Monday, May 3, 2010

BSNL in Srikakulam , బి.ఎస్.ఎన్.ఎల్. శ్రీకాకుళం లో



బి.ఎస్.ఎన్.ఎల్ . భారత సంచార నిగం లిమిటెడ్ - 1947వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో కేవలం 47 ఫోన్‌ కనక్షన్లు ప్రారంభమై , అదికూడా ఉదయం నుంచి ప్రయత్నిస్తే ఎప్పటికో లైన్‌ కలిసి అవతలవ్యక్తులు మాట్లాడటానికి ఉండేదని, ఇప్పటికి సుమారు 52,225 కనెక్షన్లు ఇవ్వడం ఒక గొప్ప విజయము . ప్రస్తుతం 1 లక్షా 42 వేలమంది సెల్ వినియోగదారులు , 42 వేల మంది ల్యాండ్ లైన్క్ష్ వినియోగదరులు , 12560 విల్ పోను వాడకం దారులు ఉన్నారు .

2010 మార్చి 28 ఆదివారం శ్రీకాకుళం లో 3జి మొబైల్ సేవలను మంత్రి ధర్మాన ప్రసాదరవు ప్రారంభించారు . ప్రస్తుతం 370 కనెక్షన్స్ తో టౌన్క్ష్ కే పరిమితమయినది . జిల్లాలో 4 వేలు 3 జి కనెక్షన్క్ష్స్ లక్ష్యం గా పెట్టెఉకున్నారు .

శ్రీకాకులం జిల్లాలో 99 సెల్ టవర్లు ఉన్నాయి మరొక 69 టవర్లు యేర్పాటు ప్రయత్నం లో ఉన్నాయి .

దేశం లో 1986లో సంస్థలో ఆరు లక్షలు మంది ఉద్యోగులు ఉండేవారని, ప్రస్తుతం మూడు లక్షలు మంది ఉద్యోగులే ఉన్నారని అన్నారు. ప్రతిఏటా పది వేలమంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తున్నారని, ఇందుకనుగుణంగా ఖాళీలను భర్తీ చేయడంలేదని అన్నారు. 1986లో 1.53 కోట్ల మంది బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఉంటే నేడు 58 కోట్లకు పైగా వినియోగదారులున్నారని అన్నారు. వీరిలో 4.5 కోట్ల మంది ల్యాండ్‌లైన్‌ వినియోగదారులు ఉన్నారని అన్నారు. మొబైల్‌ రంగంలో 1997లో ప్రైవేటు కంపెనీలకు ఊతమిచ్చిన ప్రభుత్వం 2002లో బిఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ రంగంలోకి ప్రవేశించిందని అన్నారు. ఏడాది వ్యయంలో ప్రైవేటు నెట్‌వర్క్‌లను అధిగమించి ప్రజాసేవలో ముందంజలో ఉన్నాయని అన్నారు. దేశంలో ఏడు ప్రధాన పట్టణాల్లో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు , 40 వేలకు పైగా టవర్లు ఉన్నాయి .

update --Jan/2011

శ్రీకాకుళం లో బి.యస్.యన్‌.యల్ (Jan/2011)
సెల్ ఫోన్‌ వినియోగధారులు---= = 1,90,000 ;
ల్యాండ్ లైన్‌ వినియోగదారులు--- = 48,000,
విల్ ఫోన్‌ వినియోగదారులు ---- = 10900,
  • 04/Jan/2013
త్వరలో జిల్లాలో 69 సెల్‌ టవర్లు ఏర్పాటు-30 వరకు 3జి పరికరాలు అమరిక
 జిల్లా టెలికం మేనేజర్‌ మహంతి--భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) తన ఖాతాదారులకు మరింత మెరుగైన సెల్‌ఫోన్‌ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రూ. 27.60 కోట్లతో జిల్లావ్యాప్తంగా 69.. 2 జీ సెల్‌టవర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో 30 సెల్‌ టవరుల్లో 3 జీ సేవలు అందించే అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చనున్నారు. ఇప్పటికే జిల్లాలో 176 సెల్‌టవర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అదనంగా మరో 69 ఏర్పాటుచేయనున్నారు. వీటిలో 30వరకు త్రీజీ పరికరాలను అమర్చనున్నారు. ఇప్పటికే సెల్‌టవర్లను ఏర్పాటు చేసే స్థలపరిశీలనలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు నిమగ్నమై ఉన్నారు. వినియోగదారులకు ఈ సేవలు 6 నుంచి 9 నెలలలోపు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి జి.సిగడాం వరకు ఉన్న రైల్వే ట్రాక్స్‌ వరకు త్రీజీ సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా టెలికాం మేనేజర్‌ హెచ్‌.సి. మహంతి అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి 69 సెల్‌టవర్లు ఏర్పాటు చేయనున్నామని, వీటిలో ఇప్పటికే 50 వరకు స్థల ఎంపిక చేశామన్నారు.

updates ---- 13-feb-2013.

జిల్లాలో 9 ప్రాంతాల్లో 3-జీ సేవలు అందించేందుకు ప్రతిపాదించామని జిల్లా టెలికామ్‌ జనరల్‌ మేనేజర్‌ హెచ్‌.సి.మహంతి తెలిపారు. శ్రీకాకుళం, టెక్కలితో పాటు పలాస, రాజాం, నరసన్నపేట, పాతపట్నం, సోంపేట, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలలో 3జి సేవలు విస్తరించేందుకు ప్రతిపాదించామన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా దృశ్యశ్రవణ విధానంలో బ్రాడ్‌ బాండ్‌ టెలిఫోన్‌ ప్రారంభించించామన్నారు. రైల్వేట్రాక్‌ పొడవునా 3 జీ సేవలు కల్పించాలని ప్రయత్నిస్తున్నామని తద్వారా రైలు ప్రయాణంలో సైతం నిరాటంకంగా అంతర్జాలం సేవలు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. 3 జీ టవర్లు 30 నిర్మించేందుకు యోచిస్తున్నామన్నారు. జిల్లాలో నూతనంగా 69 సెల్‌ టవర్లు కొత్తవి నిర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 176 పనిచేస్తున్నాయని, 2,87,600 సెల్‌ఫోన్‌ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఇంజినీరింగ్‌ కళాశాలలకు తక్కువ ధరకు హైస్పీడ్‌ బ్రాండ్‌ బాండు అందిస్తున్నామని అన్నారు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎ.వి.యోగేశ్వరరావు మాట్లాడుతూ 55 శాతం ప్రజానీకానికి తమ సేవలు అందించగలుగుతున్నామని దీన్ని 70 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.  

  • update 11-May-2013
బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సౌకర్యార్థం జిల్లాలోని అతిత్వరలో 68 సెల్‌ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు టెలికం జనరల్‌ మేనేజర్‌ హెచ్‌.సి.మహంతి అన్నారు. శుక్రవారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ వినియోగదారులకు నెట్‌వర్క్‌ సమస్య తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా 16 సెల్‌ టవర్లను వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి గ్రామానికి బీఎస్‌ఎన్‌ఎస్‌ సేవలను విస్తరించేలా ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పలుచోట్ల అయిదు టవర్లను ప్రారంభించామన్నారు. రైల్వే ప్రయాణంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా 2జీ, 3జీ సేవలు వినియోగంలోకి తెచ్చామన్నారు.

కొత్తగా ఏర్పాటుచేసే టవర్ల స్థలాలు
అల్లినగరం, గురవాం, కొయ్యాం, లోలుగు, పల్లిసారధి, మెట్టూరు, నడుకూరు, తోటపాలేం, బొద్దాం, దేవుదల, తొగిరి, ఇచ్ఛాపురం పట్టణం, లుకలాం, రాపాక, బూరవెల్లి, గురండి.

update as on 21-04-2015


బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు మంచి అవకాశం


బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ నుంచి ...  రాత్రి 9 గంటల నుంచి మరుచటి రోజు 7 గంటల వరకు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా రాత్రంతా ఉచితంగా వినియోగదారులకు మాట్లాడుకొనే సౌకర్యాన్ని కల్పిస్తోంది. వచ్చే నెల(May 2015) ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా సెల్‌, ల్యాండ్‌లైనుకు రాత్రంతా ఉచితంగా మాట్లాడుకునే విధానాన్ని తీసుకువస్తున్నట్లు జీఎం హెచ్‌.సి.మహంతి సోమవారం తెలిపారు. ప్రస్తుతం పట్టణాలలో నెలకు ఉన్న రెంటల్‌ రూ. 140 రూ.160గా పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో రూ.120గా ఉన్న రెంటల్‌ను రూ.140కి పెంచుతున్నట్లు తెలిపారు. రాత్రివేళల్లో మాత్రమే ఉచితంగా దేశంలో ఎక్కడకైనా మాట్లాడుకొనే వీలును కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 22,600 ల్యాండ్‌లైను కనెక్షన్లు ఉన్నాయని, వీటిని మరింత పెంచేందుకు అవకాశాలు వెతుకుతున్నట్లు వివరించారు.
  • =================================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !