Monday, December 16, 2013

Bangaru thalli scheme in Srikakulam,శ్రీకాకుళం జిల్లాలో బంగారుతల్లి పథకం

  •  


  •  

ఇద్దరు ఆడపిల్లలు జన్మిస్తే ఈ పథకం వర్తిస్తుంది. మే 1వ తేదీ తర్వాత జన్మించిన వారు ఆడపిల్ల అయి రెండో కాన్పయితేనే ఇది వర్తిస్తుంది. అంతకు ముందు జన్మించిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తించదు. దీనిపై అవగాహన లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి ముందుగా గ్రామసంఘం వద్ద పేరు నమోదు చేసుకోవాలి. దరఖాస్తుపై గ్రామ సంఘం అధ్యక్షురాలు, ఏఎన్‌ఎం, వైద్యాధికారులు ధ్రువీకరణ చేస్తూ సంతకాలు చేయాలి. ఈ దరఖాస్తుతో పాటు తల్లి, ఆడపిల్ల ఫొటోలు, పాప జన్మ ధ్రువీకరణ పత్రం, తల్లి రేషన్‌కార్డు, తల్లి ఆధార్‌కార్డు, తల్లి బ్యాంకు ఖాతా, ఏఎన్‌ఎం ఇచ్చిన టీకాల పుస్తకం, ఎంసీపీ-ఐడీ సంఖ్య, అంగన్‌వాడీ కార్యకర్త పేరు, ఫోన్‌ నెంబరు, ఆసుపత్రి కాన్పు ధ్రువపత్రం సమర్పించాలి.

Bangaru Thalli is a welfare scheme for girl child launched by Government of Andhra Pradesh. The scheme supports the family of a girl from her birth till her graduation.. All the Below Poverty Line white card holders are eligible for the scheme....

అర్హతలివీ

* ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
* తెల్ల రేషన్‌కార్డు ఉండాలి.
* ఆసుపత్రి కాన్పు అయి ఉండాలి.
* మే 1, 2013వ తేదీ తర్వాత పుట్టిన వారికే వర్తిస్తుంది.
* రేషన్‌ కార్డు, గర్భవతి, జన్మించిన ఆడపిల్ల వివరాలు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఏఎన్‌ఎమ్‌ పరిశీలన వివరాల ధ్రువ పత్రం, బ్యాంకు ఖాతా నకళ్లను కంప్యూటర్లో పొందుపరచాలి.

It was launched on May 1, 2013 by Chief Minister of Andhra Pradesh, Kiran Kumar Reddy. The supporting legislation AP Bangaru Thali Girl Child Promotion and Empowerment Act, 2013 was passed on June 19, 2013 in Andhra Pradesh Legislative Assembly.

చెల్లింపులు ఇలా జరుగుతాయి
బంగారుతల్లి పథకం లబ్ధిదారులకు నగదు చెల్లింపులిలా జరుగుతాయి. పుట్టినప్పటి నుంచి 21వ సంవత్సరం వయసు పూర్తయ్యేంత వరకు ప్రతి ఏటా చెల్లింపులు జరుగుతూనే ఉంటాయి. ఇవి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆసుపత్రిలో జన్మించిన వారికి మొదట విడత రూ.2,500 చెల్లిస్తారు. ఇంటివద్ద ప్రసవించినవారికి ఈ మొత్తం వర్తించదు. మొదటి సంవత్సరం నుంచి 21వ సంవత్సరం వరకు అందరికి ఇవి వర్తిస్తాయి.
  •  
* నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల విద్యాభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుంది. మధ్యలో చదువు మానేస్తే పథకం నిలిచిపోతుంది. 21 ఏళ్లు నిండి ఇంటర్మీడియట్‌తో చదువు ముగిస్తే చివరగా రూ.50 వేలు, డిగ్రీ పూర్తిచేస్తే రూ. లక్ష అదనంగా నగదు ప్రోత్సాహాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ మొత్తాలు వారి ఉన్నత చదువులకు ఉపయోగపడతాయి. వివాహ వయసు కూడా అప్పటికి రావడంతో వివాహ ఖర్చులకు కూడా ఉపయోగించుకునే వీలుంది.
  •  

ప్రచారలోపము-ఇబ్బందులు

ప్రభుత్వం 'బంగారుతల్లి పథకం' ద్వారా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి విద్యాబుద్ధులు చెప్పించేవరకు చేయూతనిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అవగాహన కొరవడుతోంది. పథకానికి సంబంధించిన ధ్రువపత్రాలు ససమర్పించడంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పథకం అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ప్రజల చెంతకు చేరడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో మే 1, 2013 తర్వాత జన్మించిన ఆడపిల్లలకు (రెండో కాన్పు)కు ఈ అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు (Dec.2013)...10 vEల మంది ఆడ పిల్లలు జన్మించి ఉంటారని ఇందిరాక్రాంతి పథం అధికారుల అంచనా. ఇందులో ఇంతవరకు 4,043 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,081 మందికి మాత్రమే పథకం మంజూరైంది. ఇందులో 231 మంది తల్లులు ఇంటి వద్ద ప్రసవించినందున కాన్పు కలిగిన వెంటనే తొలిసారి ఇవ్వాల్సిన రూ. 2,500 నగదు ప్రోత్సాహాన్ని అందుకోలేక పోయారు. అయితే వీరంతా తదుపరి ప్రోత్సాహకాలకు అర్హులే.

గ్రామాల్లో చాలామందికి బంగారుతల్లి పథకం గురించి తెలియదు. ఎవరో చెబితేగానీ దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావడంలేదు. ఈ పథకంపై స్వయంశక్తి సంఘాలు గానీ, గ్రామసంఘాలు గానీ ప్రజలకు అవగాహన కల్పించడంలేదు. ఐకేపీ అధికారులు సైతం ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలేదు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, ప్రయోజనం ఏమిటనే విషయాలు గ్రామీణ ప్రజలకు అవగాహన లేదు. దీంతో పథకం నత్తతో పోటీపడుతోంది. ఇప్పటికైనా అధికారులు పథకంపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తే ప్రయోజనం ఉంటుంది.

- పి.రవికుమార్‌, జిల్లా పథక ప్రబంధకుడు, శ్రీకాకుళం @ - న్యూస్‌టుడే, గ్రామీణ వీరఘట్టం

update in Feb-2013

Bangaru talli Scheme--బంగారుతల్లి పథకం

బంగారుతల్లి పథకాన్ని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం 2013 మే 1న అమల్లోకి తెచ్చింది.  తెల్లరేషన్‌కార్డు
ఉన్న కుటుంబాల్లో పుట్టిన ప్రతీ ఆడబిడ్డకీ  పుట్టినప్పటి నుండీ డిగ్రీ పూర్తి అయిన వరకూ ఈ పథకాన్ని
వర్తింపచేస్తామని ప్రభుత్వం ఘనంగానే ప్రకటించినా.. వివిధ కారణాల వల్ల ఇది పూర్తిస్థాయిలో
విజయవంతం కాలేకపోతోంది. ఈ పథకము నాటి ముఖ్యమంత్రి ' కిరణ్ కుమార్ రెడ్డి ' చే ప్రారంభించబడి
శాసన సభ చే ఆమోదించబడింది.

హక్కుదారులు :


 01 మే 2013 తరువాత పుట్తిన ప్రతి ఆడబిడ్డ ... ఆర్ధికముగా వెనుకబడిన
కుటుంబం లో పుట్టి తెలుపు రేషన్‌కార్డు కలిగి ఉన్నవారు.

 Scheme విధానము
The state government will give Rs 1,000 every month to every
pregnant woman the moment she conceives till she delivers a baby. If
she gives birth to - a baby girl born Rs 2,500
- Rs 1,500 every year through Anganwadis till the girl turns 5 years.
- At the time of admission to school, Rs 1,000
- Rs 2,000 will be given every year for her studies from the first to
the fifth standard
- Rs 2,500 from sixth to eighth standard
- Rs 3,000 for ninth and tenth standard
- Rs 3,500 each year for Intermediate
- Rs 3,000 a year during her graduation.

బంగారు తల్లి పథకం - లక్ష్యాలు

 అమ్మాయి బిడ్డకు జంకని మద్దతు చూపించడానికి,
 అమ్మాయి పిల్లల ఆల్ రౌండ్ వృద్ధి కోసం ,
 బాలికల / స్త్రీల సాంఘిక స్థితి మెరుగుపరచడానికి ,
 బాలిక  ఒక భారం అని భావన పోగొ్ట్టడానికి ,
 మహిళలు ఎదుర్కొంటున్న సాంఘిక దురాచారాలను పోరాడటానికి సహాయం,
ఆడపిల్లల సాధికారిక & హక్కు కాపాడి   లింగ వివక్ష అడ్డుకోవడానికి ,
 జనాభా సంతులనం పునరుద్ధరించడానికి.
 సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడానికి ,
 దేశం సౌభాగ్య నిర్మానము  కోసం మహిళల సామర్థ్యాలు వెలికితీయడం కోసం ,

శ్రీకాకుళం జిల్లాలో బంగారుతల్లి పథకం :

2013 మే 1 నుంచి 2014 జనవరి వరకు జిల్లాలో నమోదైన జననాలు 33,447. ఇందులో
ఆడపిల్లలు 16,714 మంది. వీరిలో 80 నుంచి 85 శాతం మంది తెలుపు రేషన్‌ కార్డు ఉన్న
కుటుంబాలకు చెందిన వారే. అంటే సుమారుగా 14,206 మందికి పైగా ఆడపిల్లలు బంగారుతల్లులే.
వీరిలో బంగారుతల్లి పథకం కింద దస్త్రాల్లో నమోదైనవారు మాత్రం 8178 మంది. నూటికి నూరుశాతం
పథకం సరిగా అమలు కాకపోవటానికి శాఖల మధ్య సమన్యయం లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది
సమాచార మార్పిడిలో నిర్లక్ష్యం కారణాలుగా కనిపిస్తున్నాయి.

అన్నీ సమస్యలే...శాఖల మధ్య సమన్వయం లోపం-అమల్లో ఇబ్బందులు--

* బంగారు తల్లి పథకానికి అర్హులు కావాలంటే స్థానిక సంస్థల నుంచి జనన ధ్రువపత్రం లేదా సంబంధిత
ఆసుపత్రి వైద్యాధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఇదంతా శిశువు పుట్టిన వారంలోగా జరగాలి.
ఇందుకోసం స్థానిక ఏఎన్‌ఎంలు బాధ్యత తీసుకోవాలి. వీరు ప్రసూతి, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై
దృష్టిసారిస్తున్నంతగా ఈ పథకంపై దృష్టిసారించడం లేదు.

* బిడ్డ ప్రసవించినచోటే జనన ధ్రువపత్రం ఉండాలి. అంటే.. ఇక్కడి నుంచే బంగారుతల్లి పథకానికి అర్జీ
చేయాలి. వాస్తవానికి గర్భిణీలు ప్రసూతి సమయానికి కన్నవారింటికి వెళ్తారు. పుట్టింట్లోనే 90 శాతం
ప్రసవాలు అవుతున్నట్టు అంచనా. అంటే అక్కడే జనన ధ్రువపత్రం, అర్జీ తదితర ప్రక్రియలన్నీ
పూర్తిచేసుకోవాలి. తరువాత మెట్టినింటికి వెళతారు. అక్కడ వీరికి ఎలాంటి అవకాశం ఉండటం లేదు.

* గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీలు సక్రమంగా వివరాలు నమోదు చేయడం లేదు. నమోదు
చేసినవాటినీ నెలల వారీగా కార్యదర్శికి అందజేసి సకాలంలో రిజిస్టరు నిర్వహించేలా చొరవ చూపడం
లేదు. ఇది సక్రమంగా జరిగినా.. నాలుగైదు గ్రామాల బాధ్యతలు చూస్తున్న కార్యదర్శులు పని ఒత్తిడి
కారణంగా వాటిని పట్టించుకోవడం లేదు. ఇలా జనన ధ్రువీకరణపత్రం అందని ద్రాక్ష అవుతోంది.

* జనన ధ్రువపత్రం కేవలం మీ-సేవ కేంద్రాల ద్వారానే తీసుకోవాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లోని
లబ్ధిదారులకు ప్రధాన అడ్డంకిగా మారింది.

* పట్టణ ప్రాంతాల్లో బిడ్డకు జన్మనిచ్చినట్లయితే నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రులకు జనన ధ్రువీకరణపత్రం
పొందడం కష్టమవుతోంది. ఒక్కోసారి ఆసుపత్రుల నుంచి సక్రమంగా వివరాలు అందజేయకపోవడం, బిడ్డ
వివరాలు నమోదు కాలేదని పురపాలక సంఘం అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పడం
జరుగుతోంది.

* అన్ని పత్రాలు ఉన్నవారు నేరుగా మండలంలోని ఐకెపి అధికారులను సంప్రదిస్తే గ్రామాల్లోని ప్రాథమిక
ఆరోగ్యకేంద్రాధికారి, ఎఎన్‌ఎం ధ్రువీకరించాలని తిప్పి పంపిస్తున్నారు. దీంతో అవగాహన లేని ఏఎన్‌ఎంలు
తమకు అలాంటి నిబంధనలు ఏవీ లేవని చెబుతున్నారు.

* మెట్టినిల్లు ఉన్న గ్రామంలోనే గర్భిణీగా వివరాలు నమోదు చేసుకోవాలని అంగన్వాడీ సిబ్బంది పనిని
తప్పించుకోవడం మరో సమస్యగా మారింది. మెట్టినిల్లులో ఉన్న సిబ్బందిని సంప్రదిస్తే కాన్పు జరిగింది...
పుట్టింటి దగ్గర కాబట్టి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకూడదని వారు చెబుతుండడంతో లబ్ధిదారులకు
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

* బ్యాంకు ఖాతా తెరిచేందుకు అవసరమైన గుర్తింపు పత్రాలు లేనివారు బంగారుతల్లి పథకం కింద
దరఖాస్తుకు నోచుకోలేకపోతున్నారు. కొత్తగా వివాహమైనవారికి రేషన్‌కార్డు ఉండదు. తల్లి పేరు పుట్టినిల్లు
కార్డులో ఉన్నా చెల్లదు. దీంతో నవ వధువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మే నుంచి జిల్లాలో పుట్టిన పిల్లల వివరాలు
------------------------------------------
నెల మగపిల్లలు- ఆడపిల్లలు - మొత్తం
------------------------------------------
మే-- 1966 - 1748 - 3714
జూన్‌-- 1806 - 1886 - 3692
జులై-- 1766 - 1685 - 3451
ఆగస్టు-- 1767 - 1839 - 3606
సెప్టెంబరు-- 1843 - 1978 - 3821
అక్టోబరు-- 1748 - 1846 - 3594
నవంబరు-- 2003 - 1988 - 3991
డిసెంబరు-- 1876 - 1888 - 3764
జనవరి-- 2014 1988 - 1856 - 3844
-----------------------------------------
మొత్తం 16,763 - 16,714 - 33,447
------------------------------------------


సరైన పత్రాలు లేనందునే...
సరైన పత్రాలు లేకపోవడం వల్ల కొంతమందిని తిరస్కరించాల్సి వస్తోంది. ఒడిశా సరిహద్దు కావడం వల్ల
అక్కడి నుంచి ప్రసవాలకు జిల్లా సరిహద్దులోని ఆసుపత్రులకు వస్తున్నారు. అటువంటి సందర్భాల్లో
ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కొంతమందికి ఈ పథకం అమలు చేయలేక పోతున్నాం. రేషన్‌ కార్డుల
సమస్యలు ఉన్నాయి.

- రవికుమార్‌, డీపీఎం, ఇందిరా క్రాంతి పథం@న్యూస్‌టుడే - కలెక్టరేట్‌, గుజరాతిపేట
  •  =============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !