Monday, June 10, 2013

Srikakulam dist.Writers Aniversary day celebrations,శ్రీకాకుళం జిల్లా రచయితల వార్షిక మహాసభలు

  •  

  •  
ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సమాఖ్య నిర్వహణలో ఈనెల 9న జిల్లా రచయితల 23 వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డా.పులఖండం

శ్రీనివాసరావు, భాగ్యరేఖలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయి కవి సమ్మేళనం, గ్రంథావిష్కరణలు, సన్మానాలు ఉంటాయన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొనదలచిన

కవులు, రచయితలు తమ కవితలను ఈనెల 7లోగా పంపించాలని కోరారు. ఈనెల 9వతేదీ ఉదయం 9.30 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో మహాసభలు జరుగుతాయని అందరూ

పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

బహుముఖ 'కెరటం'-ప్రముఖుల ప్రశంసలు పొందిన రచన-యువ రచయిత వంశీ ప్రతిభ.

'ఓటమి అనుభవం కావచ్చు.. ఓటమి కొన్నిసార్లు అవసరం కావచ్చు.. కానీ ఓటమి అలవాటు కాకూడదు'
'ఎవరి పట్ల వారికి జాలి, ఉదాసీనత, వారి పతనానికి ప్రథమ లక్షణం'
ఇలాంటి కొన్ని అమృత వాక్కులు.. సూక్తుల సమాహారమే 'కెరటం' పుస్తకం. వ్యక్తిత్వ వికాసం, జీవన ప్రమాణాల మెరుగుకు సూచనలు, సున్నితమైన నైపుణ్యాలు.. ఇలా

జీవితానికి ఉపయోగపడే పలు అంశాలను తన జీవితానుభవాలతో ఏరికూర్చి.. కెరటంలా తెరపైకి తెచ్చారు యువ రచయిత వంశీకృష్ణ.

రాజాం నగరపంచాయతీ పరిధిలోని సారథి గ్రామానికి చెందిన వారాడ వంశీకృష్ణ విజయనగరంలోని మహరాజ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.

ఉద్యోగం చేస్తూనే.. తనలోని రచనా వ్యాసంగానికి పదును పెట్టారు. కళాశాలలో శిక్షణ అధికారిగా ఉండడం కూడా రచనలపై దృష్టి మరలడానికి కారణమని చెబుతారు. వివిధ

వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివి.. సముపార్జించిన జ్ఞానానికి స్వీయ అనుభవాలు జోడిస్తూ 'కెరటం' పుస్తకానికి బాటలు వేశారు.

ఏడాదిలో వెయ్యి కాపీలు
ఏడాది కాలంలో ఈ పుస్తకం వెయ్యి కాపీలను ఉచితంగా పంపిణీ చేశారు వంశీ. పుస్తకంలో జీవిత గమ్యాన్ని మార్చే అంశాలు మిళితం చేయడంతో యువతతో పాటు అన్ని

వర్గాల మన్ననలు పొందిందన్నారు. ఆనందకరమైన, స్ఫూర్తిదాయకమైన జీవితానికి చక్కని నైపుణ్యాలను పరిచయం చేసే విధంగా తీర్చిదిద్దిన ఈ పుస్తకం కాపీలు మరో

వెయ్యి ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖుల ప్రశంసలు
కెరటం పుస్తకం ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. పారిశ్రామిక దిగ్గజం గ్రంధి మల్లికార్జునరావు, విరసం అధ్యక్షుడు వరవరరావు, ప్రముఖ రచయితలు ఓల్గా, నందిని

సిద్ధారెడ్డి, ప్రజాగాయకుడు గోరటి వెంకన్నల ప్రశంలు పొందినట్లు రచయిత తెలిపారు.

'స్ఫూర్తి'కి శ్రీకారం
రెండో ప్రయత్నంగా 'స్ఫూర్తి' పుస్తకం రచన పూర్తి చేశారు వంశీ. ఇది ముద్రణ దశలో ఉంది. త్వరలోనే ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

తెలుగుకు వెలుగునివ్వండి--డా. ఎ.గోపాలరావు
తెలుగు మధురమైన అమృత భాష. ప్రస్తుత ఆధునిక సమాజంలో మృతభాష అయ్యే ప్రమాదముందని రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యుడు డా. ఎ.గోపాలరావు ఆందోళన

వ్యక్తం చేశారు. పట్టణంలో ఏడురోడ్ల కూడలి సమీపంలో ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సమాఖ్య 23వ వార్షిక  మహాసభలు, జిల్లా రచయితల సభలో పాల్గొని

పలు గ్రంథాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. తెలుగు భాష వికాసానికి ప్రతి జిల్లాకు ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి జిల్లాలో పలు రకాల

పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. తెలుగుభాష మహావృక్షమని, వేళ్లకు పట్టిన చీడను, దీని చిగుళ్లు మాడిపోకుండా సంరక్షించాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు. నల్గొండ

జిల్లాలో వందశాతం తెలుగు అమలుకు అక్కడ జిల్లా కలెక్టర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. నల్గొండ జిల్లా నమూనా ప్రతి జిల్లాకు అందించడమే కాకుండా కొత్త పదకోశాలు

రూపొందిస్తున్నట్లు చెప్పారు. తెలుగుభాష మృతభాష కావడానికి పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, ప్రతికారంగం, ప్రభుత్వాలే కారణమని

చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన డా. ఎన్‌.వి.రమణారావు రాసిన డా. సుందరరావు ఎం.డి. నవలను, వి.సరస్వతీ రాసిన

సప్తస్వరసింధు నవలను ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర స్ఫూర్తిప్రధాతలు పుస్తకాన్ని గోపాలరావు ఆవిష్కరించగా టంకాల గోపాలకృష్ణగుప్త పరిచయం చేశారు. డా.

విజయభాస్కర్‌ రాసిన మహాశూన్యం కావ్యం ఆవిష్కరించగా బమ్మిడి సుబ్బారావు పరిచయం చేశారు. డాక్టరు సుందరరావు ఎం.డి. నవలను భమిడిపాటి గౌరీశంకర్‌

సమీక్షించారు. ఈ సందర్భంగా భమిడిపాటి గౌరీశంకర్‌, చిత్రకారులు ఎల్‌.ఈశ్వరరావులను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు డా. పులఖండం

శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత తితితే జేఈవో రుంకు అప్పారావు, సమాఖ్య గౌరవాధ్యక్షుడు భావశ్రీ, టంకాల బాబ్జి,  డా. జి.కొండలరావు, కింతలి

కృష్ణమూర్తి, కిల్లాన భోజ్‌కుమార్‌, కె.వి.రాజారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం పి.మహితశ్రీ శాస్త్రీయ నృత్యప్రదర్శన కనువిందు చేసింది. ముందుగా బొడ్డేపల్లి

వెంకటలక్ష్మి గానం చేశారు ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో తెప్పల కృష్ణమూర్తి, అధికారుల నీలకంఠం, వి.వేమన, డా. కోమలరావు, కె.వి.రాజారావు, తోట

సుబ్బారావు, గుడిమెట్ల గోపాలరావు, బమ్మిడి సుబ్బారావు, కిల్లాన ఆదినారాయణ తదితరులు తమ కవితలను చదివారు. ఆంధ్రప్రదేశ్‌ సాహితీ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన

కార్యదర్శి రామిశెట్టి భాగ్యరేఖ సంస్థ నివేదికను చదివారు.

Courtesy with : --న్యూస్‌టుడే- రాజాం & న్యూస్‌టుడే-శ్రీకాకుళం(సాంస్కృతిక)

  • ======================
Visit my Website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !