


Nagavali river----------------------------Nagavali & Janjhavati meeting place









Location :
Chennakeswara (SomeswaraSwamy) Temple at Gumpa near Kotapam(Mandalam),Parvatipuram(Tq) (vijayanagaram(dt) A.P),
గుంప సోమేశ్వరాలయం.
నాగావళి జంఝావతి నదుల పవిత్ర సంగమక్షేత్రం. ఇరు తీరాల తోటలు, చెట్లు జనంతో విరగబూసినట్టు. వుత్సాహంతో వూగి పోయేయి. ఆకుల్ని వువ్వుల్ని కాక మనుషుల్ని ఆటలు పాటలు, నవ్వులు, తుళ్ళింతలు కేరింతలు గుంపకోవెల పరిసరాలు పరవశించపోయేయి. ఇక్కడి శివలింగాన్ని ద్వాపర యుగంలో బలదేవుడు ప్రతిష్టించేడంటారు. కురుక్షేత్ర యుద్ధంలో రక్త పాతం తన కళ్ళతో చూడలేని తీర్థ యాత్రలకు బయలు దేరిన బలరాముడు అనేక పుణ్య క్షేత్రాల్ని దర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చేడట. ఒరిస్సా లోని పాయకపోడు దగ్గర తన హలాయుధంతో నేలను చీల్చితే ఒక నీటి పాయ వుబికి వచ్చిందట. అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి హలాయుధంతో ఆ నీటి పాయను తన వెంట తీసుకెళ్ళి కళ్ళేపల్లి సముద్ర తీరంలో కలిపాడట. అదే నాగావళిగా మనం పిలుస్తున్న నది. బలరాముని నాగలి మొనతో ఉద్భవించిన నది కాబట్టి దీని పేరు నాగావళి అయ్యిందట. దీన్ని ‘లాంగుల్యా’ అనీ అంటారు.
యీ నది ఒడ్డునే పాయక పాడు తర్వాత. గుంప, సంగం, శ్రీకాకుళం, కళ్ళేపల్లిలో ఒకే రోజు - అనగా "జేష్ట బహుళ ఏకాదశి " నాడు పంచలింగాలు ప్రతిష్ఠించాడట. యీ ఐదు క్షేత్రాల్ని ఒకే రోజు అభిషేకం చేసిన వాళ్ళకు పునర్జన్మ వుండదని నమ్ముతారు భక్తులు.
శ్రీశైలం నుండి వచ్చిన ఓ జంగమయ్య యి ఏటి ఒడ్డున వెదురు గుంపుల మధ్య శివలింగాన్ని చూసి ఇక్కడే పూజాదికాలు నిర్వహిస్తూ వుండిపోయేడట. ఆ తరువాతేప్పుడో 1617 సం.లో జయపురం మహారాజు విశ్వంభర మహాదేవ్ దేవాలయం నిర్మాణం గావించారని చెబుతారు.
”బలరామ" దేవుడు పాద స్పర్శతో పునీతమైన నేలలో మనం నిలుచున్నామనే భావన తెలియని పారవశ్యాన్ని కలుగజేస్తోంది. హరికథా పితామహుడు ఆదిభట్ల బండి కట్టించుకుని వచ్చాడంటారే ఆ గుంప…యిదే ”.
”పురాతన యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచిన యీ శైవ క్షేత్రం కను మరుగై పోతున్న నేపద్యంలో ‘ఆలయం అదృశ్యమైపోతున్న దృశ్యం! బాధ కలిగినది . కోవెలంటే కేవలం రాళ్ళ పేర్పు మాత్రమే కాదు కదా. అది వేలసంవత్సరాల జనం విశ్వాసాల కూర్పు, సాంస్కృతిక మూలాల నిర్మాణం. భక్తి, పూజ, దేవుడు.. కేవలం బయటికి చెప్పే కారణం మాత్రమే. అనేక జాతుల, భిన్న మతాల, వివిధ ప్రాంతాల, భిన్న సంస్కృతుల ప్రజలను ఒక చోటికి చేర్చే సంగమ క్షేత్రం, ఐక్యతా సందేశాన్ని లోకానికి అందించే గొప్ప వేదిక కదా. దేవాలయాలు కాలప్రవాహానికి ఎదురు నిలిచిన శిల్పకళా ప్రాభవానికి ప్రతీకలు.... దేవాలయాలు మన జాతి సాంస్కృతిక సంపదలు. గుడి పాతబడి పోవడమంటే ప్రాచీన జాతి సంపదను భావి తరాలకు అందకుండా పోవడంగా భావించాలి…”
”హలాయుధుడైన బలరాముడు తొలుత రైతు ప్రతినిధిగా మనకు దర్శన మిచ్చే పురాణ పురుషుడు.
Go to Pancha Lingas
Visit my Website > http://dr.seshagirirao.tripod.com/
No comments:
Post a Comment
Your comment is important for improvement of this web blog . Thank Q !