Tuesday, October 27, 2009

Kottamma talli temple at Kotabommali







కోటబొమ్మాలి నడిబొడ్డున ఉన్న ఈ అమ్మవారు చాలా పేరొందిన దేవత ... చుట్టుప్రక్కల గ్రామాలే కాక ఒరిస్సా నుండి చాలా మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు . యం.పి. కింజరాపు ఎర్రం నాయుడు .. ఇంటి దైవం గా ఈ కొత్తమ్మతల్లిని కొలుస్తారు . పూర్వము ఇది ముఖ్య గ్రామదేవత గా వేలిసేది .

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత

గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస , బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి

గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యము గా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలము లో మానవుడు ఎంతోతెలివైనవాడు,ఇంట్లోవున్న చిన్నా,పెద్దా,ఆడా,మగా-అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో ,కంచి కామాక్షమ్మ దగ్గరికో,బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళేవీలుండకపోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్సనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండావుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించుకొన్నామనే త్రుప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటుచేసారు పెద్దలు.


ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద,స్మార్త,ఆగమ శాస్త్ర పండితులచేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తిప్రపత్తులతోపాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి భాద్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి,ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిస్ట జరిగిన ఆ నెల,ఆ తిథి నాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
కొత్తమ్మతల్లి - చరిత్ర & ఆలయ విశేషాలు

  • =========================================================
Visit my Website > http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !