- శ్రీకాకుళం జిల్లాలో మొత్తము 160 ఉండేవి . అవి రానురాను 50 కి తగ్గిపోయాయి . శ్రీకాకుళం జిల్లాలోని 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఒక రైతు వ్యవసాయ సహకార సంఘం ఉన్నాయి. ప్రస్తుతానికి జిల్లా మొత్తం మీద సుమారు 1.30 లక్షల ఓటర్లు ఉన్నారు. ఒక జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్( డిసిసిబి) ఉన్నాయి. ప్రతి వ్యక్తి సభ్యత్వం కోసం 300 రూపాయిలు చెల్లించవలసి ఉంటుంది .
కొంతమంది వ్యక్తులు కలసి తమ అందరి బాగోగుల కోసం పనిచేయడాన్ని సహకారం (Cooperation) అంటారు. ఒక్కరు చేయలేని పనిని కొంతమంది కలసి సాధించవచ్చును. ఇలా కొంతమంది కలసి ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమించడమే సహకారోద్యమం (Cooperative movement). ఇలా ఏర్పడిన సంఘాలను సహకార సంఘాలు (Cooperative Societies) అంటారు. ఇందులో భాగస్వాములైన వ్యక్తులకు కొన్ని నిర్ధిష్టమైన ఆశయాలుంటాయి. సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరూ కలసి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సహకార సంఘాలు మొదట జర్మనీ దేశంలో స్థాపించబడ్డాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సహకారోద్యమం ప్రారంభమైంది. భారతదేశంలో 1904 సంవత్సరంలో ఈ ఉద్యమం ప్రారంభమైనది. వీటికి సహాయం చేయడానికి ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖలు ఏర్పాటుచేయబడ్డాయి. రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిలలో సహకార భూమి తనఖా బ్యాంకులు స్థాపించబడ్డాయి. మన రాష్ట్రంలో వివిధ రంగాల్లో సుమారు పన్నెండు వేలకు పైగా సహకార సంఘాలున్నట్లు అంచనా.
వ్యవసాయం మన ప్రజల ముఖ్యమైన వృత్తి. దీనికి కావలసిన పెట్టుబడులు లభించక రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని వానిని సకాలంలో తీర్చలేక తమ స్థిరాస్తులను అమ్ముకోవడం జరుగుతోంది. రైతులే సహాకార సంఘాన్ని స్థాపించుకొని, దాని ద్వారా తమకు కావల్సిన నాణ్యమైన పరికరాలు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు, ఎరువులు పొందవచ్చును. పండిన పంటలకు కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించుకోవచ్చును.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నది. వీటికి అయిదేళ్ల పదవీకాలం . ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలకు ఎ న్నికలకు జిల్లా ఎన్నికల అథారిటిగా కలెక్టర్ వ్యవహరిస్తుండగా జిల్లా సహకార శాఖ అధికారి పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతాయి. ఒక్కో సంఘానికి 13 మంది డైరెక్టర్లు, వందలాది సంఖ్యలో రైతులు సభ్యులుగా ఉంటారు. రాజకీయ పార్టీల గుర్తులతో సహకార సంఘాల ఎన్నికలు జరుగనప్పటికీ పరోక్షంగా రాజకీయ పార్టీల నీడనే ఈ ఎన్నికలు సాగుతుండటంతో అన్నిపార్టీలు వీటిని ప్రతిష్టాత్మంగానే తీసుకుంటున్నాయి.
2011లో సవరించిన సహకార చట్టం మేరకు ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం (పిఎసిఎస్)లో సభ్యుల జాబితాను 13నుండి 9మందికి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డిసిసిబి)లో 16 నుండి 9మందికి కుదించడంతో పాటు పిఎసిఎస్‌ల్లో బిసి మహిళకు, డిసిసిబిలో ఇద్దరు జనరల్ మహిళా సభ్యులకు స్థానం కల్పించారు. ఓటర్ల జాబితాలో సైతం మార్పులు తెచ్చి భూమి ఉన్న వారికే 300రూపాయల మూలధనంతో కూడిన ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించారు. అయితే సవరించిన నియమాల మేరకు ఈ దఫా ఎన్నికలు నిర్వహిస్తారా లేక వాటిల్లో మరికొన్ని మార్పులు చేస్తారా అన్నది ప్రభుత్వం ప్రకటించే ఎన్నికల ప్రకటనతో మాత్రమే స్పష్టత వస్తుందని సహకార సంఘాల అధికారులు అంటున్నారు.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో క్షేత్రస్థాయిలో దాదాపు 9 వేల మందికి పైగా సిఇవోలు, గుమస్తాలు, అటెండర్లుగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు పరపతి సంఘాలకు కార్యదర్శిగా వ్యవహరించిన వారిని ప్రస్తుతం సిఇవోలుగా పేరు మార్చి కొనసాగిస్తున్నారు.
- =================
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !