Tuesday, October 27, 2009

Jama Masjid (G.T road)



    


















Jama Masjid also Jami Masjid, refers to the Friday Mosque, where Jummah or weekly Friday noon congregation prayers of Muslims take place. In Srikakulam the Jama Masjid is a religious place to see is a beautiful mosque that reflects the Islamic style of architecture. It has been built over centuries and is of impressive architecture . It has four tall spiral towers which can be seen over the rooftops and many prayer halls , each made of a piece of deodar tree trunk. It also has a garden and a place for those seeking peace and solitude.

Jamia Masjid of srikakulam is one of the biggest Mosque in Andrapradesh . This was constructed by first Foujdhar of Chikakole(old name for present Srikakulam town) late Sri Share Mohammdh Khan .. during 'KuleeKutubh Shaw ruling time . 18 ekars of land was alloted for this mosque and is an example 4 centuries of Muslims history in Srikakulam town . This walls are constructed with Lime & Rocks and there Two Minars each constructed with 3 single big rocks . inside the Mosque there are five flower like designs present and we can hear five different sounds ... one from each . This is the specialty of building .

There is a saying that a pigeon was used to do 'Namaj" on hearing the prayers of Religious priests . A samaadhi of that Pigeon constructed in this mosque after death of that pigeon .








 











 శ్రీకాకుళం జామియా మసీదు శ్రీకాకుళం పట్నం నడిబొడ్డున సూర్యమహల్ జంక్షన్‌ కి దగ్గరిలో ఉన్నది.  దీనిని శుక్రవారం మాస్క్ అని పేరు ఉంది . ప్రతి శుక్రవారము ముస్లిం సోదరులు ప్రార్ధనలకు వస్తారు. దీనిలో నాలుగు టవర్లు నాలుగు దిక్కులా ఉండి ఇస్లాం భవన నిర్మాణ స్టైల్ ని పోలి ఉంటుంది.  రాస్ట్రములోని అతిపెద్ద మసీదుల్లో ఇదొకటి . కులీకుతుబ్ షా కాలములో చికాకోల్ తొలి ఫౌజ్ దార్ గా నియమితులైన షేర్ మహమ్మద్ ఖాన్‌  కాలములో దీన్ని కట్టారని పెద్దలు , చరిత్రకారులు చెప్తారు. తరతరాల ముస్లిం చరిత్రకు సజీవ సాక్షింగా , నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర ఉన్నది. 18 ఎకరాల విస్తీర్ణం లో దీనిని నిర్మించారు .

ప్రస్తుత కాలములో సిమ్మెంటు , ఇనుము విపరీరము గా  వాడి అన్ని భనాలు కట్టడము జరుగుతూఉంది. . . కాని దీన్ని సున్నము , రాతి కట్టడం తో నిర్మించారు. ఎత్తుగా మూడు ఏకశిలల తో కాట్టిన రెండు మీనార్లు దర్శనమిస్తాయి. లోపల భాగములో  ఐదు పూల ఆకారాలలో మీనార్లు ఉండి ఒక్కోదగ్గర ఒక్కో శబ్దం వినిపించడము విశేషము . మతగురువులు ప్రార్ధనలు విని అక్కడొక పావురము నమాజు చేసేదని ప్రశస్థి .. ఆ పావురము చనిపోగా దాని సమాధి కూడా నిర్మించారు .


 గ్యార్వీ షరీఫ్ ఉ్సవం : 
ఇరాక్ బాగ్దాద్ షరీఫ్ షేక్  అబ్దుల్ ఖాదీర్ జిలానీ జ్ఞాపకార్ధము ఈ ఉత్సవము నిర్వహిస్తారు . 2014 లో ఫిబ్రవరి 11 మంగళవారము జరిపారు. ఈ ఉత్సవములో భాగము గా ఉదయం ఫజర్ నమాజు , ఖురాన్‌ పఠనము , మగరీబ్ నమాజు , అనంతరము ముస్లిం మత పెద్దలు ఆధ్యాత్మిక ప్రసంగం జరిగినది. కలకత్తాకు చెందిన ముఫ్తీ మహమ్మదద్ అఫ్జల్ హుస్సేన్‌  రీజ్వీ మిన్‌బాహీ ఆధ్యాత్మిక  ప్రసంగం  చేసారు . ఈ కార్యక్రమములో జామియా మసీదు ఇమామ్‌ మెహతాబాలం అలీం , సుల్తాన్‌లు , మత పెద్దలు ,పెద్ద  సంఖ్యలో ముస్లిం లు పాల్గొన్నారు .

  • ====================================
Visit my Website >dr.seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is important for improvement of this web blog . Thank Q !