Friday, February 15, 2013

Midday meal scheem in Srikakulam, శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం
శ్రీకాకుళం జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 2626 ప్రాథమిక, 580 ప్రాథమికోన్నత, 431 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.07 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల భోజనం ఖర్చుల కోసం రూ. 4, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.4.65 ఇస్తున్నారు. బియ్యం ప్రభుత్వమే ఇస్తుంది. ఉప్పు కారం, నూనెలు, చింతపండు ఇలా ప్రతి ధర గతతో పోలిస్తే 30శాతం పైగా పెరిగాయి. మరోవైపు ఈ ఖర్చులన్నింటికీ వంట గ్యాస్‌ ధరలు అదనపు భారంగా మారాయి. ఈ పరిస్థితిలో భోజనం కోసం సొమ్ము పెంచాలని పలువురు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,637 పాఠశాలలు ఉండగా, దాదాపు చాలా పాఠశాలల్లో వంటశాలలే లేవు. జిల్లా వ్యాప్తంగా 1700 వంటశాలలు అవసరం కాగా 1645 పాఠశాలల్లో వంటశాలల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా, ఒక్కో వంటశాల  నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.75 వేలు సరిపోవని వీటిని నిర్మించేందుకు ఎవరు ముందుకు రావడంలేదు. దీంతో ఇప్పటికి 103 వంటశాలలే నిర్మాణం పూర్తి అయ్యాయి. దీంతో తరగతి గది అరుగులపై లేకుంటే ఆరుబయట ఎండ, వానల్లోనే వంట వండేస్తున్నారు.

ధరలు భారమే

మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి పెరిగిన ధరలతో నిర్వాహక సంస్థలకు అదనపు భారం పడుతున్న మాట నిజమే. నాణ్యమైన భోజనం అందించాలంటే ధరలు పెంచాల్సిన అవసరముంది. మన ఒక్కరి సమస్య కాదు - ఇవి ఒక్క జిల్లా సమస్య కాదు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఈ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నవే. నిర్వాహక ఏజెన్సీలకు ఇచ్చే మొత్తం పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. వంటశాలల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.----ఎస్‌.అరుణకుమారి, డీఈవో శ్రీకాకుళం .


రాష్ట్రంలో మొత్తం 80 వేల స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్నిఅందిస్తుంది --ప్రభుత్వ స్కూళ్ళలోని 82 లక్షల మంది పిల్లలకు ఈ పథకం అమలులోఉంది. భారత దేశంలో స్వాతంత్య్రానంతరం 1953 లో తొలిసారిగా స్వచ్ఛంగా మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. 1958-59లో యునిసెఫ్, డబ్ల్యు.హెచ్.ఓ సహకారంతో జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మధ్యాహ్న భోజన పథకాన్ని వివిధ  రాష్ట్రప్రభుత్వాల నుంచి  1980 సంవత్సరం నుంచి మంచి ఆదరణ లభించింది. సుప్రీంకోర్టు  ఉత్తర్వులననుసరించి మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు  2001 నవంబర్ 29 నుంచి అమలు చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రాథమిక విద్యకు ఊతమిచ్చే జాతీయ పోషకాహార కార్యక్రమం, నేషనల్ ప్రోగ్రామింగ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను  1995 ఆగస్టు 15 న ప్రారంభించారు ,

మధ్యాహ్న భోజన పథకాన్ని 2004 దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు జనవరి1, 2005 నుండి నుంచి  తప్పనిసరిగా పాటించాలని తీర్పునిచ్చింది.  మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండిన ఆహారంలో 10 గ్రాముల ప్రోటీన్లు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం వర్తింపచేసి అమలులోకి తెచ్చిన సంవత్సరం2003. 2011 లెక్కల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం అమలు వలన ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షలు మంది పాఠశాలల్లోని విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం 1వ తరగతి నుండి 10 వ తరగతి పిల్లలకు కూడా 13.10.2000 సంవత్సరం నుండి అమలు జరుగుతుంది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం  వర్తింపచేసిన ప్రాథమిక పాఠశాలల సంఖ్య 62,273.

మధ్యాహ్న భోజన పథకం లక్ష్యాలు--
1. పాఠశాలలో నమోదు నిలకడను పెంచడం
2. బడిమానేసే విద్యార్థుల సంఖ్యను పూర్తిగా తగ్గించడం
3. బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ .

 మధ్యాహ్న భోజన పథకం వలన ఇబ్బందులు :
ఈ పథకము ఉపాధ్యాయులకు , బోధనా సిబ్బందికి చాలా ఇబ్బందికరము గా ఉంటుంది. వారు చదువు చెప్పే విలువైన కాలాన్ని ఎలా వృధా అవుతుంది. ఒకప్పుడు పిల్లలకు పోషకాహారము అందే కొరత ఉండేది .. కాని ప్రస్తుత కాలములో నాగరికత పెరిగి ప్రతి కుటుంబం లోనూ ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండడము చేత తల్లిదండ్రులు వారి పిల్లల ఆహారవిషములో మెరుగైన జాత్రత్తలు తీసుకుంటున్నారు . ఈ పథకాలు ఇంకా అవసరము లేదు. చదువు విషయము నాన్యతా ప్రమాణాలు పాటిస్తే బాగుంటుంది.

శానిటేషన్‌ , పరిశుబ్రత పాటించడము , సామూహిక బోజనాలు దగ్గర కొంతవరుకు కొరవడుతుంది కావున ... విరోచనాలు , వాంతులు , గాస్ట్రో ఎంటరైటిస్ ప్రబలే అవకాలు మెండుగా ఉంటాయి. బడిపిల్లల ఆరోగ్యాలు చెడిపోయే ప్రమాదము ఉంటుంది.

నేడు కాన్వెంట్ చదువులు ఎక్కువ అవడము మూలంగా ఈ పధకం ఆశయాలు నీరుగారే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది.

సరియైన బడి వసతులు అనేకచోట్ల లేవు. ఈ నిధులు నవీన పాఠశాలల నిర్మానానికి ఖర్చుపెడితే 100% మేలు జరుగుతుంది. మన రాస్ట్రము ఏబడిలోనూ మరుగుదొడ్ల సదుపాయము లేదు. ఇక ఆడ పిల్లల దుస్థితి ఎలా ఉంటుందో ఊహించలేము.

ప్రభుత్వనిదులు దుర్వినియోగము , ఉపాధ్యాయుల విలువైన కాలాన్ని వృదాఅవడము తప్ప ... నేటి సమాజములో ఈ పథము ఉపయోగము కనబడడము లేదు.

=============================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !