోప్రైమరీ ఐ కేర్‌ (పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు నేత్రాలపై  శ్రద్ధ) తీసుకోవాలని సూచించిందని వివరించారు. శ్రీకాకుళం  జిల్లాలో 22 మంది ఆప్తాల్మిక్‌ అధికారులు(2012) ఉన్నారని వీరి సంఖ్య చాలదని తక్షణమే నియామకాలు  చేపట్టాలని కోరారు. అంధత్వంలో 80 శాతం నివారించతగ్గవేనని తెలిపారు. 
అంధత్వము అంటే పూర్తిగా గాని పాక్షికం గా గాని చూడలేని స్థితి.
కంటి చూపు (Vision) పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం (Blindness) అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును.

దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు మరియు అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి." పూర్తి అంధత్వం (Total blindness) అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో "NLP" (No Light Perceptionan) అంటారు. వీరు కాంతి ఉన్నదీ లేనిదీ మరియు ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన అంధత్వం (Blindness) అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు మరియు ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.

అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని చట్టపరమైన అంధత్వం (Legal blindness) అంటారు. ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (visual acuity) (vision) 20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా దృష్టి లోపం అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) International Statistical Classification of Diseases, Injuries and Causes of Death ప్రకారం దృష్టి మాంద్యం (Low vision) అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం (Blindness) అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.

కొన్ని రంగుల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత (Colour Blindness) అంటారు. రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి (Night Blindness) అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ Magnitude and causes of visual impairment యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.

అంధత్వానికి కారణాలు : అంధత్వం చాలా కారణాల మూలంగా కలుగుతుంది:
2. 1. కంటి వ్యాధులు

దృష్టి మాంద్యం ఎక్కువగా వ్యాధులు మరియు పౌష్టికాహార లోపం మూలంగా కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంధత్వం కలగడానికి ముఖ్యమైన కారణాలు:

* శుక్లాలు (Cataracts) (47.8%),
* గ్లకోమా (Glaucoma) (12.3%),
* యువియైటిస్ (Uveitis) (10.2%),
* (Age-related Macular Degeneration) (AMD) (8.7%),
* ట్రకోమా (Trachoma) (3.6%),
* (Corneal opacity) (5.1%),
* మధుమేహం (Diabetic retinopathy) (4.8%) మరియు ఇతర కారణాలు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి ఎక్కువగా నివారించగలిగే కారణాల మూలంగా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంధులలో వృద్ధులు ఎక్కువగా ఉన్నా కూడా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ముఖ్యంగా కనిపిస్తుంది. అంచనావేసిన 40 మిలియన్ అంధులలో 70- 80 శాతం మందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును.
పాశ్చాత్యదేశాలలో కలిగే అంధత్వం వయోసంబంధమైన మాక్యులా లేదా రెటినా లోపాల వలన కలుగుతుంది. మరొక కారణం నెలలు నిండకుండా పుట్టే పిల్లలలో కలిగే రెటినోపతీ.

2. 2. కల్తీ సారా

అరుదుగా కొన్ని రకాల రసాయనిక పదార్ధాల మూలంగా అంధత్వం కలుగవచ్చును. కల్తీ సారా త్రాగడం ఒక మంచి ఉదాహరణ. మిథనాల్ (Methanol) ఇథనాల్ (Ethanol) తో పోటీపడి త్రాగుబోతు శరీరంలో ఫార్మాల్డిహైడ్ (Formaldehyde) మరియు ఫార్మిక్ ఆమ్లం (Formic acid) గా విచ్ఛిన్నం చెంది వాటివలన అంధత్వం మొదలైన ఆరోగ్య సమస్యలు మరియు మరణం సంభవించవచ్చును. ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన సారాలో ఉంటుంది.
  • ==================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !