పేలుడు పదార్ధాలు నిల్వాఉంచాలంటే పెద్ద ఎత్తున అనుమతులు అవసరము . పొటాష్ , సల్ఫర్ వంటి పధార్ధాలు నిల్వ ఉంచాలంటే చెన్నైలోని కేంద్ర పేలుడు పదార్ధాల విభాగం నుంచి లైసెన్స్ తీసుకోవాలి . నిల్వకేంద్రం చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేందుకు సరిపడు స్థలము ఉండాలి . లైసెన్స్ పొందిన మేరకే నిల్వలు ఉంచాలి . అగ్నిమాపక శాఖాధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించాలి . కలెక్టర్ అనుమతి ఇవ్వాలి . ఇవేవి లేకుండానే పెద్దఎత్తున నిల్వలు రాజకీయ దన్నుతో ఉంచుతారు . నిబందనలకు నీళ్ళొదలడం అంటే ఇదేమరి .
నాటుబాంబులో వాడే పదార్ధములు :
గన్‌పౌడర్ , గంధకము (సల్ఫర్), పొటాషియం నైట్రేట్ , గాజుముక్కలు , రాళ్ళు , బొగ్గుపౌడర్ , గుడ్డముక్కలు , కోడి పేగులు , పురితాళ్లు ,
శ్రీకాకుళం జిల్లాలో తయారీ కేంద్రాలు :
జిల్లాలో జలుమూరు , పొందూరు , భామిని , బత్తిలి , కొత్తూరు , వీరఘట్టాం , పాతపట్నం , సీతంపేట , ఇచ్చాపురం . . ముఖ్యమైన వాటిలో కొన్ని ప్రాంతాలు . కొన్ని ప్రాంతాలవారు అడ్డదారి లో ఒరిస్సా రాష్ట్రం నుండి తెస్తూఉంటారు .
నాటు బాంబు పేలితే కలిగే నష్టము :
నాటుబాంబు ... రివాల్వర్ లో ఉపయోగించే తూటా కన్నా ప్రమాధకరము . తూటా వల్ల ఎదురుగా్ ఉన్న వారికే ప్రమాదము . నాటుబాంబు పేలితే చుట్టుప్రక్కల వారందరికీ ప్రమాదమే . తీవ్రస్థాయిలో నష్టము ఉంటుంది . వీటిలొ గాజుముక్కలు , మేకులు వంటివి ఉపయోగించడం వలన ఒక్కసారిగా అవి విరజిల్లుతాయి. సమీపమున ఉన్నవారందరు గాయపడతారు .
రాతి క్వారీ వాళ్ళు పేలుదు పదార్ధాలు వాడి విలువైన కొండలను నాశనము చేయుచున్నారు. వాతావరణ సమతుల్యము చెడిపోతుంది . జిల్లాలో ప్రకృతి అందాలు నాశనమయిపోతున్నాయి. వర్షాలు పడక అడవులు అభివృద్ది చెందడంలేదు. పంటలు ముఖ్యము గా మెట్ట పంటలు , గిరిజన పంటలు తగ్గిపోతున్నాయి .
శ్రీకాకుళం లో జరిగిన కొన్ని సంఘటనలు :
2004 లో శ్రీకాకుళం పట్నము లో బారీ పేలుడు జరిగింది . రెండు కుటుంబాలు కు చెందిన 14 మంది మరణించారు .
పొందూరులో అడవి పందులకోసం పెట్టిన బాంబు పేలి పచ్చగడ్డి మేస్తున్న ఆవు మరణించినది .
జూన్ 2011 లో గార మండలం వత్సవలస పంచాయతీ కార్యాలయం లో నాటు బాంబు పేలి ముద్దాడపేట కు చెందిన గీతకార్మికుడు మృతిచెందాడు .
రాజకీయ ప్రత్యర్దులు అనేక చోట్ల నాటుబాంబులు వినియోగించిన సంఘటనలు ఉన్నాని .
నక్షలైట్స్ ఎక్కువ సంచారము న్న శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబుల ప్రమాదం ఎక్కువే .
- ==================================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !