వివిద రకాల బిల్లులు చెల్లింపులో జాప్యము తగ్గించుటకు , పని వేగవంతం చేయుటకు గాను అంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి జిల్లాలో ఇ-సేవాకేంద్రాలు ఏర్పాటు చేసినది .
శ్రీకాకుళం జిల్లాలో మొత్తము 5 కేంద్రాలు పనిచేయుచున్నవి .
- శ్రీకాకుళం పట్టణము లో -2 ,
- ఆమదాలవలస -1,
- పలాస -1,
- ఇచ్చాపురం -1-----------లలో చెరిఒకటి ఉన్నాయి .
కాశీబుగ్గ - ఫోను: 08945 242903
నరసన్నపేట - ఫోను: 08942 277138, 99669 80889
జోగిపేట నరసన్నపేట, ఫోను: 93912 11029
పప్పుల వీధి కూడలి, నరసన్నపేట - ఫోన్: 08942 277519
ఆమదాలవలస - ఫోను: 08942-287100
కలెక్ట్ చేయు బిల్లులు :
- విద్యుత్ ,
- టెలిపోన్ ,
- మునిసిపాలిటీల ఇంటిపన్నులు , నీటి పన్నులు తదితర పన్నులు ,
- రెవిన్యూశాఖ ,
- రవాణా శాఖ ,
రాష్ట్రంలో రాష్ట్రప్రభుత్వం 310 ఇ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వినూత్న సేవలందిస్తూ సంచలనంగా నిలిచిన మన రాష్ట్ర ఇ-సేవా కేంద్రాల్లో మరిన్ని సేవలందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 160 రకాల సేవలందిస్తున్న ఇ-సేవా కేంద్రాల్లో ఇకపై Passport దరఖాస్తు స్వీకరణ, Ration Cardలలో దిద్దుబాటు, PAN కార్డు దరఖాస్తు సేవ, Mobile Phone ద్వారా బిల్లుల చెల్లింపు, ఒక ప్రయివేటు మొబైల్ సేవల సంస్థకోసం డాక్యుమెంట్ల సేకరణ తదితర సేవలకు రంగం సిద్ధమైంది. రాజధాని హైదరాబాద్ నగరంలోని సచివాలయంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రి కె వెంకటరెడ్డి కార్యాలయంలో ఈ సేవల్ని ప్రారంభించారు..రాష్ట్రంలో 263 అర్బన్ ఇ-సేవా కేంద్రాల ద్వారా సాలీనా 400 లక్షల లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు సంభంధిత మంత్రిగారు చెప్పారు. ఇ-సేవ ద్వారా 160 సేవలను అందిస్తున్నట్లు చెప్పారు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కేంద్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2003 లో ప్రారంభించారు .ఉధోగులు పన్నెండు గంటల పని చేయవలసి ఉంటుంది .ఈ కేంద్రాల నిర్వహణను యునైటెడ్ టెక్నికల్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ 2003 నుంచీ 2010 వరకూ ఇ-సేవా కేంద్రాలను నిర్వహించింది. ప్రతి ఇ-సేవ కేంద్రానికీ మేనేజరు సహా పది మంది కంప్యూటరు ఆపరేటర్లనూ, ఇద్దరు రక్షక భటులనూ, సహాయకుడినీ నియమించారు. ఆపరేటరుకు రూ.1,600, మేనేజరుకు రూ.3,500, రక్షణ భటుడికి రూ.2000, సహాయకుడికి రూ.1500 చొప్పున వేతనాలు చెల్లించేవారు.2009 సెప్టెంబరులో 44 రోజులపాటు సమ్మె చేశారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. జీతాల పెంపుదలకు అంగీకరించింది. ఆపరేటర్లకు రూ.3,550, మేనేజర్లకు రూ.5000 రక్షక భటులకు రూ. 4000, సహాయకులకు రూ. 2000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని ఇ-సేవ యాజమాన్యం అమలు చేయలేదు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించే దిశగా సర్కిళ్ళవారీగా సిటిజన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు, ఫైల్ మేనేజిమెంట్ వ్యవస్థల అభివృద్ధిపైనా దృష్టి సారించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) నిర్ణయించుకుంది. ఇందుకు ఇ-సేవా కేంద్రాల్ని మరింతగా వినియోగించుకోవాలని భావిస్తున్నది.
=========================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.
waste institute
ReplyDelete