Monday, March 8, 2010

టెక్కలి పట్నం , Tekkali Town


[Mandals-srikakulam111.jpg] [Srikakulam+Constituency+Map.jpg]

టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నండి 50 కి.మి దూరములొ ఉత్తరాన ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజక వర్గమునుండి పోటి చేసి గెలిచాడు, రాష్ట్ర శాసన సభ కి ఎన్నిక అయ్యాడు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇదిఒకటి, ఇది దివిజన్ కేంద్రము,మరియు శాసనసభ నియోజకవర్గము

ముఖ్య పట్టణము----------- టెక్కలి
జిల్లా--------------------- శ్రీకాకుళం
గ్రామాలు----------------- 49
జనాభా-------------------70,872 (2001)
• మగ-------------------35011
• ఆడ-------------------35861
• అక్షరాశ్యత శాతం--------60.45
• మగ------------------72.63
• ఆడ------------------48.66

రావివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలానికి చెందిన గ్రామము. టెక్కలి పట్టణానికి 5 కి.మి దూరములొ ఈ గ్రామము ఉన్నది. ఈ గ్రామములో ప్రసిద్ది చెందిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది. ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లిఖార్జున స్వామివారు. ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యముగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం.

డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన టెక్కలి మేజర్‌ పంచాయతీ మున్సిపాలిటీ హోదాను సంతరించుకుంది. ప్రతీ డివిజన్‌ కేంద్రాలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనలకు టెక్కలి అన్ని హంగులను సమకూర్చుకుంది. 1925 అక్టోబర్‌ 25 బలరాందాస్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో ఆవిర్భ వించిన టెక్కలి మేజర్‌ పంచాయతీ 2001 జనాభా ప్రాతిప దికన 23 వేల 288 మంది ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన టెక్కలి మేజర్‌ పంచాయతీలో ప్రస్తుతం 20 వార్డు లుండగా 53 వీధులున్నాయి.

40వేల జనాభా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చాలన్న పంచాయతీరాజ్‌ ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించి 20వేల జనాభాకు సవరించింది. ఈ నేపథ్యంలో టెక్కలి మేజర్‌ పంచాయతీ ఒక్కటిని మున్సిపాలిటీగా మార్చినప్పటికీ ఆశ్చర్యపోనవసరంలేదు. అయితే, ఇది సరికాదని భావించిన యంత్రాంగం పరిసర పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయనుంది. ఇందులో భాగంగా తోలుసురబల్లి, తిర్లంగి, సీతాపురం, తలగాం, రావివలస, బసువాడ, తేలినీలాపురం, అక్కవరం, బొప్పాయిపురం పంచాయతీలను విలీనం చేయనుంది. దీనిద్వారా 40 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీగా అవతరించనుంది. ప్రస్తుతం మేజర్‌ పంచాయతీ ఏటా 55 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ పంచాయతీ అభివృద్ధి వినియోగానికే నిధులు ఖర్చవుతున్నాయి. 2001 జనాభా ప్రకారం 4.04 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న పంచాయతీల్లో 5 వేల 979 కుటుంబాలున్నాయని అంచనా. వీటి ప్రకారం టెక్కలి మున్సిపాలిటీగా మారే అవకాశం ఉంది.

  • టెక్కలి MLA కొర్ల రేవతీపతి చనిపోతే అతని భార్యకి MLA పదవి ఇచ్చారు. టెక్కలి MLA పదవి పొందిన భారతివిద్యార్హత కేవలం ఇంటర్మీడియేట్. మా జిల్లాలో ఈవిడ తప్ప మిగిలిన MLAలు డిగ్రీలు ఉన్నవారే .
  • టెక్కలి ఆర్.టి.సి. డిపో శ్రీకాకుళం ఇఇల్లా రద్దీ బస్సు డిపోలలో ఒకటి . 78 బస్ సర్వీస్లు లతో టెక్కలి డిపో మంచి ఆదాయము తెస్తుంది .

.
  • ===============================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !