Thursday, November 12, 2009

Mani Nageswara Temple at Kallepalli













Kallepalli is a village located around 5 kilometers from Srikakulam town in Andhra Pradesh, India.

River Nagavali meets the Bay of Bengal near the village Kallepalli... at Mopasubandaru village. This area is surrounded by Casorina thops and Cashew & Palm trees. . . and most of the area is a fertile paddy growing fields . Big sea shore with Casorina trees appears beautiful and plesent atmosphere.

In 'Karteeka Maasam' ie. in the month of Nov. people go for picnics arround this area . Nagavali river and Bay of Bengal ocean meets here called "Nagavali Moga" appears excellent with heeps of sand and streem of water mingiling in the sea water .

In kallepalli village there is an old Shiva temple called " Maninageswararao " Temple , famous for those with "Naga dosa" devotees .

Here the Lord shiva appears as " ArdhaNareeswar Swamy " front appearence is shiva and back appearence is Parvathi .

This temple is established in 'dwaparayuga ' by Balaram , the brother of Lord Sri Krishna during the era of Kurukshetra battle . There after developed by many kings and rulers of this area .

telugu story :
కల్లేపల్లి గౌరీ-మణినాగేశ్వరరావు ఆలయం :
నాగావళి నది బంగాళాఖాతం లో కలిసే పవిత్ర సంగమక్షేత్రం ఈ కల్లేపల్లి మొగ . ఇరు తీరాల సరుగుడు తోటలు, తాటి చెట్లు , జనంతో విరగబూసినట్టు వుత్సాహంతో వూగి పోయే ఆకుల్ని వువ్వుల్ని కాక మనుషుల్ని ఆటలు పాటలు, నవ్వులు, తుళ్ళింతలు కేరింతలు తో కల్లేపల్లి కోవెల పరిసరాలు పరవశించి పోతూ ఉంటాయి . .

ఇక్కడి శివలింగాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్టించేడంటారు. కురుక్షేత్ర యుద్ధంలో రక్త పాతం తన కళ్ళతో చూడలేని అతను తీర్థ యాత్రలకు బయలు దీరి , బలరాముడు అనేక పుణ్య క్షేత్రాల్ని దర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చేడట. అక్కడి ప్రజలు త్రాగేందుకు నీరు లేక బాధపడుతుంటే ప్రస్తుతం ఒరిస్సాలోని పాయకపడులోని కలహంది ప్రాంతం లో ఈశ్వరునికి తపస్సు చేసి , ఈశ్వరుని కటాక్షము తో బలరాముడు నాగలి మొనతో పాయను తవ్వగా నీరు ఉద్భవించినది . నాగలి తో ఉద్భవించిన నది కాబట్టి దీని పేరు నాగావళి అయ్యిందట. దీన్ని ‘లాంగుల్యా’ అనీ అంటారు. తన నాగలి తో శ్రీకాకుళం జిల్లా లోని కల్లేపల్లి వరకు కొనసాగించి మోపాసు బందరు దగ్గర సముద్రం లో కలిపేరు .

యీ నది ఒడ్డునే ... పాయక పాడు తర్వాత. గుంప, సంగం, శ్రీకాకుళం, కళ్ళేపల్లిలో ఒకే రోజు - అనగా "జేష్ట బహుళ ఏకాదశి " నాడు పంచలింగాలు ప్రతిష్ఠించాడట. యీ ఐదు క్షేత్రాల్ని ఒకే రోజు అభిషేకం చేసిన వాళ్ళకు పునర్జన్మ వుండదని నమ్ముతారు భక్తులు. ఇదే రోజు అంటే "జేష్ట బహుళ ఏకాదశి " నాడు శివ పార్వతుల కళ్యాణము చేస్తారు .

”బలదేవుడు పాద స్పర్శతో పునీతమైన నేలలో మనం నిలుచున్నామనే భావన నాకేదో తెలియని పారవశ్యాన్ని కలుగజేస్తోంది. ”పురాతన యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచిన యీ శైవ క్షేత్రం కను మరుగై పోకుండా గవరమెంటు వారి దేవాదాయ శాఖ వారు కొంతవరకు మెరుగులు దిద్దుతున్నారు , స్తానికు కుడా కొంతవరకు దీని అభివృద్ధి కి దోడపడు చున్నారు ..
కోవెలంటే కేవలం రాళ్ళ పేర్పు మాత్రమే కాదు కదా. అది వేలసంవత్సరాల జనం విశ్వాసాల కూర్పు, సాంస్కృతిక మూలాల నిర్మాణం. భక్తి, పూజ, దేవుడు.. కేవలం బయటికి చెప్పే కారణం మాత్రమే. అనేక జాతుల, భిన్న మతాల, వివిధ ప్రాంతాల, భిన్న సంస్కృతుల ప్రజలను ఒక చోటికి చేర్చే సంగమ క్షేత్రం, ఐక్యతా సందేశాన్ని లోకానికి అందించే గొప్ప వేదికలు కదా. దేవాలయాలు కాలప్రవాహానికి ఎదురు నిలిచిన శిల్పకళా ప్రాభవానికి ప్రతీకలు.... దేవాలయాలు మన జాతి సాంస్కృతిక సంపదలు. గుడి పాతబడి పోవడమంటే ప్రాచీన జాతి సంపదను భావి తరాలకు అందకుండా పోవడంగా భావించాలి…”

”హలాయుధుడైన బలరాముడు తొలుత రైతు ప్రతినిధిగా మనకు దర్శన మిచ్చే పురాణ పురుషుడు. నాగావళీ జల ఘోస తో నా శరీరం అలలు అలలుగా పులకరించింది.

ఇక్కడ ఉన్న పవిత్ర తటాకం ఒకప్పుడు బాగున్నా ఇప్పుడు మురికి కూపం గా మారినది . దీనిలో పశువులు కడగడం , బహిర్భూమి కోసం వాడడం , చెత్త ,చెదారం తో నిండి ఉన్నది . దేవుడే కాపాడు గాక .



Go to Pancha Lingas

-------------------------------------------------------
Visit my Website > http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !