Tuesday, March 9, 2010

పాలకొండ పట్నం , Palakonda Town


[Srikakulam+Constituency+Map.jpg] [Mandals-srikakulam111.jpg]


పాలకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. జిల్లాలోగల 3 రెవిన్యు డివిజన్ లలో ఇది ఒకటి, డివిజన్ కేంద్రము, మరియు శాసనసభనియీజకవర్గము. పాలకొండ పట్నం ఒక మేజర్ పంచాయతీ.

  • ముఖ్య పట్టణము----------- పాలకొండ
  • జిల్లా--------------------- శ్రీకాకుళం
  • గ్రామాలు----------------- 45
  • జనాభా-------------------73,592 (2001)
  • మగ------------------36560
  • ఆడ-------------------37032
  • అక్షరాశ్యత శాతం--------57.47
  • మగ------------------68.41
  • ఆడ------------------- 46.75

పాలకొండ టౌన్ లో ప్రముఖం గా చెప్పుకోవలసినది -- కోటదుర్గ అమ్మవారి ఆలయం , జగన్నాధ ఆలయము , ఆర్.సి.యం క్రైస్తవ మందిరము .

జిల్లాలో మేజర్‌ పంచాయితీలలో ఒకటైన పాలకొండ పంచాయితీని నగర పంచాయితీగా మారుస్తూ ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నట్లు విశ్వసనీయ ప్రజాప్రతినిధుల ద్వారా తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ పంచాయితీతో పాటు నరసన్నపేట, టెక్కలి పంచాయితీలకు కూడా నగర పంచాయితీ హోదా కల్పించనున్నట్లు తెలుస్తోంది. పాలకొండ పంచాయితీని నగర పంచాయితీగా మార్చేందుకు మొట్టమొదటిసారిగా 1988లో రాష్ట్ర మున్సిపల్‌ శాఖామంత్రిగా కిమిడి కళా వెంకటరావు ఉన్నప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆనాడు పాలకొండ నగర పంచాయితీ కావాలంటే అన్నవరం పంచాయితీని పాలకొండలో కలపవల్సిన పరిస్థితి రావడం, అన్నవరం పంచాయితీ పెద్దలు, గ్రామస్తులు తమ పంచాయితీని పాలకొండ పంచాయితీలో కలిపేందుకు ఇష్టపడక హైకోర్టులో పిటిషన్‌ వేసి స్టే తెచ్చుకోవడంతో ఆ ప్రతిపాదనలు అక్కడితో ఆగిపోయాయి. అనంతరం ఒకటి, రెండు సంవత్సరాల్లో ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చినప్పటికీ కారణాలేవైనా కార్యరూపం దాల్చలేదు. 2001, 2006 పంచాయితీ పాలక మండలి పల్లా కొండలరావు అధ్యక్షతన పాలకొండ పంచాయితీని నగర పంచాయితీ చేయాలని ప్రతిపాదనలు పంపించినా ప్రయోజం లేకపోయింది.

పాలకొండ పంచాయితీ స్వాతంత్య్రానికి ముందు నుండి ఉంది. 1944లో పంచాయితీగా ఏర్పడింది. ఈ పంచాయితీకి మొదటి సర్పంచ్‌గా ఎల్లు మహంతి భాస్కరరావు, 1951 వరకు వ్యవహరించారు. 1951-53 వరకు కోరాడ సూర్యనాయుడు, 1964-70 వరకు ఎల్‌.సూర్యనారాయణమ్మ నాయురాలు, 1970-72 వరకు పైడి శ్రీరామమూర్తి, 1972-81 వరకు తిరిగి 1985-2001 వరకు దుప్పాడ సూర్యనారాయణ, 1981-1988 వరకు కోరాడ వెంకటరావు, 1988-91 వరకు ఎస్‌.ఎం.వి.గోపాలరాజు, 1991-1993 వరకు సాసుబల్లి తవిటినాయుడు, 1993-95 వరకు పడాల నర్సింగరావు, 2001-2006 వరకు పల్లా కొండలరావు, 2006 నుండి డాక్టర్‌ చొంగ రమాదేవి గ్రామ సర్పంచ్‌లుగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనలు ఖరారైతే డాక్టర్‌ చొంగ రమాదేవి పాలకొండ పంచాయితీకి చివరి సర్పంచ్‌గా మిగిలిపోతారు.

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ విధి విధానాల ప్రకారం మేజర్‌ పంచాయితీ పక్కనున్న నాలుగు పంచాయితీలతో కలిపి 40 వేల జనాభా దాటి ఉంటే ఆ పంచాయితీలను నగర పంచాయితీలుగా మార్చనుంది. ఈ నేపధ్యంలో పాలకొండ మేజర్‌ పంచాయితీతోపాటు కొండాపురం, అన్నవరం, సింగన్నవలస గ్రామాలను కలుపుకొని నగర పంచాయితీగా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం 2001 జనాభా లెక్కల ప్రకారం పాలకొండ పంచాయితీ జనాభా 28 వేల 250గా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఈ జనాభా మరో 8 వేలు పెరిగి ఉంటుంది. దీనికి తోడు పాలకొండ పట్టణాన్ని ఆనుకొని ఉన్న మూడు పంచాయితీలను కలుపుకొని పోతే 40 వేల జనాభా దాటుతుందని దీంతో పాలకొండను నగర పంచాయితీని చేసేందుకు అడ్డంకులన్నీ తొలిగిపోతాయని ప్రభుత్వ యంత్రాంగం యోచిస్తోంది. నగర పంచాయితీ అయిన పక్షంలో పాలకొండ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే అవకాశం పెరగనుంది. కాగా పన్నుల భారం కూడా అదే పద్ధతిలో పెరుగుతుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పాలకొండ పంచాయితీకి అన్ని ఆర్ధిక వనరుల నుండి సుమారు సంవత్సరానికి 65 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని పంచాయితీ పరిధిలో ఉన్న అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పంచాయితీ కృషి చేస్తున్నప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంటోంది. నగర పంచాయితీగా మారితే రాష్ట్రప్రభుత్వం నుండి నగర పంచాయితీ అభివృద్ధికి ప్రతీ సంవత్సరం కనీసం రెండు కోట్ల రూపాయలు విడుదల అవుతాయి. దీంతో పట్టణాభివృద్ధి సులభతరం అవుతుందని ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించవచ్చునని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది.
update on 19-july 2011---------
పాలకొండలో విద్యాసంస్థలు :
1994 వరకు పాలకొండ లో కేవలం ఒక పరభుత్వ జూనియ ర్ , డిగ్రీ కళాశాలే ఉండేవి .
ప్రస్తుతము ->
బి.ఈ.డీ కాలేజీలు -------------- 03,
హిందీ బి.ఈ.డీ కళాశాల ---------01,
ప్రవేటు జూనియర్ కాలేజీలు ------08,
ప్రవేటు డిగ్రీ కళాశాలలు ----------09,
పి.జీ కళాశాల -------------------01,
ప్రవేటు పాఠశాలలు ---------------20,
జి.యం.ఆర్ డీ.ఏ.వీ పబ్లిక్ స్కూల్ --01




  • ==========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !