Monday, December 16, 2013

Mahatma Gandhi National Employment Guarantee Scheme,మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం

  •  


భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా గ్రామాలపై ఆధారపడి ఉన్నందున గ్రామీణాభివృద్ధిలో ప్రత్యేకమైన శ్రద్ధ చోటుచేసుకుందని విశదమవుతుంది. అతివేగంగా పెరుగుతున్న గ్రామీణ జనాభాకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం దేశ ఆర్థిక వ్యవస్థకు జటిలంగా తయారైంది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు ఆశించినంతగా పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గ్రామీణ పేదరికాన్ని, నిరుద్యోగితను, నిరంతరమైన వలసలను, కరువు కాటకాలను నిర్మూలించాలనే క్లిష్ట సమస్యను పరిష్కరించడానికి వివిధ సంక్షేమ పథకాలను, ప్రణాళికలను రూపొందించి ప్రతిష్టాత్మకంగా అమలు పరిచింది. ఈ పథకాలలో 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' ముఖ్యమైంది. మన గ్రామీణ నిరుపేదలు తెలిసిన విద్యా కూలీ పని పగలంతా చమటోడ్చి పనిచేయడం వారు నమ్ముకున్న వృత్తి. అందుకే కేంద్ర ప్రభుత్వం 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' పథకం పేదలకు కనీస వేతన సౌకర్యాలను కల్పించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి జీవనోపాధిని కల్పించాలనే ప్రత్యేక దృష్టితో రూపొందించారు. ఈ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది. ఇందులో చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ కాలంలో ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అలాగే పేద విద్యార్థులు కూడా తమ విద్యా అవకాశాలను తీర్చుకోవడానికి ఈ పథకం తోడ్పడుతుందని తెలుస్తుంది. భారతదేశంలో ప్రతి వ్యక్తి పనిచేయడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తూ జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ పేర్కొంది. మొట్టమొదటిసారిగా 'ఉపాధి హామీ పథకాన్ని' 1993లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలో నిరుపేదలకు ఉపాధి కార్యక్రమాలను అమలు చేయాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించి 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'గా పేరుమార్చి 2005 సెప్టెంబర్‌న రూపొందించి దేశంలో మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 2, 2006 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రస్తుత ప్రధానమంత్రి 'మన్మోహన్‌ సింగ్‌' చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రథమంగా దేశంలో మొదటి విడతలో 200 జిల్లాల్లో, రెండవ విడతలో 130 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. ఈ పథకం కరువు, వలసలు తీవ్రతరంగా ఉన్నాయి. వీటిని అరికట్టడానికి వీరి పని దినాలను పెంచాలనే స్పష్టమైన ఆలోచనలో ఉంది. అదే విధంగా గ్రామాలలో జీవనోపాధిని కల్పించే 'జాతీయ పనికి ఆహార పథకం' (ఎన్‌ఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుసి), 'సంపూర్ణ గ్రామీణ ఉద్యోగ ప్రణాళిక' (ఎస్‌జిఎవై) పథకాలను ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో విలీనంచేసి అభివృద్ధి దిశకు శ్రీకారం చుట్టింది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి --- భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగష్ట్ 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడినది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.

    పథకం వివరాలు --- ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడినది. ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి.

    పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది. దీనికి పల్లె ప్రాంతాల్లోని ప్రజలు సమీప కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఉపాధి వివరాల ఉత్తరం ద్వారా తెలియచేయబడతాయి. దీనికొరకు, వ్యక్తులుబ్యాంకులలో ఖాతా తెరవవలెను. వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.
 
 దీనివలన, గ్రామీణ కూలీల వలసలు తగ్గటంతో. పట్టణాలలో నిర్మాణ రంగ కార్యక్రమాలు కుంటుపడటం, లేక ఖర్చు పెరగడం జరుగుతున్నది.

 పనులు ---  
            నీటి నిలువలు, సౌకర్యాలు పెంచడం
            నీటి కాలవలు (అత్యంత చిన్న చిన్న నీటిపారుదల పనులు)
            సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ (చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
            కరువు నివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం
            వరదల నియంత్రణ, రక్షణ పనులు (నీళ్లు నిలిచిన స్థలాల్లో కాలవల ఏర్పాటుతో సహా)
        రహదారులఅభివృద్ధి---
                గ్రామాల్లో అన్నివాతావరణాల్లో వాడుకొనేలా రహదారుల ఏర్పాటు.
        భవనాల నిర్మాణం--
    పాఠశాల, ఆరోగ్య కేంద్రం భవనాలు

   
    సామజిక మార్పులు

    దీనిలో భాగంగా దళితుల భూముల్లో పనికి అగ్రస్థానాన్ని ఇవ్వటంతో, అగ్రజాతి వారు కూడా దళితుల భూముల్లో పని చేస్తుండటంతో, సమాజంలో మార్పులు కొన్ని చోట్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.
  
    గ్రామీణ కుటుంబంలోని వయోజనులందరూ వారి పేరు, వయస్సు మరియు చిరునామా ఫోటోలను గ్రామపంచాయితీకి ఇవ్వవలెను.  ఆ గ్రామపంచాయితీ తగిన విచారణ చేసి ఆ కుటుంబ వివరములు నమోదు చేసి ఒక ఉపాధి పత్రమును జారీ చేస్తారు.  ఆ ఉపాధి పత్రములో ఆ వయోజనుని వివరములు అతని/ఆమె ఫోటో ఉంటుంది.  ఈ పథకములో నమోదు చేసుకున్న వ్యక్తి వ్రాతపూర్వకముగా ( కనీసం పద్నాలుగురోజులు నిరవధికంగా పనిని కల్పించమని కోరుచూ) సదరు పంచాయతీకి గాని ప్రోగ్రామ్ అధికారికిగాని ధరఖాస్తు చేసుకోవాలి.
    పంచాయితీ/ప్రోగ్రామ్ అధికారి సరియైన ధరఖాస్తును స్వీకరించి మరియు ధరఖాస్తును స్వీకరించినట్లుగా రశీదు ఇచ్చి పనిని కల్పించుచున్నట్లుగా ఒక పత్రాన్ని ధరఖాస్తుదారునికి పంపుతారు మరియు ఆ పంచాయితీ ఆఫీసులో ప్రకటించబడే ఏర్పాటు చేస్తారు.  ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉపాధి కల్పించబడుతుంది.  ఉపాధి కల్పించే పని ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే అదనపు వేతనం ఇవ్వబడుతుంది.

    ఆచరణ యధాస్థితి
            2006-07 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం రెండువందల (200) జిల్లాల్లో మరియు 2007-08 ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై జిల్లాల్లో ప్రవేశపెట్టబడినది.
            2008 వ సంవత్సరంలో ఏప్రియల్ నెలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దేశంలో సమస్త గ్రామీణ ప్రాంతాల్లో ముప్పైనాలుగు (34) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆరువందల పద్నాలుగు (614) జిల్లాలు, ఆరువేల తొంభైఆరు (6096) మండలాలు, రెండు లక్షల అరవైఐదు వేల గ్రామపంచాయితీలలోను విస్తరింపచేయబడింది.         

                            పనివారికి ఎలాటి సౌకర్యాలుంటాయి?
                    జ. సురక్షితమైన నీరు, పిల్లలకు నీడ, విశ్రాంతి సమయం, చిన్న ప్రమాదాలేర్పడిలపుడు అత్యవసర ట్రీట్మెంట్కు కావలసిన సరంజామాతో ఫస్ట్ఎయిడ్ బాక్స్ ఉంటుంది.

                                పనివారి విషయంలో ఎలాటి జాగ్రత్తలు తీసుకొంటారు?
                    జ.  యాక్సిడెంట్స్ సంభవిస్తే  :  పనిచేసే స్థలంలో ఎవరికైనా ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలితే, రాష్ట్ర ప్రభుత్వం సదరు పనివారికి ఉచిత వైద్య  సదుపాయాన్ని కలగజేస్తుంది.
                     ఆసుపత్రి పాలైతే       :  సదరు రాష్ట్ర ప్రభుత్వం పనివారికి ఉచిత వైద్య వసతి, మందులు, ఆసుపత్రిలో ఉండటానికి ఉచిత వసతి  సదుపాయాన్ని కలగజేస్తుంది. అదే గాయపడినవారికి దినభత్యం కింద వారి కనీస వేతనంలో 50 శాతం చెల్లిస్తారు.
                    మరణం / శాశ్వతలోపం  సంభవిస్తే      :  అలాటి సందర్భాల్లో 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా గానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తంగానీ సదరు మరణించిన, శాశ్వతలోపం సంభవించిన పనివారి వారసులకు చెల్లిస్తారు.

                అర్హులైన దరఖాస్తుదారుకు ఉపాధి రాకపోతే ఏం జరుగుతుంది?
                    జ. అర్హులైన దరఖాస్తుదారుకు దరఖాస్తు చేసుకొన్న 15 రోజుల్లోగా ఉపాధి రాకపోతే వారికి నిరుద్యోగభృతిని షరతుల మేరకు ఇవ్వడం జరుగుతుంది.అలవెన్స్ రేటు – నిరుద్యోగభృతి  తొలి 30 రోజులకి వేతనంలో 25శాతం, మిగిలిన ఆర్థిక సంవత్సరానికి 50 శాతం
                             
                ఎలాంటి పనులు ఈ పథకం కింద అనుమతింపబడతాయి, వాటి ప్రాధాన్యత
                    * నీటిని కాపాడటం, వాటర్ హార్వెస్టింగ్
                    * కరువునివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం
                    * నీటికాలవలు(మైక్రో, చిన్ననీటిపారుదల పనులు)
                    * షడ్యూల్డ్ కులాలు, తెగలు లేదా ఆ భూమి లబ్దిదారులకున్న పొలాలకు నీటికాలవల సౌకర్యం  ఏర్పాటు. ఇందులో భూసంస్కరణల వల్ల లబ్ది పొందిన వారి భూములకు, భారత ప్రభుత్వ పథకమైన ఇందిరా ఆవాస్ యోజన కింద భూమిని పొందినవారికీ వర్తిస్తుంది.
                    * సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ(చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
                    * భూమి అభివృద్ధి
                    * వరదల నియంత్రణ, రక్షణ పనులు(నీళ్లు నిలిచిన స్థలాల్లో కాలవల ఏర్పాటుతో సహా)
                    * గ్రామాల్లో అన్నివాతావరణాల్లో వాడుకొనేలా రహదారుల ఏర్పాటు. ఈరహదార్ల నిర్మాణంలో కల్వర్ట్లను నిర్మించడం కూడా జరుగుతుంది.
                    * ఇవేగాక రాష్చ్రాలను సంప్రదించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతించే పనులు.

                ప్రోగ్రాం అధికారులు చేసే పనులకెలా బాధ్యత వహిస్తారు ?
                    జ. పోగ్రాం అధికారులు చేసే పనులకెలా బాధ్యత అనేది ఈ కార్యక్రమ నిరంతర మదింపు, ఆడిట్ల ద్వారా జరుగుతుంది.  ప్రోగ్రాంలో ఉండే అధికారులు, దానికి వెలుపల ఉండే అధికారులు ఈ కార్యక్రమపు మదింపు, ఆడిట్లను చేస్తారు. ఈ ఆడిట్ల నిర్వహణ బాధ్యత గ్రామసభలదే. గ్రామసభలు ఒక గ్రామ స్థాయి విజిలెన్స్ను దీనికోసం ఏర్పాటు చేయాలి. ఎలాటి అతిక్రమణలు జరిగినా 1000 రూపాయలదాకా జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే, ఒక ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరించడానికో కమిటీ ఏర్పాటు చేయాలి.

             
  • ============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !