Wednesday, June 15, 2011

శ్రీకాకుళం జిల్లాలో పాడి అభివృద్ధి, Milk Dairy development in Srikakulam: శ్రీకాకుళం జిల్లా జనాభా సుమారు 27 లక్షలు . 38 మండలాలు , 5 మునిసిపాలిటీలతో కూడుకొని ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రోజులు సగటున 2 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంచనాలు ప్రకారము సగటున రోజుకు మనిషికి 0.25 లీటర్ల పాలు అవసరము .. అంటే జిల్లా అవసరలకు సుమారు 6.75 లక్షల లీటర్ల పాలు అవసరము .. ఇందుకు కారణము సరిగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందలేదు .

పసుసంపద :
అఖిల భారత గణాంకాల ప్రకారము శ్రీకాకుళం జిల్లాలో పశుసంపద ఇలా ఉంది .
సంవత్సరము ----------- జిల్లామొత్తము
2007-08 --- ఆవులు = 716287.
........................గేదెలు = 162965,
2010-2011---ఆవులు = 687944,
..........................గేదెలు = 130604,
అభివృద్ధి :

ఐటమ్‌---------------------------2001-------------------------------2010,
పాలకేంద్రాలు ----------------------320--------------------------------668,
పాలవినియోగము (ఒకరికి)----------100 మి.లీ.--------------------------200 మి.లీ.,
శీతలీకరణ కేంద్రాలు ----------------02----------------------------------13 ,
పాల సేకరణ ---------------------43,48,981 లీ.-----------------------1,71,80,176 లీ.,
పాల అమ్మకం -------------------26,57,587 లీ.-------------------------1,12,11,845 లీ.,
పాల ఉత్పత్తిదారులు --------------6,000 మంది------------------------32,000 మంది .

పాడి-పంట .... పిల్లా-జెల్లా ఇవే మన పల్లెసీమలకు ఒకప్పుడు తరగని నిధులుగా భావించేవాళ్ళు . ఇవన్నీ సమృద్ధిగా ఉంటే పల్లె పచ్చగున్నాట్లు లెక్క ! అమ్మ పాలకు నోచుకోనీ ఎందరో చిన్నారులు గోమాత క్షీరంతో పెరిగి పెద్దవాళ్లైనవారే .
జిల్లాలో పాల అవసరాలు ఇలా ఉన్నాయి .:
వ్యక్తికి రోజుకు 250 గ్రాములు పాలు వినియోగించాలని ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్ మెదిచల్ రీచెర్చి విభాగము సూచిస్తోంది. ఆమేరకు లెక్కిస్తే జిల్లాకు 6.75 లక్షల లీటర్ల పాలు అవసరము . పాలు సంపూర్ణ ఆహారము . మాంసకృత్తులు , పిండి పదార్ధాలు , కొవ్వుపదార్ధాలు , ఖనిజ లవణాలు , ఇతర విటమిన్లు సంపూర్ణముగా పాలలోనే లభిస్తాయి. జనాబా పెరుగుదలకు అనుకూలము గా పాడి పరిశ్రమ , పశుసంపద శ్రీకాకుళం జిల్లాలో పెరగడం లేదు . రైతులందరు పల్లెలు వీడి పట్నవాసానికి మొగ్గుచూపడం వలన పల్లె వాతావరణమే మారిపోతుంది . ఆ కొద్దిమంది రైతులు వారి బిడ్డలకు ఉద్యోగాలకోసం కొద్దో గొప్పో చదువులు చదివించి పట్నాలవైపు పంపడం మూలాన పల్లె లలో పనిచేసే యువత దొరకడం లేదు .

పాల కల్తీ :
పాలకు గిరాకీ పెరుగుతోంది . దీంతో కల్తీరాయళ్ళకు అడ్డు ఆపూ లేకుండా పోతోంది . ఒకప్పుడు పాలలో నీరు మాత్రమే కలిపేవారు . సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులోకి వచ్చి ప్రజలు లాక్టోమీటర్ల తో నాణ్యతను స్వయంగా తెలుసుకొనే వెలుసుబాటు కలగడం తో అక్రమార్కులు కొత్తదారులు తొక్కుతున్నాయి . మార్కెట్ లో దొరికే " స్టార్చ్ పౌడర్ ను , పంధారను కల్తీకి వినియోగిస్తున్నారు . వీటిని కలపడం వల్ల లాక్టోమీటర్ కు రీడింగ్ తగ్గకుండా నమోదవుతుంది . కావసినన్ని నీరు పోసి కుత్రిమ పాలు తయారవుతున్నాయి. దీనివలన దీర్ఘ కాలములో టి.బి. , బ్రూసిల్లోసిస్ వ్యాధులు వచ్చే ప్రమాదము ఉంటుంది . పాడి పశువులు ఎక్కువ కాలము , ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చేలా " ఆక్షిటోసిన్‌ వంటి హార్మోన్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు . ఈ పాలను త్రాగితె థైరాయిడ్ గ్రంధి జబ్బులు వచ్చే ప్రమాదము ఉంటుంది .

నిరుద్యోగులకు ఇదో స్వయం ఉపాది :
పశువులతోను , పేడతోనూ స్వయం ఉపాదా అని చిన్నబుచ్చుకోకుండా ఆలోచిస్తే పాడిపరిశ్రం నిజం గా కల్పవృక్షము తరహా పరిశ్రమే . పాడిని స్వయం ఉపాధి పరిశ్రమగా గుర్తించి నిరుద్యోగ యువత ముందుకు రావాలి . పెరుగుతున్న దాణా ధరలు కొంత అందోళన కలిగిస్తున్నా పూర్తిస్థాయి పరిశ్రమగా పాడిపరిశ్రమను నిర్వహిస్తే తప్పకుండా మంచి లాభాలు రావడం ఖాయం .
  • సంకరజాతి జర్సీ ఆవు రోజుకు సగటున 8 లీటర్ల వరకు పాలు ఇస్తుంది . హెచ్ .ఎఫ్. ఆవు 12 లీటర్లు ఇస్తోంది .
  • జెర్సీ ఆవు ధర రూ.25 వేలు , హెచ్.ఎఫ్. ఆవు ధర రూ.40 వేలు .
  • ముర్రా జాతి గేదె ధర రూ.40 వేలు వరకు ఉంటుంది . ఇది రోజుకు 8 లీటర్లు పాలు ఇస్తుంది .
  • ప్రతి లీటరు పాల ఉత్పత్తికి 2 కిలోల దాణా ఖర్చవుతుంది . ఆవు / గేదే రోజుకు 30 కిలోల పచ్చగడ్డి తింటుంది .
  • పాల ఉత్పత్తిలో సంగం ఆదాయం దాణాకు, ఇతర నిర్వహణకు ఖర్చుగా పోతుంది . ప్రతుతం విశాఖ డెయిరీ ఆవుపాలకు లీటరుకు 19 రూపాయిలు , గేదెపాలకు లీటర్ల్ కు 38 రూపాయిలు చెల్లిస్తోంది .
  • ఒక ఆవు రోజుకు సగటున 10 లీటర్ల పాలు ఇస్తే రూ.190 ఆదాయము వస్తోంది . రూ.90 దాణా , నిర్వహణ ఖర్చులు పోగా రూ.100 వరకు మిగులుతోంది .
  • ఒకరు 5 ఆవులు నిర్వహిస్తారనుకుంటే నెలకు రూ 15 వేలు దకా ఆదాయము వస్తుంది .
  • ఇవి కాకుండా సహ ఉత్పత్తులుగా వ్యవసాయానికి అవసరమైన గత్తం తయారవుతుంది .
  • పశువుల పేడ తో గోబర్ గ్యాస్ ప్లాంట్స్ పెట్టి వంట అవసరాలకు ఉపయోగించుకోవచ్చును
  • ========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !