Monday, January 18, 2010

శ్రీకాకుళం లో పోస్ట్ ఆఫీసు , Post Offices in Srikakulam



పోస్టల్ డిపార్టుమెంటు మన దేశం లో " ఇండియన్ పోస్ట్ " అనే పేరు తో తపాలా సర్వీసులను నిర్వర్తిస్తుంది . మొత్తం 1,55,333 పోస్ట్ ఆఫీసు లతో ప్రపంచం లో అతిపెద్ద తపాలా సంస్థ . చైనా 57,000 పోస్ట్ ఆఫీసు లలో రెందేవ స్థానం లో ఉన్నది . మన తపాలా శాఖ సేవింగ్ బ్యాంక్ , కొన్ని ఫైనాన్స్ సర్వీసులను కుడా కలిగియున్నది . ఇది భారత సర్కారు ఆధీనము లో నడుపుతున్న సంస్థ . . . 1764 లో ప్రారంభించి న్యూ ఢిల్లీ కేంద్రం గా సుమారు 5,20,191- ఉద్యోగులతో పనిచేస్తున్నది .

శ్రీకాకుళం లో పోస్టల్ సర్వీసెస్ :

జిల్లా లో రెండు తపాలా డివిజన్ లు ఉన్నాయి
1 . శ్రీకాకుళం తపాలా డివిజన్--ఇచ్చాపురం నుండి రాజాం వరకు గల శ్రీకాకుళం డివిజన్ లో, శ్రీకాకుళం , టెక్కలి , ఆమదాలవలస ప్రధాన కేంద్రాలు గాను , 59 ఉప తపాలా కేందాలు , 422 శాఖా తపాలా కేంద్రాలు ఉన్నాయి .
2. పారవతీపురం డివిజన్ : లో శ్రీకాకుళం జిల్లాకి సంభందించి , జీ.సిగడాం ,పాలకొండ , వీరఘట్టం ప్రాంతాలు ఉన్నాయి .

పిన్ కోడ్ : చరిత్ర :
ఉత్తరాలు సకాలము లో గమ్యం చేరడానికి పిన్ కోడ్ ఎంతగానో ఉపకరిస్తోంది , పిన్ కోడ్ అంటే " postal index Number (PIN)" తపాలా కార్యాలయాల్లో లేబెలింగ్ తో పాటు బండిల్స్ కట్టేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది . పనులను వేగవంతం చేసేందుకు దోహదపడుతోంది .

దేశ వ్యాప్తము గా తపాలాశాఖ 1972 ఆగష్టు 15 తేదీన పిన్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు . దేశం ఓ ఒకే పేరు తో అనేక పట్టణాలు , గ్రామాలు ఉన్నందున ఒక ప్రాంతాన్నికి వెళ్ళే ఉత్తరాలు , పార్శిళ్ళు వేరే చోటికి వేల్ల్తుండడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి . దీంతో ఉత్తరాలు గమ్యానికి చేరడం లో విపరీతమైన జాప్యం చోటు చేసుకునే పరిస్థితి ఉండేది . ఈ సమస్యల నుంచి బయటపడేందుకు తపాలా శాఖ పిన్ కోడ్ విధానాన్ని ప్రవేసపెట్టింది ,. ప్రతి తపాలా కార్యాలయానికి , ఉపతపాలా కార్యాలయానికి ఆరు అంకెలు గల వేర్వేరు పిన్ కోడ్ కేటాయించారు . ఉపతపాలా కార్యాలయానికి కేటాయించిన పిన్ నే , సంబంధిత శాఖా తపాలా కార్యాలయాలు వినియోగిస్తున్నాయి .

పిన్ ప్రక్రియకు సంబంధించి దేశాన్ని 8 జోన్లు గా విభజించారు . ఆరు అంకె లో మొదటి అంకె రాష్ట్రాని , రెండో అంకె ప్రాంతాన్ని , మూడో అంకె జిల్లాను , మిగిలిన మూడు అంకెలు సంబంధిత ఉపతపాలా కార్యాలయాన్ని సూచిస్తుంది .

ప్రస్తుతం అమలులో ఉన్న పోస్టల్ సర్వీసెస్ :
  • స్పీడ్ పోస్ట్ ,
  • పేమెంట్ ,
  • లోజిస్తిక్ పోస్ట్ ,
  • పోస్ట్ ,
  • బిజినెస్స్ పోస్ట్ ,
  • మీడియా పోస్ట్ ,
  • డైరెక్ట్ పోస్ట్ ,
  • postal లైఫ్ ఇన్సూరెన్స్ ,
  • ఇన్స్టాంట్ మనీ ఆర్డర్ సర్వీసెస్ (iMO) ,
  • ఇన్తెర్నతిఒన మనీ ట్రాన్స్ఫర్ -- మున్నగునవి .

==================================================================

Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !