Wednesday, February 17, 2010

District Library , జిల్లా గ్రంధాలయం







శ్రీకాకుళం గ్రంధాలయం స్తాపించి నేటికి 50 సం.లు అయినది .
సంస్థ అధ్యక్షులు ------- రాడ మోహనరావు ,
గ్రంధాలయ అధికారి --- డి .గోపాలరావు ,
సంస్థ కార్యదర్శి -------వి.విద్యాసాగర్ ,

పరిచయం : విజ్ఞాన ప్రపంచానికి పుస్తక భాండారారాలు (గ్రంధాలయాలు)గీటురాళ్ళు . సంస్త జ్ఞానాన్ని ప్రోది చేసుకొని చరిత్ర గతులను , వర్తమాన విశేషాలను ప్రజలకు చేరవేస్తూ విశేష ఆదరాభిమానాలు చూరగొంటున్నాయి . సమాచార , సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పుల కనుగుణం గా ఆధునిక పరిజ్ఞానముతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి .ఇందులొ భాగంగా కల్పిస్తున్న ఏసీ, ఇంటర్నెట్ సౌకర్యాలతో గ్రంధాలయాల వైపు పాఠకులు ఆకర్షితులవుతున్నారు . డిజిటల్ లైబ్రరీ , ఇ-గ్రంధాలయాల ఏర్పాటు వీటిలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు .

శ్రీకాకుళం లో 1952 లో జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని , దానికి అనుబంధం గా మూడు శాఖలను ... రాజాం , టెక్కలి , ఇచ్చాపురం లలో ప్రారంభించారు .అనంతరం ఇంతింతై ... వటుడింతై అన్నట్లు నేడు 41 శాఖలతోనూ,61 మినీ గ్రంధాలలతోనూ జిల్లా గ్రంధాలయ సంస్థ వర్ధిల్లుతోంది . వాటిలో 18 శాఖలు సొంత భవనాలను సంకూర్చుకొగా మరో తొమ్మిది నిర్మాణ దశలో ఉన్నాయి .

పోటీ పరీక్షలకు పత్యేక విభాగము

నిరుద్యోగ యువతను దృస్టిలో పెట్టుకొని జిల్లాగ్రంధాలయమ్లో " కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ రిఫరెన్స్ యూనిట్ " ను 2003-04 లో ఏర్పాటు చేశారు . పోటీ పరీక్షార్హులకు ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది . యూనిట్ లో UPSC , SSAC , NDA , CDS, BANKING , RAILWAY తదితర పోతీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉంచారు . వీటితో బాటు రాస్ట్ర ప్రభుత్వ సర్వీసులైన ... గ్రూపు-1 , గ్రూపు-2 , పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలను నిరుద్యోగుల సౌకర్యార్ధం ఉంచారు . అదేవిధం గా ఇంజినీరింగ్ , వైద్యం , ఇసెట్ , బి.ఇ.డి, టి.టి.సి ., తదితర పవేశపరీక్ష్ పుస్తకాలు లభ్యమవుతున్నాయి .

సంచార గ్రధాలయ సేవలు :



జిల్లాకేంద్రమ్లో గల పాఠకులకు ఇంటింటికి వెళ్ళి పుస్తకాలను అందించే ప్రక్రియ కు 1996 లో జిల్లా గ్రంధాలయ సంస్థ స్వీకారం చుట్టింది . ఇందులొ భాగం గా పట్టణం లో అన్ని ప్రాంతాలకు సేవలందేలా ఒక మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు . పట్టణం లోని 113 కేంద్రాల వద్ద వాహనాన్ని నిలిపి పాఠకులకు కావల్సిన పుస్తకాలను అందజేస్తున్నారు .

డిజిటల్ గ్రంధాలయం :



గ్రంధాలయ సంస్ట కు అందుబాటులో ఉన్న దాదాపు 40 వేల పుస్తకాలను కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది . ఇ-గ్రంధాలయ యేర్పాటులో భాగం గా పుస్తకాల బార్ కోడింగ్ సభ్యత్వ వివరాలు కంప్యూటరీకరణ్ జరుగుతోంది . కొద్ది రోజులలలో ఈ తరహా సర్వలు పాఠకులకు అందుబాటులోనికి తేనున్నారు .

పత్రికా వి్భాగము :
జిల్లా కేంద్రానికి వచ్చే అన్ని తెలుగు దినపత్రికలతో పాటు .. హిందూ , ఇండియం ఎక్ష్ ప్రెస్స్ , దక్కన్ క్రానికల్ తదితర ఆంగ్ల దినపత్రికలను అందుబాటులో ఉంచారు . వీటితో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని తెలుగు , ఆంగ్ల మాసపత్రికలు లభ్యమవుతున్నాయి .
పాత పత్రికలూ లభ్యం -- పలు దినపత్రికలకు సంబంధించిన పాత ప్రతులను భద్రపర్చేందుకు జిల్లాగరంధాలయ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది . ఇందుకోసం జిలాలో 10 శాఖా గ్రంధాలయాలను ఎంపిక చేసి వాటిలో నిల్వచేశారు .

అధునాతన సౌకర్యాలు :
పాఠకుల సౌకర్యార్ధం 2008 నుంచి రీడింగ్ రూం కు ఏసీ సౌకర్యము కల్పించారు . రాస్ట్రం లో హైదరాబాద్ , వరంగల్ తర్వాత ఇటువంటి సౌకర్యము ఉన్నది శ్రీకాకుళం లోనే పాఠకులకు మరింత సమాచారాన్ని అందించేందుకు 2009 లో ఇంటర్ నెట్ సౌకర్యాన్ని రాయితీ ధర పై కల్పించారు . దీంతో ర్ద్యోగ ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిరుద్యోగులు అందుకు అవసరమైన దరఖాస్తులను ఆన్ లైన్ విధానం ద్వారా పంపుతున్నారు . అదేవింధగా ప్రవేశ పరీక్షలలో ర్యాంకులు సాధించిన విద్యార్ధులు మంచి కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకుంటున్నారు . పాఠకులు కోరుకున్న సమాచారాన్ని రాయితీ ధర పై జిరాక్ష్ ప్రతులలో అందిస్తున్నారు . ఈ సౌకర్యాన్ని మొదటిసారిగా జిల్లా కేంద్ర గ్రంధాలయం లో 2007 నుంచి అందిస్తున్నారు . 21 గ్రంధాలయాలకు టి.వి లు ఇవ్వడం జరిగినది .
  • ============================================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !