సోంపేట శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఒక మోస్తరు పట్టణము .గ్రామ పంచాయతీ క్రిందనే పరిపాలన జరుగుతుంది .
2001 సెన్సెస్ ప్రకారము జనాభా -- 17390
- పురుషులు ------------49% ,
- స్త్రీలు -----------------51% ,
- చదువు కున్నవారు ------- 63% ,
- చదువు కున్న పురుషులు - 72% ,
- చదువుకున్న స్త్రీలు ------54% ,
- సోంపేట కొబ్బరి పీచు పరిశ్రమకి ప్రసిద్ధి . క్యయర్ మాట్స్ , తివాచీలు , క్యోయర్ పరుపులు చేస్తారు .
- ఆరోగ్యవరం కంటి హాస్పిటల్ ఈ పట్టణానికి వైద్య పరం గా వరం లాంటిది ,
- ఇక్కడ 30 మంచాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది ,
- ఒక పోస్ట్ ఆఫీసు , మూడు సినిమా హాలులు ( శివ పిక్చర్ పాలసు , తిరుమల పిక్చర్ పాలసు , శ్రీనివాస మహల్)
సోంపేట పట్టణ కేంద్రములో ఆరు దశాబ్దాల క్రితము కెనడాకు చెందిన వైద్యులు డా.బెన్ గలీసన్ సేవా ధృక్పధంతో ఏర్పాటు చేసిన ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి ఉత్తరాంద్రలోనే కంటి రోగులకు ఎనలేని సేవలందిస్తూ మంచి గుర్తింపు పొందినది. ఉచితముగా వైద్య పరీక్షలు కంటి ఆపరేషనలు, అద్దాల సరఫరాతో పాటు ప్రత్యేక వైద్యశిబిరాలద్వారా పలు మారుమూల గ్రామాలకు వెళ్ళి సేవలందిస్తూ పేదలను ఆదుకోవడములో ముందడుగు వేస్తుంది. వైద్యరంగము విస్తరించిన ప్రస్తుత పరిస్థితులలో సైతము ఆంద్రాలోని పలు జిల్లాలు, ఒరిస్సాకు చెందిన అనేకమంది కంటి రోగులు ఇక్కడ చికిత్స చేసుకుంటున్నారు .
1939 లో మారుమూలగ్రామమైన సోంపేటలో డా.బెన్ గలీసన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసారు. 1969 లో కంటి ఆసుపత్రిగా మార్పు చెంది ఆపరేషన్ ఐ యూనివర్సల్ అనే అంతర్జాతీయ సంస్థ నేతృత్వములోకి చేరింది. 1969 నుండి 1978 వరకు డా.ఖోస్లే, 1978 నుండి 1994 వరకు డా.డేవిడ్ ,1997 నుండి 2006 వరకు డా.సుదీప్ రామారావులు విశేష సేవలందిచారు . ప్రస్తుతం డా.షీలా సూపరింటెండెంట్ గా సేవలు అందిస్తున్నారు.
- ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న స్మృతి చిహ్నంగా సోంపేట పట్టణ శివారులో నిర్మించినలచ్చన్న ఘాటను నిర్మించారు .
- వీర వనిత పంచాది నిర్మల ఊరు సోంపేట దగ్గర బొడ్డపాడు గ్రామము . ఈమె నక్శలైట్ ఉద్యమకారిణి .
- సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ...
- సోంపేట లో కంచిలి రోడ్ లో అయ్యప్ప దేవాలయం , వెంకటేశ్వర దేవాలయం , కాశీవిశ్వనాధ దేవాలయము , నవగ్రహఆలయము ఉన్నాయి .
- ===============================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !