Thursday, May 13, 2010

ఆరోగ్యశ్రీ పథకం శ్రీకాకుళం లో, ArogyaSri scheem in Srikaulam




ఆధునిక వైద్యసౌకర్యాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నూతన పధకం రాజీవ్ ఆరోగ్యశ్రీ

మన రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో అత్యధికులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నది పేదలే.ఆధునిక చికిత్సా విధానాలు, సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా ఈ వర్గాలు ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు నిస్సహాయంగా ఉండిపోవల్సి వస్తోంది. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు,మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు,క్యాన్సర్ చికిత్స(కీమో థెరపీ,రేడియో థెరపీ మరియు శస్త్ర చికిత్సలు ),కాలిన గాయాల చికిత్స,ఇతర గాయాల కు శస్త్ర చికిత్సలు (మోటార్ వాహనాల చట్టం పరిధిలోనివి కాకుండా) మరియు పూర్తి చెవుడు ఉన్న పిల్లలకు (ఆరు సంవత్సరములలోపు) శస్త్ర చికిత్స వీరికి అంతగా అందుబాటులో లేవు.ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు తగినంతగా లేకపోవడమే ఇందుకు కారణం. కార్పోరేట్ ఆసుపత్రులలో ఈ శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికి అవి ప్రధానంగా సంపన్న వర్గాలకే పరిమితం.గ్రామాల్లో దారిద్ర్యరేఖకు దిగువన జీవించే(బి.పి.ఎల్) వర్గాలకు ఇవి అందనంత ఎత్తులో ఉన్నాయి.ఏదన్నా అనారోగ్యం వస్తే తమకున్న కొద్దిపాటి ఆస్తుల్ని అమ్మేసుకోవడమో లేక అప్పుల పాలు కావడమో వీరికి తప్పడం లేదు. పర్యవసానంగా సమాజంలో ఆరోగ్య అసమానతలు ఏర్పడుతున్నాయి. నిరుపేద వర్గాలలో ఇవి తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో బిపిఎల్ కుటుంబాలకు పైన తెలిపిన తీవ్ర అనారోగ్యాల శస్త్ర చికిత్స నిమిత్తం ఆరోగ్యబీమా ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ పధకాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన 'ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్' ను ఏర్పాటుచేసింది.బీమా మరియు వైద్యరంగంలోని నిపుణుల సహాయంతో ట్రస్ట్ ఒక చక్కటి బీమా పథకాన్ని రూపొందించింది.పేదలకు అవసర సమయాల్లో శస్త్ర చికిత్సా సౌకర్యాలు సమకూర్చడం,వారు అప్పులబారిన పడకుండా చూడడమే 'రాజీవ్ ఆరోగ్యశ్రీ'బీమా పథకం లక్ష్యం బీమా సౌకర్యాన్ని కల్పించే నిమిత్తం టెండర్ల ప్రక్రియ అనంతరం'స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ'ని ఎంపిక చేశారు.దీనికయ్యే ప్రీమియం మొత్తం ప్రభుత్వమే సమకూర్చింది.

ఆసుపత్రి వ్యవహారాలలో మీ పనిని సులభతరం చేసేందుకు గాను అన్ని పి.హెచ్.సి.లలో మరియు మీకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 'ఆరోగ్యమిత్ర'లను నియమిస్తారు.

గౌ!! ముఖ్యమంత్రి డా!!వై.ఎస్ రాజశేఖరరెడ్డి గారు 31 మార్చి, 2007 న ఈ పథకం ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్, అనంతపురం,శ్రీకాకుళం జిల్లాలలో ప్రారంభించారు. ప్రారంభించిన ఏడు నెలల లోపలే సుమారు 8000 మంది రోగులకు ఆపరేషన్ నిమిత్తము వివిధ ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వబడింది. వీటికి అయ్యే ఖర్చు రూ.40 కోట్లు.

ఈ ప్రయోగాత్మక పథకం యొక్క విజయాన్ని మరియు ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి మరో ఐదు జిల్లాలలో (చిత్తూరు,తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,రంగారెడ్డి ,నల్లగొండ) 5 డిసెంబర్ 2007 నాటి నుండి రెండవ విడతగా ప్రవేశ పెట్టింది.

మరింత సమాచారము కోసం -> రాస్ట్ర ప్రభుత్వ పథకాలు

12/may/2010

శ్రీకాకుళం లో : ఇంతవరకు 25 వేల శస్త్ర చికిత్సలు చేసారు . 65 కో్ట్ల రూపాయిలు ఖర్చు చేసినట్లు జిల్లా కోర్డినేటర్ -పి.తిరుపతిరావు తెలియజేసారు .
శ్రీకాకుళం పట్టణంలోని
రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రి,
సింధూర ఆసుపత్రి,
బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో
ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నారని వివరించారు. జిల్లాలో 85 మంది ఆరోగ్యమిత్రలు, 17 మంది నెట్‌వర్కు ఆసుపత్రి మిత్రలు, అయిదుగురు రీజనల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా కో ఆర్డినేటర్‌ ఒకరు పనిచేస్తున్నారని వెల్లడించారు.

-------------------
సవంత్సరం- చికిత్సలు
------------------
2007-08- 4,127
2008-09- 9,157
2009-10- 9,643
----------------
న్యూరోసర్జరీ చికిత్సలు ఎక్కువగా జరిగాయని, రెండవ స్థానం గుండెకు సంబంధించి, గర్భస్థ సంబంధ వ్యాధులు ఎక్కువగా జరిగాయని కో ఆర్డినేటర్‌ పేర్కొన్నారు. జిల్లాలో తెల్లకార్డు, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డు ఉన్నవారు, పేదప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


  • -----------------------------------------------------
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !