Friday, December 30, 2011

Srikakulam Road Railway Station,




శ్రికాకుళం పట్నానికి రైల్వే స్టేషన్ లేదు .13 కి.మీ దూరము లో శ్రీకాకుళం రోడ్ జంక్షన్ అనే పేరుతో ఆమదాలవలస లో ఉన్నది. 2006 లో రెజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రము శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆఫీసు ఆవరణలో పెట్టారు. చాలా సదుపాయముగా ఉంది.


ఈ క్రింది పట్టిక 12-12-2007 తేదీ నాటిది. Train Timing at Srikakulam Rd.Amadalavalasa



  • ప్రజాశక్తి - ఆమదాలవలస సౌజన్యముతో(Fri, 22 Apr 2011).
శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్టేషన్‌లో షెడ్‌లు లేకపోవడంతో మండుటెండలో ప్రయాణికులు రైళ్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ స్టేషన్‌ నుంచి విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్‌, ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణికులు వెళ్తుంటారు. స్టేషన్‌లో రెండు బుకింగ్‌ కౌంటర్లు రోజూ తెరిచి ఉంచాలని అధికారులు చెప్తున్నప్పటికీ ఒక్క కౌంటర్‌ను మాత్రమే తెరుస్తున్నారు. దీంతో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్‌ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ పాసింజర్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లే సమయంలో తోపులాటలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.


ఈ స్టేషన్‌ నుంచి రోజుకు 1500 టిక్కెట్లు వరకు అమ్ముడుపోతుంటాయి. కనీసం రోజుకు 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అంటే సంవత్సరానికి సుమారు 15 కోట్లు ఆదాయం వస్తుంది. ఇంత లాభం వస్తున్నా ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదు. రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం ఇటీవల నిర్మించారు. ఇది ఇరువైపులా 100 మీటర్లు పొడవున నిర్మించారు. కానీ షెడ్‌లు వేయలేదు. ప్రయాణికులు రైలు కోసం మండుటెండలో వేచివుండాల్సి వస్తోంది. కొందరు ప్రయాణికులు ఎండకు కళ్లుతిరిగి పడిపోయిన సంఘటనలు కూడా కోకొల్లలు. స్టేషన్‌లో ఇన్ని సమస్యలున్నప్పటికీ రైల్వే అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇటీవల కాలంలో డిఆర్‌ఎం కాశీనాథ్‌ నాలుగు నుంచి ఐదు సార్లు పర్యటించారు. ఆయన వచ్చినప్పుడు కార్యాలయానికి రంగులు వేస్తారే తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడంలేదు. ఫ్లాట్‌ఫారాన్ని పొడిగించారే తప్ప తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్లును ఏర్పాటు చేయలేదు. దీంతో రైల్వేస్టేషన్‌లో అపారిశుధ్యం రాజ్యమేలుతోంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అధికారులు వస్తున్నారంటే చాలు పినాయిల్‌తో ఫ్లాట్‌ఫారం శుద్ధి చేస్తారు. లేకుంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించదు. ఏడాదిలో స్టేషన్‌కు వచ్చిన లాభంలో పది శాతం అభివృద్ధికి కేటాయించినా సరిపోతుందని పలువురు ప్రయాణికులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రైల్వేస్టేషనలో సౌకర్యాలు కల్పిస్తారో, లేదో వేచి చూడాలి.


ఈ క్రింది పట్టిక 28-12-2011 తేదీ నాటిది.Railway timings



  • ================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !