Sunday, May 2, 2010

PassPort application in Srikakulam , పాస్ పోర్ట్ పొందడం శ్రీకాకుళం లో





విదేశాలు వెళ్ళాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరి . గతం లొ విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉన్న కొన్ని వర్గాల వారు మాత్రమే ముందుగా దీనిని తీసుకునేవారు . పస్తుతం పరిస్థితి మారింది . ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో ... ఏ అవసరం పడుతుందోనని పిల్లల నుంచి వృద్ధులు వరకు పాసుపోర్టు తీసుకుంటున్నారు . విధ్య , ఉద్యోగ రంగాలలో విదేశీ అవకాశాలు పెరగడం తో ఆ వర్గాల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు మేసుకుంటున్నారు . ముఖ్యం గా ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్ధులు తప్పనిసరిగా భావిస్తున్నారు . కొన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలలో పాస్ ఫోర్టు ఉండాలని సూచిస్తున్నాయి .

విశాఖపట్నం లో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఉన్నది . డిమాండును దృస్టిలో పెట్టుకుని 2004 లో శ్రీకాకుళం లోని ఎస్పీ బంగ్లాలో పాస్ పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించారు . ఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యాలయం పనిచేస్తుంది . జిల్లాలో ఇచ్చాపురం , సోంపేట , టెక్కలి , ప్రాంతాల నుండి ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటున్నారు .

దరఖాస్తు చేసిన 45 రోజులలో తగిన విచారణ జరిపి నేరుగా ఇంటికే పాస్పోటు ను పంపిస్తున్నారు .
కావలసిన పత్రాలు :
  • జనన తేదీకి సంబంధించిన ధృవీకరణ పత్రము ,
  • నివాస ధృవీకరణకు రేషన్ కార్డ్ , ఓటరు గుర్తింపు కార్డు , బ్యాంకు ఖాతా పుస్తకం లేదా విద్యుత్ బిల్లు , పోను బిల్లు , ఆదాయపు పన్ను ఆర్డరు ... ఏదో ఒకటి .
  • అభ్యర్ధులు విశాఖ పట్నం లోని రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ పేరిట రూ.1000/- డి.డి రూ . 100/- యుఉజర్ చార్జీలు చెల్లించాలి ,
  • 6 (ఆరు ) ఫోటోలు ,
  • జిల్లాలో ఒకతన్నర సం. నుంచి నివాసం ఉండునట్లు ద్రువ్వేకరణ పత్రము ఉండాలి .
  • మినార్లు , ఉద్యోగులకు విశాఖ లో ని ప్రాంతీయ కార్యాలలం లోనే జారీ చేస్తారు ,
  • రెన్యువల్ , తాత్కాలిక పాస్ పోర్ట్ ల కోసం కుడా ప్రాంతీయ కార్యాలయంలోనే సంప్రదించాలి .
  • జిల్లాలోని కార్యాలయం ఆదివారము , ఇతర సెలవు దినాల్లో పనిచేయదు .
  • కార్యాలయం 10 A.M నుండి 6P.M వరకు పనిచేస్తుంది .
=========================================

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !