ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడి :
మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహి స్తున్న ఐసిడిఎస్ ప్రాజెక్టులో పట్టణ ప్రాంతంలోని మురికివాడల్లో జీవనం సాగిస్తూ అవిద్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజానీకం యొక్క పిల్లలకు మంచి విద్యను అందించడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు,బాలింతలు,చిన్నపిల్లలో ఎక్కవగా పౌష్టిక ఆహారం లోపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల వారికి పౌష్టిక ఆహారం అందజేయడానికి ప్రభుత్వం శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడి కేంద్రాలను ఏర్పాట చేసినది.
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొత్తగా 426 అంగన్‌వాడికేంద్రాలకు ప్రతిపాదనలు ప్రభుత్వాకి పంపినట్లు మండల టాస్క్‌ఫోర్స్ అధికారి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజక్టు డైరక్టర్ టి.వి.శ్రీవాసరావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన సారవకోట మండల పరిషత్ కార్యాలయాకి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం 18 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ల పరిధిలో 3,153 ప్రధాన అంగన్‌వాడి కేంద్రాలు 348 మినీ కేంద్రాలు ఉన్నట్లు, మరో 426 కేంద్రాలలో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా రెండవస్థానంలో ఉండగా,డివిజన్ కేంద్రంలో మొదటిస్థానంలో ఉందని ఆయన అన్నారు.
విధులు :
- బాలింతలు, గర్భిణీలు, మూడు సంవత్సరం లోపు వయస్సు గల పిల్లలకు పౌష్టికాహారం .
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంగన్‌వాడి విద్యార్ధికి గుడ్డు ఇవ్వాలని నిర్ణయం చేసింది.
- గర్భిణీలను, బాలిం తను చూసి ..వారు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలపడం .
- అంగన్‌వాడి, అనీయత విద్యాకేంద్రాలలో విద్యార్థులను చైతన్య పరి చి విద్యా బోదన చేయడానికి .
- అంగన్‌వాడి కార్యకర్తలు, స్థానికంగా ఉండి పిల్లలకు ఆటపాటలతో పాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉంది.
- గ్రామాల్లో స్త్రీలకు అనేక విషయాలపై అవగాహన కల్పించా ల్సిన భాధ్యత అంగన్‌వాడీ కార్యక ర్తలపై ఉందని అన్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ముఖ్యంగా మహిళలను చైతన్యవంతులను చేసేందుకు అంగన్‌వాడి కార్యకర్తలు కృషి చేయాలని,
- అంగన్ వాడీ కేంద్రాల్లో శిశువులకు మంచి పోషక విలువలు గల పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని,
- నీరు, పారిశుధ్యం, రోగనిరోధకీకరణ, పోషక విలువలు వంటి సేవలను విశ్వజనీకరంగా అందుకోవడం అంగన్వాడి కార్యకర్తలు సహాయపడతారు ,
రాష్ట్రంలోని అంగన్‌వాడి కేంద్రాలకు పక్కా గృహాలు నిర్మించనున్నట్టు మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖా మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెల్లడించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలను సైతం సొంత భవనాల్లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) అమలుపై గురువారం పీడీలు, సీడీపీవోల సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 73,944 అంగన్వాడీ కేంద్రాల్లో 16,894 కేంద్రాలకు పక్కా గృహాలున్నాయన్నారు. మిగిలిన వాటి ఏర్పాటు కోసం జిల్లా, మండల పరిషత్తుల నిధుల్లో 15 శాతాన్ని కేటాయించడమే కాకుండా, నాబార్డు నుంచి కూడా సాయం కోరనున్నట్టు వెల్లడించారు.
శ్రీకాకులం జిల్లాలో 02/2011 నాటికి 756 అంగన్‌వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి మిగిలిన 2397 + కొత్తగా అనుమతించిన 244 కేంద్రాలకు అద్దె భవనాలలో నడుపుతున్నారు .
అంగన్ వాడి కేంద్రాలలో ఆరోగ్య పెట్టెలు :
చిన్నారులకు పౌస్టికాహారం అందించడంతో పాటు వ్యాధులను నయం చేసేందుకు ఏటా రెండు దఫాలుగా ఆరొగ్య పెట్టెలను అందిస్తున్నారు . 9 రకాల మందులతో కూడిన ఈ పెట్టెలు దైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకము గా కొనుగొలు చేసి కేంద్రాలకు సరఫరా చేస్తుంది .
ఈ ఆరోగ్య పెట్టెలో
- పారాసెటమాల్ మాత్రలు , సిరప్ లు(జ్వరం తగ్గడానికి)
- పొట్ట పురుగులు నయం చేసే మందు బిల్లలు
- ఫురజోలిడిన్ మాత్రలు , సిరప్ లు (విరోచనాలు తగ్గేందుకు)
- క్లోరోంఫినికాల్(యాంటిబయోటిక్ ) సెరప్ లు ,
- విటమిన్ చుక్కల మందులు ,
- ఐయోడిన్ సీసాలు ,
- బెంజీన్ సీసాలు ,
- దూది ,
- బ్యాండేజ్ పాకెట్లు ,
---------------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
Srikakulam Children Home(WD&CW Dept.),
Arasavelli Post & (Mandal),
Srikakulam Dist.
Children Home(WD&CW Dept.),
Sompeta(Po)&(M),
Srikakulam Dist.
Children Home (WD&CW Dept.),
Palasa (Po) & (M),
Srikakulam Dist.
- List of Anganwadi Workers Training Centres (AWTCs) (As on Jan’ 08) Andhra Pradesh
1. District Manager Durgabai Mahila Shishu Vikas Kendra AWTC, Etcheria Srikakulam-532405 Andhra Pradesh
2. The Secretary, AWTC Yuva Vijnana Parishad H.No.MIG, 30, APHB Colony (Opp. ZP) Srikakulam Andhra Pradesh
3. The Secretary Integrated Rural Development Society (IRDS) Amadalavalasa Srikakulam-532185 Andhra Pradesh
---------------------------
As on 01/06/2011
Total Anganvadi centers = 3397,
Mini Anganvadi centers = 685.
Total children getting services = 2,20,000.
Updates :June 2013.
అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త మెనూ--జూలై 1 నుంచి అమలుకు చర్యలు
అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలనే ఆలోచనతో కొత్తమెనూ అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్రాల్లో ఉన్న ప్రీ స్కూల్ పిల్లలకు భోజనం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త మెనూలో మూడేళ్లలోపు చిన్నారులకు పోషకాలతో ఉన్న పౌడర్‌ను మాత్రమే అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కొత్త మెనూను జూలై 1 నుంచి అమలు చేయాలని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా
18 ఐసీడీఎస్‌ల పీవోలకు ఆదేశాలు అందాయి. వీటి పరిధిలో
3397 ప్రధాన,
689 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.
ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లలు 26,676మంది,
ఒకటి నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 87,615 మంది,
మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 67,766 మంది,
22,941 మంది గర్భినీలు, 26,000 మంది బాలింతలు ఈ కేంద్రాల్లో ఉన్నారు.
ప్రీస్కూల్ పిల్లలకు భోజనం
అంగన్‌వాడీ కేంద్రాల్లోని మూడు నుంచి ఆరేళ్ల మధ్య వారిని ప్రీ స్కూల్ పిల్లలుగా గుర్తిస్తారు. వీరికి ప్రస్తుతం కేంద్రాల్లో రవ్వ ఉప్మా, రైస్ కిచ్చిడి, వారానికి రెండు గుడ్లు మాత్రమే అందజేస్తున్నారు. దీంతో అనేకమంది పిల్లలు కేంద్రాల వైపు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వీరిని ఆకర్షించే విధంగా భోజనం అందజేసేందుకు మెనూలో మార్పు చేశారు. రోజూ అన్నం, సాంబారు, రసం, కాయగూరలు, పప్పుతో భోజనాన్ని కేంద్రాల వద్దే వడ్డించనున్నారు. గతంలో మంగళ, శుక్ర వారాలు మాత్రమే అందించినగుడ్లును అదనంగా సోమ, గురు వారాల్లో వడ్డించేందుకుకొత్త మెనూలో మార్పు తీసుకు వచ్చారు. దీంతో వారానికి నాలుగు గుడ్లు అందనున్నాయి.
గర్భిణీలు, బాలింతలకు..
గర్భిణీలు, బాలింతలకు ఇంతవరకు అందజేస్తున్న రవ్వను పూర్తిగా తొలగించి దాని స్థానంలో బియ్యం పెంచనున్నారు. పెసర పప్పును మెనూ నుంచి తొలగించి దాని స్థానంలో కంది పప్పు అందజేయనున్నారు. ప్రస్తుతం గర్భిణీలు, బాలింతలకు 16 రోజులకు 1400 గ్రాముల బియ్యం, 375 గ్రాముల పప్పు, 250 గ్రాముల నూనె అందజేస్తున్నారు. కొత్త మెనూలో వీటి పరిమాణం పెంచనున్నారు. మూడు కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర కిలో నూనె ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.
మూడేళ్ల లోపు..
ఇంతవరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు నెలలనుంచి మూడేళ్ల పిల్లలకు బియ్యం, రవ్వ, పప్పు, నూనె వంటి సరుకులను కార్యకర్తలు అందజేసేవారు. కొత్త మెనూలో వీరికి ఈ సరుకులను అందజేసే అవకాశం లేదు. వీరికి మంచి పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల పోషకాలతో ఉన్న పౌడర్‌ను అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
పర్యవేక్షణ పెంచితేనే..
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మొక్కుబడిగా నడుస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో అరకొర పిల్లలు ఉండగా, మరికొన్నిచోట్ల తలుపులు తెరవని పరిస్థితి ఉంది. నిత్యం కేంద్రాలపై దృష్టి పెట్టాల్సిన పర్యవేక్షకులు కార్యకర్తలతో జతకట్టి చేతివాటానికి పాల్పడుతున్నారనే ఆరరోపణలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న మెనూ సక్రమంగా అమలుజరిగితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు ఏవీ?
కొత్తమెనూ అమలు జరిగేందుకు కేంద్రాల వద్ద కొన్ని సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. వంటకు గ్యాస్‌ను సమకూర్చాలి. ఇప్పటి వరకు కొన్ని మండలాలకు మాత్రమే అందజేశారు. మిగిలిన కేంద్రాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక్కో కేంద్రంలో సుమారు 20 నుంచి 30 మంది వరకు ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు. వీరికి భోజనం అందించేందుకు వంట పాత్రలు అవసరం.
పై ప్రోగ్రాం అంతా శుద్ద దండగ. పిల్లలకు అందవల్సిన ఆహారవస్తువు ... అంగన్‌వాడిలే మింగేస్తున్నారు. విద్యా బుద్దులు చెప్పవలసిన స్కూళ్ళలో ... వంటావార్పు లు నేర్పుతున్నారు. మన చదువుల దారి ఎటో?.
అంగన్వాడీల సమ్మె24/02/2014
అంగన్‌వాడీల వేడి చల్లారడం లేదు. డిమాండ్ల సాధన కోసం కార్యకర్తలు, ఆయాల చేపట్టిన సమ్మెకు వారం రోజులు పూర్తయ్యింది. సోమవారం 8వరోజు జిల్లాలోని 3,403 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. దీనివల్ల ఆయా కేంద్రాల్లో ఉన్న చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార ప్రభావం పడుతోంది. ఇప్పటికే పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్న బాలలకు ఇది మరింత శాపంగా మారనుంది. వెట్టిచాకిరీ చేయించుకుంటూ కనీసం వేతనాలు సైతం అమలుచేయడం లేదని అంగన్‌వాడీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం రూ.10 వేలు, పింఛనుతో సహా పదవీవిరమణ ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత, గ్యాస్ సబ్సిడీ తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు.ఇచ్చేవారుంటే కోరికలకు కొదవేమిటి . నిరుద్యోగ సమస్య తో ఎంతోమంది రోడ్ల పై తిరుగుతూ ఉంటే ఇప్పుదిస్తున్నది చాలదని అంగన్‌వాడీలు ఇలా రోడ్డేక్కడము ఎంతవరకు సమంజసమో ! ఇప్పుడున్న వారికి జీతాలు సగం చేసి ఆ మిగులు సొమ్ము తో ఇంకొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది కదా!
కిక్కిరిసిన గదులే దిక్కు--గాడితప్పిన అంగన్వాడీ సేవలు-'ఈనాడు - ముందడుగు'తో వెల్లడి--న్యూస్‌టుడే-శ్రీకాకుళం, ఇలిసుపురం:
ఆటపాటల మధ్య ఉల్లాసంగా సాగాల్సిన చిన్నారుల బాల్యం ఇరుకు గదుల మధ్యే బందీ అయిపోతోంది. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ప్రారంభమైన సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) మొక్కుబడి తంతుగా మారిపోతోంది. పట్టణ.. గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అద్దె భవనాల్లోనే విలువైన కాలం కరిగిపోతోంది. కేవలం పౌష్ఠికాహారం ఇవ్వడమే కాకుండా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలి. అందుకు విరుద్ధంగా జిల్లాలో అసౌకర్యాల నడుమ సావాసం చేస్తున్న చిన్నారుల దైన్యం 'ఈనాడు-ముందడుగు'తో బయటపడింది.
జిల్లాలో 18 ప్రాజెక్టుల పరిధిలో 3,153 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో కేవలం 664 కేంద్రాలకే సొంతభవనాలు ఉన్నాయి. మిగిలిన 2,489 వాటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక్కో కేంద్రానికి రూ.200, పట్టణ ప్రాంతంలో ఉన్న కేంద్రానికి రూ.750 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె ద్వారా మంచి గాలి, వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న భవనంలో నిర్వహించాలి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై సమాచార హక్కు చట్టం ఉపయోగించి 'ఈనాడు-ముందడుగు' ప్రతినిధి తీసుకున్న వివరాలతో అసలు వాస్తవాలు బయపపడ్డాయి. ప్రభుత్వం అద్దె బడ్జెట్ సక్రమంగా విడుదల చేయకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో కేంద్రాలు నెట్టుకొస్తున్నారు. గత అయిదు నెలలుగా అద్దె బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఇంటి యజమానుల దయాదాక్షిణ్యాలపైనే కేంద్రాలు నిర్వహిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గ్యాస్ పొయ్యిలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో కట్టెల పొయ్యి మీద వంట చేయాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతీ నెలా గ్యాస్ పొయ్యి బిల్లుల బదులు కట్టెలు ఖర్చు ఇస్తున్నారు. కట్టెల ద్వారా పొగ వచ్చే అవకాశం ఉందని చాలాచోట్ల ఇంటి యజమానులు అభ్యంతరాలు చెబుతున్నారు. దీంతో అంగన్వాడీ ఆయాల ఇంటివద్దే పోషకాహారం తయారు చేసి తీసుకొస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చిన్నారులకు అందాల్సిన పోషకాహారం పక్కదారి పడుతోంది.
అద్దె భవనం గగనమే
పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు భవనాలు దొరకడమే గగనమవుతోంది. రూ.750 అద్దె చెల్లిస్తున్నా సౌకర్యవంతమైన భవనాలు దొరకడం లేదు. అద్దె చెల్లింపులోనూ బకాయిలు పేరుకుపోవడంతో కొన్నిచోట్ల బలవంతంగా కేంద్రాలు ఖాళీ చేయిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కేంద్రాల నిర్వహణలో కార్యకర్తనే పూర్తి బాధ్యురాలిని చేయడంతో అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఏర్పడుతోందన్న వాదన ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకర్తలు ఇరుకైన గదుల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
ప్రతిపాదనలు పంపుతున్నాం
- టీవీ శ్రీనివాస్, మహిళా శిశుసంక్షేమ శాఖ పీడీ
జిల్లాలో అంగన్వాడీ భవనాలకు కొరత ఉన్న మాట వాస్తవమే. సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నాం. గతేడాది 98 కేంద్రాలకు, ఈ సంవత్సరం 150 కేంద్రాలకు అనుమతి మంజూరైంది. త్వరలో మిగిలిన కేంద్రాలకు ప్రతిపాదనలు పంపుతాం.
ప్రచురణ తేది: 17/11/2009
- =================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !